రాహుల్ గాంధీ 'ఓ అమాయకపు బాలుడు'
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వేదికలు ఎక్కి చేసే ఉపన్యాసాలన్ని ఎవరో రాసి ఇస్తే తప్ప సొంతంగా ఆయన ఏమీ మాట్లాడలేరని సమాజవాది పార్టీ నేత, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రి అజాంఖాన్ విమర్శించారు. యూపీ పర్యటనలో భాగంగా రాహుల్ యువరాజు కొత మిషన్లు, ప్లైవుడ్ ప్యాక్టరీల వద్ద ర్యాలీలు నిర్వహిస్తున్నారన్నారు. రాహుల్ గాంధీ ఓ అమాయకపు బాలుడుగా ఆయన అభివర్ణించారు. అదే విషయాన్ని గతంలో యోగా గురువు రామదేవ్ చెప్పారని ఆయన గుర్తు చేశారు.
గత రాత్రి బుదన్లో అజాంఖాన్ విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్‌పై విమర్శల వర్షం కురిపించారు. ముజఫర్‌నగర్‌లో మత ఘర్షణలపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను ఈ సందర్భంగా ఖండించారు. దేశంలో మత ఘర్షణలకు కాంగ్రెస్ పార్టీయే అజ్యం పోసిందని ఆయన మండిపడ్డారు. ఓ విధంగా చెప్పాలంటే భారత్‌లో మతఘర్షణలకు కాంగ్రెస్ పార్టీ పునాదులు వేసిందని అజాంఖాన్ ఆరోపించారు.