విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడడం నేరం
మెట్పల్లి మున్సిప్ మేజిస్ట్రేట్ సంతోష్‌కుమార్
ఇబ్రహీంపట్నం : విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడితే నేరమని, ర్యాగింగ్ చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని మెట్పల్లి మున్సిప్ మేజిస్ట్రేట్ సంతోష్‌కుమార్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో న్యాయవిఙ్ఞాన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చెడు అలవాట్లకు లోనుకాకుండా ఉన్నతస్థాయికి ఎదిగేలా చదువుకోవాలన్నారు. 18 ఏళ్లు నిండని వారు డ్రైవింగ్ చేయకూడదని, బాలికలకు వివాహాలు చేయడం నేరమని, ఎవరైనా ప్రోత్సహిస్తే వారిపై కూడా కేసులు నమోదు చేస్తామన్నారు. వివిధ చట్టాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. పోలీస్ స్టేషన్ సమీపం నుంచి కళాశాలకు వచ్చేందుకు రోడ్డు నిర్మించాలని మేజిస్ట్రేట్‌కు వినతి పత్రం అందజేశారు. అనంతరం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేశారు. స్టోర్ గదిని, కూరగాయలను, వంట గదిలో భోజనాలను పరిశీలించారు. మోడల్‌స్కూల్‌ను పరిశీలించి బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేసి విద్యార్థులకు వండిన భోజనాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఎస్సై రాజారెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కంతి మోహన్‌రెడ్డి, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్‌రెడ్డి, ఏపీపీ శేఖర్, న్యాయవాదులు బాజోజి భాస్కర్, వేణుగోపాల్, రమేశ్, శ్రీధర్, శ్రీనివాస్, రాంబాబు, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.