Injapur
-
ఇంజాపూర్లో దొంగలు బీభత్సం
హైదరాబాద్: వనస్థలిపురం ఇంజాపూర్లో శుక్రవారం అర్థరాత్రి దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. పురాతన శ్రీవెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో దొంగలు చోరీ చేశారు. ఆ క్రమంలో అడ్డువచ్చిన వాచ్మెన్పై దాడి చేశారు. పురాతన పంచలోహ విగ్రహాలను అపహరించారు. అనంతరం వారు అక్కడి నుంచి పరారైయ్యారు. వాచ్మెన్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు స్పందించి... సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. చోరీ జరిగిన తీరును పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విగ్రహాలు చాలా పురాతనమైనవి అని స్థానికులు తెలిపారు. సొత్తు విలువ రూ. 1.50 లక్షలు ఉంటుందని అంచనా. గతంలో కూడా ఇదే తరహాలో ఈ దేవాలయంలో చోరీలు జరిగాయని.. ఆ విగ్రహాలు ఇప్పటికీ రికవరీ కాలేదని పోలీసులు తెలిపారు. -
భర్తను గొంతునులిమి హతమార్చిన భార్య
-
భర్తను గొంతునులిమి హతమార్చిన భార్య
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా ఇంజాపూర్లోని బాలజీనగర్లో దారుణం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో తాళికట్టిన భర్తనే హతమార్చిందో భార్య. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. స్థానికంగా నివాసం ఉంటున్న శ్రవణ్ కుమార్, పావని దంపతుల మధ్య గత కొద్దికాలంగా గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. దాంతో భర్త వేధింపులకు విసిగిపోయిన పావని... శ్రవణ్ కుమార్ను గొంతునులిమి హతమార్చింది. కాగా శ్రవణ్ కుమార్ గత కాలంగా మద్యం సేవించి భార్య పావనిని మానసికంగా, శారీరకంగా వేధిస్తుండేవాడని, దాంతో వేసారిన ఆమె ఈ హత్య చేసినట్లు సమాచారం. వనస్థలిపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితురాలిని విచారిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.