కర్నూలు ఉపాధ్యాయునికి జాతీయ అవార్డు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జార్ఖండ్‌లోని ఇండియన్ సైన్స్ అండ్ మ్యాథమాటిక్స్ అందజేసే డాక్టర్ అదినాథ్ లహరి మెమోరియల్ జాతీయ పురస్కారానికి జిల్లా ఉపాధ్యాయుడు కే.విజయకుమార్ ఎంపికయ్యారు. ఈయన ప్రస్తుతం కర్నూలు ఎస్ఆర్సీసీ ఉన్నత పాఠశాలలో సైన్స్ టీచర్‌గా పనిచేస్తున్నారు. ప్రత్నామ్నాయ బోధనోపకరణాల రూపకల్పన, రెడ్ రిబ్బన్‌క్లబ్, నేషనల్ గ్రీన్ కోర్, చెకుముకి సైన్స్ క్లబ్, పర్యావరణంపై ప్రజలు, విద్యార్థులకు అవగాహన కల్పించడంతోపాటు రాష్ట్ర, జాతీయ సెమినార్లలో పాల్గొనడంతో విజయకుమార్‌ను జాతీయ అవార్డు వరించింది. ఈ నెల 25న జార్ఖండ్‌లోని వైద్యనాథ్‌లో కేంద్ర, శాస్త్ర సాంకేతిక, గనుల శాఖమంత్రి హర్షవర్దన్ చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకోనున్నారు.