Infratel
-
అతిపెద్ద మొబైల్ టవర్ కంపెనీగా ఎయిర్టెల్
సాక్షి, ముంబై: దేశీయ టెలికాం దిగ్గజం భారతి ఎయిర్టెల్ తన టవర్ యూనిట్‌ను ప్రత్యర్థి కంపెనీలో విలీనం చేసేందుకు ఆమోదం తెలిపింది. భారతి ఇన్ఫ్రాటెల్ లిమిటెడ్‌ను ఇండస్ టవర్స్ లిమిటెడ్‌తో విలీనం చేస్తున్నట్టు బుధవారం ప్రకటించింది. ఈ డీల్ విలువ 10.8 బిలియన్ డాలర్లు(రూ. 71,500 కోట్లు)ఈ ఒప్పందంలో భారతి ఇన్ఫ్రాటెల్ ప్రతి ఇండస్ టవర్ వాటాకి 1,565 షేర్లను చెల్లించేందుకు అంగీకరించినట్టు భారతి ఎయిర్టెల్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. 2019 , మార్చి 31 ఈ ఒప్పందం పూర్తి కానుందని భావిస్తున్నామని తెలిపింది తాజా డీల్‌తో చైనా వెలుపల భారత్‌లో అతిపెద్ద మొబైల్ టవర్ కంపెనీగా ఎయిర్టెల్ ఆవిర్భవిస్తుంది. విలీనం తరువాత ఆవిర్భవించే ఉమ్మడి సంస్థ ఇండస్ టవర్స్ లిమిటెడ్‌గా కొనసాగనుంది. దీనికి మార్కెట్ రెగ్యులేటర్ల తుది ఆమోదం పొందాల్సి ఉంది. సంస్థగా విలీనం అనంతరం భారతదేశం అంతటా 163,000కు పైగా టవర్లను నియంత్రిస్తుంది. మరోవైపు ఒప్పందం ప్రకారం భారతి-ఇండస్ జాయింట్ సంస్థలో 783.1 మిలియన్ల కొత్త షేర్లు వోడాఫోన్‌కు లభిస్తాయి. అయితే ఇండస్‌లో వాటాను మరో టెలికాం సంస్థ ఐడియా అమ్ముకోవచ్చు లేదా, అదనంగా కొత్తషేర్లను కొనుక్కునే అవకాశాన్ని కల్పించింది. ఈ వార్తల అనంతరం భారతి ఎయిర్టెల్ 2 శాతం లాభాలతో కొనసాగుతుండగా , భారతి ఇన్ఫ్రాటెల్ స్వల్ప నష్టాలతో కొనసాగుతోంది. కాగా ఇన్ఫ్రాటెల్, వొడాఫోన్ ఇండియాలకు ఇండస్ టవర్స్‌లో 42 శాతం వాటా ఉండగా మిగిలిన వాటా ఐడియా సెల్యులార్‌ది. తాజా ఒప్పందంతో సమీప ప్రత్యర్థి అయిన బీఎస్ఎన్ఎల్తో పోలిస్తే రెండున్నర రెట్ల పరిమాణం గల కంపెనీ అవుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి -
ఇన్ఫ్రాటెల్లో ఎయిర్టెల్ వాటాల విక్రయం
న్యూఢిల్లీ: రుణభారాన్ని తగ్గించుకునేందుకు నిధుల సమీకరణ ప్రయత్నాల్లో భాగంగా టెలికం దిగ్గజం భారతి ఎయిర్టెల్ తమ అనుబంధ సంస్థ భారతి ఇన్ఫ్రాటెల్లో 8.3 కోట్ల షేర్లను స్టాక్ మార్కెట్లో విక్రయించింది. తద్వారా రూ.3,325 కోట్లు సమీకరించింది. ఈ లావాదేవీతో భారతి ఎయిర్‌టెల్‌తో పాటు ఇతర అనుబంధ సంస్థల వాటా భారతి ఇన్ఫ్రాటెల్లో 53.51 శాతానికి పరిమితం కానుంది. సెప్టెంబర్ ఆఖరు నాటి గణాంకాల ప్రకారం ఇన్ఫ్రాటెల్లో ప్రమోటర్ల వాటాలు 58 శాతంగా ఉన్నాయి. విలీనం కాబోతున్న మరో రెండు టెలికం దిగ్గజాలు వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్‌లు కూడా భారత్‌లోని తమ టవర్ల వ్యాపారాన్ని ఏటీసీ టెలికం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థకి రూ.7,850 కోట్లకు విక్రయిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. పూర్తి స్థాయి అనుబంధ సంస్థ నెటిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా ఎయిర్టెల్ తాజా షేర్ల విక్రయ లావాదేవీ నిర్వహించింది. సోమవారం నాటి క్లోజింగ్ ధరతో పోలిస్తే 3.6 శాతం డిస్కౌంట్‌తో షేరు ఒక్కింటికి రూ.400.6 చొప్పున విక్రయించినట్లు ఎయిర్టెల్ తెలిపింది. ఈ నిధులను రుణభారాన్ని తగ్గించుకునేందుకు ఉపయోగిస్తామని సంస్థ తెలిపింది. సెప్టెంబర్ ఆఖరుకి కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఎయిర్టెల్ రుణభారం రూ.91,480 కోట్లు. -
భారతీ ఇన్ఫ్రాటెల్లో 10% వాటా విక్రయం
► కేకేఆర్, సీపీపీఐబీలకు అమ్మేసిన భారతీ ఎయిర్టెల్ ► ఒప్పందం విలువ రూ.6,194 కోట్లు న్యూఢిల్లీ: టెలికం దిగ్గజ కంపెనీ.. భారతీ ఎయిర్టెల్ తన మొబైల్ టవర్ల విభాగం భారతీ ఇన్ఫ్రాటెల్లో 10.3 శాతం వాటాను విక్రయించింది. ఈ వాటాను కేకేఆర్, కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్(సీపీపీఐబీ) కన్సార్షియమ్కు రూ.6,193.9 కోట్లకు విక్రయించామని భారతీ ఎయిర్టెల్ తెలిపింది. 10.3 శాతం వాటాకు సమానమైన 19 కోట్లకు పైగా షేర్లను ఒక్కో షేర్‌ను రూ.325 సగటు ధరకు విక్రయించామని వివరించింది. ఈ వాటా విక్రయం కారణంగా వచ్చిన నిధులను రుణభారం తగ్గించుకోవడానికి వినియోగించాలని ఎయిర్టెల్ కంపెనీ భావిస్తోంది. ఈ వాటా విక్రయానంతరం భారతీ ఇన్ఫ్రాటెల్లో భారతీ ఎయిర్‌టెల్‌కు 61.7 శాతం వాటా, కేకేఆర్, సీపీపీఐబీకు 10.3 శాతం చొప్పున వాటాలుంటాయి. భారత వృద్ధిపై, భారత ప్రభుత్వ ‘డిజిటల్ ఇండియా’ కార్యక్రమ ప్రయత్నాలపై అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు ఉన్న నమ్మకానికి ఈ ఇన్వెస్ట్మెంట్ ఒక నిదర్శనమని భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్‌భారతీ మిట్టల్ వ్యాఖ్యానించారు. టెలికం మౌలిక రంగం భవిష్యత్తు సానుకూలంగా ఉండనున్నదనడానికి కూడా ఈ ఇన్వెస్ట్మెంట్ ఒక ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. కాగా కేకేఆర్ సంస్థ భారతీ ఇన్ఫ్రాటెల్లో ఇన్వెస్ట్ చేయడం ఇది రెండోసారి. గతంలో అంటే 2008–15 కాలంలో కేకేఆర్ నిర్వహణలోని కొన్ని ఫండ్స్ భారతీ ఇన్ఫ్రాటెల్లో కొంత వాటాను కొనుగోలు చేశాయి. డీల్ నేపథ్యంలో బీఎస్ఈలో భారతీ ఇన్ఫ్రాటెల్ షేరు ధర మంగళవారం 2 శాతం లాభంతో రూ.319 వద్ద ముగిసింది.