Infection cases
-
తరచూ ఇన్ఫెక్షన్.. ప్రమాదం కాదా?
నాకిప్పుడు నలభై ఏళ్లు. ఏడాదికి 3–4 సార్లు యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తోంది. అన్నన్నిసార్లు యాంటీబయాటిక్స్ వాడితే ప్రమాదం కాదా? ఇలా తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – పేరు, ఊరు వివరాలు రాయలేదు.మహిళల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ సర్వసాధారణం. యూరినరీ ఓపెనింగ్ అంటే యురేత్రా అనేది.. మోషన్ ఓపెనింగ్ అంటే మలద్వారానికి దగ్గరగా ఉండటం వల్ల బ్యాక్టీరియా ఈజీగా వెజైనా,యురేత్రా, బ్లాడర్‌లోకి ప్రవేశిస్తుంది. మహిళల్లో యురేత్రా షార్ట్‌గా ఉండటం వల్ల మరింత త్వరగా బ్యాక్టీరియా బ్లాడర్‌లోకి వెళ్తుంది. తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం, మూత్రాన్ని ఆపుకోలేకపోవడం, అర్జెన్సీ ఫీలవడం, మూత్రంలో మంట, దుర్వాసన వేయడం, మూత్రంలో రక్తం ఆనవాళ్లు వంటివి ఉన్నాయంటే యూరిన్ ఇన్ఫెక్షన్ మొదలైందని అర్థం.ఆడవాళ్లలో 40–50 ఏళ్ల మధ్య ఎక్కువసార్లు యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే చాన్సెస్ ఉంటాయి. దీనికి ఈస్ట్రజన్ హార్మోన్ లోపం ఒక కారణం. కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారిలో యూరినరీ ట్రాక్ట్‌లో బ్లాక్స్‌తో కూడా తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్కి గురవుతుంటారు. రోగనిరోధక శక్తి తక్కువున్నవారిలోనూ యూరిన్ ఇన్ఫెక్షన్ చాన్సెస్ పెరుగుతాయి. ఎక్కువసేపు మూత్రాన్ని ఆపుకున్నవారిలోనూ బ్యాక్టీరియా రెండింతలయ్యే చాన్సెస్ ఎక్కువై తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్ రావచ్చు.కొన్ని సింపుల్ మెథడ్స్‌తో ఈ ఇన్ఫెక్షన్ని నివారించవచ్చు. యూరిన్, మోషన్ పాస్ చేసిన తర్వాత గోరువెచ్చని నీటితో ముందు నుంచి వెనక్కి క్లీన్ చేసుకోవాలి. మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకోవద్దు. రోజుకు కనీసం 8 నుంచి 10 గ్లాసుల మంచినీరు తాగాలి. కాఫీ, సుగర్ లోడెడ్ డ్రింక్స్‌కి దూరంగా ఉండాలి. టైట్ ఇన్నర్‌వేర్స్, డ్రాయర్స్ అవాయిడ్ చేయాలి. కాటన్ లోదుస్తులనే వాడాలి. స్ట్రాంగ్ పర్ఫ్యూమ్స్, సబ్బులను వెజైనా ప్రాంతంలో వాడకూడదు. స్ట్రాంగ్ యాంటీబయాటిక్స్ ఎక్కువసార్లు వాడటం వల్ల అవి పనిచేయడం మానేస్తాయి.అందుకే యూరిన్ కల్చర్, సెన్సిటివిటీ టెస్ట్ చేసి ఏయే యాంటీబయాటిక్స్ సెన్సిటివిటీ ఉందో చూసి అది వాడటం మంచిది. కొంతమందికి రికరెంట్ ఇన్ఫెక్షన్ వస్తూంటే ఏ మెడిసిన్ లేదా ప్రివెంటివ్ మెథడ్ పనిచేయనప్పుడు యూరాలజిస్ట్ కన్సల్టేషన్తో ప్రొఫిలాక్టిక్ లో డోస్ యాంటీబయాటిక్స్ని ఇస్తారు. ఏ ప్రాబ్లమ్ వల్ల తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్కి గురవుతున్నారో కనిపెట్టడం కొంతమందిలో సాధ్యమవుతుంది.అంటే సుదీర్ఘ ప్రయాణాలు, లైంగిక సంపర్కం వంటివాటితో యూరిన్ ఇన్ఫెక్షన్ రావచ్చు. ఇలాంటి వారికి ఒక డోస్ యాంటీబయాటిక్ టాబ్లెట్‌ని ఇస్తారు. ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ని చెక్ చెయ్యాలి. మెనోపాజ్ వయసులో ఈస్ట్రజన్ క్రీమ్‌తో కూడా ఇన్ఫెక్షన్ని నివారించవచ్చు. ఆరునెలల కాలంలో రెండు లేదా అంతకన్నా ఎక్కువసార్లు ఇన్ఫెక్షన్స్ ఉన్నా.. ఏడాదిలో మూడుసార్లు ఇన్ఫెక్షన్స్ ఉన్నా దానిని రికరెంట్ యూరినరీ ఇన్ఫెక్షన్ అంటారు. తొలిదశలోనే గుర్తిస్తే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చికిత్సను అందించవచ్చు.– డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ఇవి చదవండి: బుల్లీయింగ్‌ను నిర్లక్ష్యం చేయొద్దు.. -
ఎంతపనైపాయే! పొరపాటున నాలుక కరుచుకుంది..అంతే ఊపిరాడక..
మాట్లాడుతూ లేదా భోజనం చేస్తూ నాలుక కరుచుకోవడం అనేది సర్వసాధారణం. కరచుకున్న వెంటనే బాధగా ఉంటుంది. ఆ తర్వాత కాసేపటికి లేదా మరుసటి రోజుకి తగ్గిపోతుంది. అంత సీరియస్ అయిన ఘటనలు ఇంతవరకు జరగలేదు కూడా. కానీ ఇక్కడొక మహిళకు ఎదురైన విపత్కర స్థితిని చూస్తే మాత్రం వామ్మో!నాలిక కరచుకుంటే ఇంతలా జరుగుతుందా? అని ఆశ్చర్యపోవడం ఖాయం. ఆ మహిళ భోజనం చేస్తూనే అనుకోకుండా నాలిక కరుచుకుంది. అదే ఏకంగా ఆమె ప్రాణాలను కోల్పోయే స్థితికి దారితీసింది. ఈ అనుహ్య ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..27 ఏళ్ల ఆస్ట్రేలియన్ మహిళ కైట్లిన్ అల్సోప్ తన స్నేహితులతో కలిసి భోజనం చేస్తుండగా నాలుక కరుచుకుంది. ఆ టైంలో ఆమెకు కాస్త నొప్పిగా అసౌకర్యంగా అనిపించింది. సర్వసాధారణంగా జరిగేదే కదా అని తేలిగ్గా తీసుకుంది. అంతే కొన్ని గంటలకే ఊపిరి ఆడటం, శ్వాస తీసుకోవటం కష్టమై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఒక్కసారిగా స్నేహితులంతా ఆమె పరిస్థితిని చూసి కంగుతిన్నారు. వెంటనే ఆమెను హుటాహుటినా ఆస్పత్రికి తరలించి ఎమర్జెన్సీ కేసు అంటూ టెస్ట్‌లు చేయడం ప్రారంభించారు వైద్యులు. ఆమె ఒక విధమైన అనాఫిలాక్సిస్ అనే ఎలర్జీకి గురయ్యిందని చెప్పారు. తక్షణమే కొన్ని మందులు ఇచ్చి పరిస్థితి నార్మల్‌కి వచ్చేలా యత్నించారు వైద్యులు. ఐతే అనూహ్యంగా ఆమె పరిస్థితి విషమంగా మారడం ప్రారంభమైంది. చూస్తుండగానే చర్మం ఎరుపు నుంచి నీలం రంగులోకి వచ్చేసింది. ఆమె నాలుకు నల్లగా అయిపోవడం జరిగింది. ఇక ఆమె నాలుకను తీసేయాల్సి వస్తుందని భావించి వెంటనే అప్రమత్తమయ్యి వివిధ వైద్య పరీక్షలు నిర్వహించారు వైద్యులు. చివరికి ఆమె అరుదైన లుడ్విగ్స్ ఆంజినా అనే ప్రాణాంతక ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. ఇది నోరు, మెడ వరుకు ఉన్న మృదుకణజాలంపై ప్రభావం చూపే ప్రాణాంతక సెల్యూటైటిస్గా పేర్కొన్నారు. ఈ ఇన్ఫెక్షన్ ఆమె నోటిలో ఉండే జ్ఞాన దంతాల కారణంగా వచ్చిందని, ఇది ఆమె నోటిలోకి వేగంగా వ్యాపించడం ప్రారంభించిందని అన్నారు. ఇదికాస్త సెప్సిస్‌కి గురయ్యి అవయవాన్ని తీసేయాల్సిన ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందన్నారు వైద్యలు. తక్షణమే చికిత్స అందించేందుకు ఆమెకు మత్తు ఇచ్చి ట్రీట్మెంట్ చేయడం ప్రారంభించారు. ఆక్సిజన్ సరఫరా తక్కువగా ఉన్నందున్న ఇతర అవయవాలు మూసుకుపోకుండా చూసుకోవాల్సి ఉందని ఇది చాలా క్రిటికల్ ఆపరేషన్ అని చెప్పారు. సూమారు గంటపాటు వైద్యలు శ్రమించి కొద్దిపాటి శస్త్ర చికిత్స చేశారు. ఇప్పుడిప్పుడే క్లైటిన్ కోలుకుంటోంది. లుడ్విగ్ ఆంజినా అంటే.. ఇటీవల జరిగిన గాయం ఇన్ఫెక్షన్కి గురయ్యినా లేదా మధుమేహం, మద్యపానం, పోషకాహారలోపం తదితరాల కారణంగా గాయలైతే అది లుడ్విగ్ ఆంజినా అనే ఎలర్జీకి గురయ్యి రోగి పరిస్థితిని దిగజారస్తుంది. ఇది సాధారణంగా దంతాల ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందట. దాదాపు 10 నుంచి 9 కేసుల్లో దవడలోని రెండవ లేదా మూడవ దంతాల నుంచి మొదలవుతుందని వైద్యులు చెబుతున్నారు. దీని లక్షణాలు మాట్లాడటం కష్టం అధిక జ్వరం, చలి దవడలో నొప్పి మెడ నొప్పి వాపు వాచిపోయిన నాలుక నోరు సున్నితత్వం మారడం తీవ్రమైన పంటి నొప్పి నివారణ: లుడ్విగ్ ఆంజినాను నివారించాలంటే నోటి పరిశుభ్రత పాటించాలని చెబుతున్నారు వైద్యులు. దంతాలు పుచ్చిపోకుండా చూసుకోవాలని చెప్పారు. దంతాల ఇన్ఫెక్షన్ కారణంగానే వస్తుందని అన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది దంతాలు ఇన్ఫెక్ట్ కాకుండా ఉండేలా చేస్తుందని కూడా చెప్పొచ్చు అంటున్నారు వైద్యులు. (చదవండి: ఆ వ్యాధి క్యాన్సర్ కంటే ప్రాణాంతకం! చికిత్స కూడా లేదు!) -
Conjunctivitis: కండ్లకలక బారిన పడకుండా ఉండొచ్చా?
వర్షాకాలం కారణంగా గత కొన్ని రోజులుగా దేశంలో పలు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు సీజన్‌కి తగ్గట్టుగా వచ్చే వ్యాధులు ప్రజలపై దాడి చేస్తున్నాయి. ఈ తరుణంలో పెరుగుతున్న కండ్లకలక కేసులు మరింత కలవారుపాటుకు గురిచేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా తేమతో కూడిన వాతావరణం కావడంతో వైరస్లు, బ్యాక్లీరియాలు పెరిగేందుకు ఇది కాస్త అనుకూలంగా ఉంటుంది. దీంతో దేశంలో కళ్లకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు ఎక్కువయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, ఈశాన్యా రాష్ట్రాలలోని చిన్నారులు అధికంగా ఈ వ్యాధి భారిన పడ్డారు. అంతేగాదు మహారాష్ట్రలోని పూణేలో అలంది అనే పట్టణంలో కేవలం ఐదు రోజుల్లోనే దాదాపు 2,300 కండ్లకలక కేసులు నమోదయ్యాయి. ఇక అరుణాచల్‌ప్రదేశ్ అయితే కండ్లకలక వ్యాప్తి నేపథ్యంలో పాఠశాలలను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశించింది. యమునా నది వరద కారణంగా ఢిల్లీలో ఈ కంటి ఇన్ఫెక్షన్లు గతేడాదికంటే అధికంగా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అసలు కండ్లకల అంటే ఏమిటి? వర్షాకాలంలో ఇది వస్తుందా? తదితరాలు గురించి చూద్దాం!. 'ఐ ఫ్లూ' అని కూడా పిలుస్తారు కళ్లను ప్రభావితం చేసే ఇన్ఫెక్షనే కండ్లకలక. దీన్ని వైద్య పరిభాషలో 'ఐ ఫ్లూ' లేదా 'పింక్ ఐ' అని కూడా పిలుస్తారు. ఇది కంటిని కప్పి ఉంచే స్పష్టమైన పొర కండ్లకలక వాపుకు కారణమవుతుంది. ఎందువల్ల వస్తుందంటే.. ఏదైనా అలెర్జీ కారకాలు లేదా పొగ, దుమ్ము, పుప్పొడి లేదా రసాయనాల నుండి వచ్చే గాఢతతో కూడిన గాలి కంటి ఫ్లూకి దారితీయవచ్చు. కాంటాక్ట్ లెన్స్‌లను ఎక్కువ కాలం ధరించడం లేదా వాటిని సరిగా శుభ్రం చేయకుండా ధరించడం తదితరాల కారణంగా ఈ కంటి ఇన్ఫెక్షన్ రావచ్చు. అలాగే జలుబు లేదా దగ్గు వంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్ కారణంగా కూడా ఈ కంటి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గొంతు, కంటి ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే వైరస్ ఒకటే కావడమే అందుకు కారణం. ఈ ఇన్ఫెక్షన్ లక్షణాలు ఈ వ్యాధి లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కొలా ఉంటుంది. ఐతే అందరిలో కామన్‌గా కనిపించేది.. స్టికీ డిశ్చార్జ్‌తో కళ్ళు ఎర్రగా ఉంటాయి. దురదగా అనిపించడం. కళ్ల నుంచి అదేపనిగా నీరు రావడం. కళ్లు తెరవలేకపోవడం, కంటి నొప్పి తదితర లక్షణాలు వ్యాధి సోకిన పేషెంట్లో కనిపిస్తాయి. ఈ సీజన్లోనే ఎందుకు.. వేడి వాతావరణం నుంచి ఒక్కసారిగా కూల్‌గా మారుతుంది. దీనికితోడు వర్షాకాలం కావడంతో విపరితమైన నీటి ఎద్దడిన ఉంటుంది. దీంతో నీటి వనరులన్నీ కలుషితమవుతాయి. దీంతో వైరస్లు, బ్యాక్టీరియాలు పెరిగేందుకు అనుకూలంగా ఉంటుంది. మనం తెలియకుండా ఆ నీటితో కడుక్కోవడంతో ఈ ఇన్ఫెక్షన్లు, సీజనల్ వ్యాధులు అన్ని మూక్ముమ్ముడిగా దాడి చేస్తాయి. ఈ వాతావరణ మార్పులు తగ్గట్టు సరైన శుభ్రత పాటించకపోవడంతో ప్రజలు ఈ వర్షాకాలంలో ఈ వ్యాధుల బారినపడే అవకాశాలు అధికం. నివారణ: కృత్రిమ కన్నీళ్లు లేదా ఏదైనా లూబ్రికేటింగ్ కంటి చుక్కలను ఉపయోగించడం ప్రభావంతమైన చికిత్సలలో ఒకటి. వేడి నీటితో కాటన్ క్లాత్‌ని ముంచి కళ్లను కడగడం. పరిశుభ్రతను పాటించాలి. యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్లతో కూడిన యాంటీబయాటిక్ కంటి చుక్కలు మాత్రమే ఉపయోగించాలి. వ్యాధిని ముదరిపోయేంత వరకు నిర్లక్ష్యం చేస్తే ఈ యాంటిబయోటిక్స్ కూడా పనిచేయవని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే.. మంచి పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం. కనీసం 20 సెకన్ల పాటు సబ్బుతో కడుక్కోవడం. వెచ్చని నీటితో తరచుగా మీ చేతులను కడగడం వంటివి చేయాలి ముఖ్యంగా మీ కళ్ళను తాకడానికి ముందు లేదా తర్వాత కంటి చుక్కలు వేయండి. మీ కళ్ళను తాకడం లేదా రుద్దడం మానుకోండి ఒకవేళ మీకు కండ్లకలక ఉంటే, శుభ్రమైన, తడి వాష్‌క్లాత్ లేదా తాజా కాటన్ బాల్ని ఉపయోగించి మీ కళ్ళను క్లీన్ చేసుకోండి. దీంతోపాటు దిండ్లు, వాష్‌క్లాత్‌లు, తువ్వాళ్లు, కంటి చుక్కలు, కన్ను లేదా ముఖ అలంకరణ, మేకప్ బ్రష్‌లు, కాంటాక్ట్ లెన్స్‌లు, కాంటాక్ట్ లెన్స్ నిల్వ కేసులు లేదా కళ్లద్దాలు వంటి వ్యక్తిగత వస్తువులను షేర్ చేయవద్దు. వీటిలో వైరస్ లేదా బాక్టీరియా ఉండే అవకాశం ఉంది. దీంతో ఒకరి నుంచి మరొకరికి ఈజీగా సంక్రమించే అవకాశం ఉంటుంది. మీ తలగడ కవర్లను తరుచుగా మార్చండి. వేడినీటి డిజర్జెంట్లోను వాష్ చేయండి. ప్రతి రోజు శుభ్రమైన టవల్ లేదా వాష్ చేసిన క్లాత్ ఉపయోగించండి. విటమిన్ ఏ, సీలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోండి. రెగ్యులర్ కంటి చెకప్‌లు చేయించుకోండి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధి నుంచి సత్వరమే బయటపడొచ్చు లేదా రాకుండా జాగ్రత్తపడవచ్చు కూడా. (చదవండి: నేడు ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవం..ఎన్నో జంటలను వేధించే సమస్య) -
ద.కొరియాలో కోవిడ్ తీవ్రం
సియోల్/బీజింగ్: దక్షిణ కొరియాలో కోవిడ్ (కరోనా వైరస్) ఉధృతి పెరుగుతోంది. కోవిడ్ బారిన పడి, చికిత్స తర్వాత కోలుకున్న 73 ఏళ్ల మహిళ మళ్లీ ఈ వ్యాధి బారిన పడటంతో వైద్యాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే వారం రోజుల క్రితమే డిశ్చార్జ్ అయిన ఆ మహిళ రోగ నిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోవడం వల్ల మరోసారి ఇన్ఫెక్షన్ బారిన పడిందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అధికారులు తెలిపారు. శనివారం ద.కొరియాలో వ్యాధి బారిన పడిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. మొత్తం 3150 మందికి వ్యాధి సోకినట్లు నిర్ధారణ కాగా... వీరిలో 813 మందిని తాజాగా గుర్తించారు. కొత్తగా గుర్తించిన కేసుల్లో 90 శాతం దేగూ సిటీలోనివేనని, ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు వ్యాధికి బలైనట్లు వైద్యాధికారులు తెలిపారు. దీంతో ఈ వ్యాధితో మరణించిన వారి సంఖ్య 17కు చేరుకుంది. మరో 2.6 లక్షల మందికి వ్యాధినిర్థారణ పరీక్షలు జరగాల్సిన నేపథ్యంలో వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాధి విజృంభణ నేపథ్యంలో దక్షిణ కొరియాలోS ఇప్పటికే పలు కార్యక్రమాలు రద్దయ్యాయి. చైనాలో 2,835కి చేరిన మరణాలు చైనాలో కరోనా వైరస్ ఉధృతి క్రమేపీ తగ్గుతోంది. చైనా ఆరోగ్య కమిషన్ శనివారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. శుక్రవారం 47 మంది వ్యాధి కారణంగా మరణించగా మరో 427 మంది కొత్తగా వ్యాధిబారిన పడ్డారు. కోవిడ్ కారణంగా ఇప్పటివరకూ మరణించిన వారి సంఖ్య 2,835 కాగా, నిర్ధారిత కేసుల సంఖ్య 79,251. డిసెంబరు రెండో వారం మొదలుకొని ఈ వ్యాధికి చికిత్స పొందిన వారిలో 39,002 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. -
పురుడుకొస్తే.. పుట్టెడు కష్టాలు!
♦ ప్రసూతి విభాగంలో పెరుగుతున్న ఇన్ఫెక్షన్ కేసులు ♦ వార్డు చాలక ఇబ్బంది పడుతున్న రోగులు తెనాలి అర్బన్: జిల్లా వైద్యశాలలోని ప్రసూతి విభాగం అస్తవ్యస్తంగా తయారైంది. వార్డులో రోగుల సంఖ్య ఎక్కువ కావటంతో బెడ్లు చాలక బాలింతలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కొందరు బాలింతలు ఇన్ఫెక్షన్ సోకి ఇబ్బందులు పడుతున్నారు. తెనాలి జిల్లా వైద్యశాలలో ప్రతిరోజూ సుమారు వంద మందికిపైగా గర్భిణీలు ఓపీ కింద వైద్య సేవలు పొందుతుంటారు. వీరు కాకుండా ప్రసూతి వార్డులోని 50 వరకు పరుపులు నిత్యం బాలింతలతో నిండి ఉంటాయి. అలాగే గైనిక్ వార్డు పక్కనే ఉండే గదుల్లో ఎన్ఎన్సీయులో చికిత్స పొందే చిన్నారుల తల్లులు ఉంటారు. విస్తృతమైన సేవలు.. గతంలో గైనిక్ విభాగంలో వైద్య సేవలు అంతంత మాత్రంగా అందుతుండేవి. వైద్యుల కొరత వల్ల ఈ పరిస్థితి ఉండేది. అయితే మూడేళ్ల నుంచి గైనిక్ విభాగంలోని అన్ని పోస్టులను భర్తీ చేశారు. ప్రస్తుతం సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ ఒకరు, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు ముగ్గురు, సీనియర్ రెసిడెంట్ ఒకరు పనిచేస్తున్నారు. దీంతో గైనిక్ వైద్యుల కొరత తీరినట్లు అయ్యింది. దీంతో గైనిక్ విభాగం రోగులతో నిత్యం నిండి ఉంటుంది. కొన్ని కేసులను గుంటూరు పంపుతున్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం బెడ్లు చాలక ప్రతి నెలా కొందరిని గుంటూరు పంపాల్సి వస్తోందని వైద్యులు చెబుతున్నారు. జిల్లా వైద్యశాల ఆవరణలో నూతనంగా నిర్మించిన తల్లి–పిలల్ల వైద్యశాలను త్వరగా ప్రారంభిస్తే గుంటూరు పంపే కేసుల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. ఇబ్బంది పడుతున్న రోగులు ప్రసూతి వార్డులో రోగుల సంఖ్య పెరగటంతో ఒక్కో సందర్భంలో ఒక్క బెడ్‌పై ఇద్దర్ని పండుకోబెడుతున్న సందర్భాలు కన్పిస్తున్నాయి. ఇదిలా ఉంటే వార్డులో చికిత్స పొందుతున్న కొందరు బాలింతలకు ఇన్ఫెక్షన్ సోకి ఇబ్బందులు పడుతున్నారు. దీనివల్ల సిజేరియన్ చేయించుకున్న బాలింతలు కుట్లు మానక, వాటి నుంచి పస్ వస్తుందని పలువురు బాలింతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆర్థిక స్థోమత ఉన్న కొందరు బాలింతలు వెంటనే ప్రైవేట్ వైద్యశాలకు వెళ్లి ఇన్ఫెక్షన్కు చికిత్స చేయించుకుంటుండగా, మరికొందరు బతుకు జీవిడా అంటూ అక్కడే తగ్గే వరకు ఉండి అనంతరం వెళ్తున్నారు. ఇన్ఫెక్షన్ తగ్గించే ఇళ్లకు పంపుతున్నాం.. గైనిక్ వార్డులో చికిత్స పొందే రోగుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో రోగులను ఉంచే అవకాశంలేక గుంటూరు రిఫర్ చేయాల్సి వస్తోంది. వార్డులో చికిత్స పొందుతున్న బాలింతను చూసేందుకు ఎక్కువ సంఖ్యలో వారి బంధువులు వస్తున్నారు. వీరివల్ల కొందరు బాలింతలకు ఇన్ఫెక్షన్ వస్తున్న మాట వాస్తవం. అలాంటి రోగులకు కూడ మంచి యాంటిబయాటెక్స్ మందులు వాడుతున్నాం. చాలా వరకు ఇక్కడే వారి ఇన్ఫెక్షన్ తగ్గించి ఇళ్లకు పంపుతున్నాం.– డాక్టర్ సనత్ కుమారి, సూపరింటెండెంట్, జిల్లా వైద్యశాల, తెనాలి