కౌబాయ్ కల్చర్ డోర్స్
పదిలంగా అల్లుకున్న పొదరింటికైనా.. అదిరిపోయే మేడకైనా.. అందంతో పాటు రక్షణ కల్పించేది ప్రధాన ద్వారాలే. సింహద్వారానికి ఎంట్రెన్స్ చూపించే మెయిన్ గేట్‌కు ఉన్న ఇంపార్టెన్స్ అంతాఇంతా కాదు. అందుకే సిరిగలవారు ఇన్నోవేటివ్ గేట్లతో తమ ఇంటికి మరింత అందాన్ని తీసుకొస్తున్నారు.
అందుకే రాజమహళ్లకు కాపుకాసే మహాద్వారాలను తలదన్నే రేంజ్లో నయా జమానా గేట్లు దర్శనమిస్తున్నాయి. అద్దాలతో మెరిసేవి.. కౌబాయ్ కల్చర్‌ను గుర్తు చేసేవి.. ఉడెన్‌తో తీర్చిదిద్దినవి.. ఇలా రకరకాల గేట్లు స్వాగతం పలుకుతున్నాయి. నగరంలో జూబ్లీహిల్స్,బ ంజారాహిల్స్లో వెలసిన ఖరీదైన బంగ్లాల ముందున్న గేట్లు ఎలా ఉన్నాయో చూడండి.
ఫొటోలు: దయాకర్