Intel Corporation
-
ఇంటెల్ ఇండియా మాజీ చీఫ్ మృతి.. సైకిల్‌పై వెళ్తుండగా ఏమైందంటే..
ఇంటెల్ ఇండియా మాజీ హెడ్ అవతార్ సైనీ(68) మహారాష్ట్రలోని నవీ ముంబై టౌన్షిప్లో కన్నుముశారు. ఆయన సైకిల్‌పై వెళుతుండగా వేగంగా వచ్చిన క్యాబ్ ఢీకొట్టడంతో మృతి చెందినట్లు పోలీసులు గురువారం తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం..బుధవారం తెల్లవారుజామున 5:50 గంటలకు సైనీ తన సహచరులతో కలిసి నెరుల్ ప్రాంతంలోని పామ్ బీచ్ రోడ్డులో సైకిల్‌పై వెళుతున్నారు. వేగంగా వస్తున్న క్యాబ్ సైనీ సైకిల్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఆ తర్వాత క్యాబ్ డ్రైవర్ అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. కానీ అప్పటికే కిందపడిన సైకిల్ ఫ్రేం క్యాబ్ ముందు చక్రాల కింద ఇరుక్కుపోయిందని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఈ ఘటనలో సైనీకి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే తోటి సైక్లిస్టులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారని పోలీసులు చెప్పారు. ఇదీ చదవండి: ఆన్లైన్లో ఆవులు.. ఊరించిన ఆఫర్.. తీరా చూస్తే.. సైనీ ఇంటెల్ 386, 486 మైక్రోప్రాసెసర్ల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు. కంపెనీ పెంటియమ్ ప్రాసెసర్ రూపకల్పనకు ఆయన నాయకత్వం వహించారు. ఇంటెల్ దక్షిణాసియా విభాగానికి డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఆయన సతీమణి మూడేళ్ల క్రితమే చనిపోయారు. కుమార్తె, కుమారుడు అమెరికాలో నివాసముంటున్నారు. సైనీ మృతిపై ఇంటెల్ ఇండియా తీవ్ర విచారం వ్యక్తం చేసింది. -
టెక్ దిగ్గజం ఇంటెల్ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్
IntelLayoffs2023: అమెరికాకుచెందిన టెక్ దిగ్గజం ఇంటెల్ఉ ద్యోగులకు షాకింగ్ న్యూస్. తాజాగా మరో రౌండ్ ఉద్యోగ కోతలకు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఆర్థిక సవాళ్లు, ఆదాయాల క్షీణత, ఖర్చు తగ్గింపు చర్యల్లో భాగంగా సుమారు 140 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనుంది. వీరిలో అమెరికాకు కాలిఫోర్నియా ఫోల్సమ్ క్యాంపస్ నుంచి 89 మంది, శాన్ జోస్ కార్యాలయంలో 51 మంది ప్రభావితం కానున్నారు. (వరుసగా నాలుగో వారం క్షీణించిన బంగారం ధర..కానీ!) ఇంటెల్ లేఆఫ్స్ 2023 నివేదికల ప్రకారం, GPUలు (గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లు), క్లౌడ్ కంప్యూటింగ్ , ఏఐ AI కంప్యూటింగ్ తదితర విభాగాల్లో సాఫ్ట్వేర్ డెవలపర్లు, ఇతరరులను తొలగించనుంది. ఆగస్టు 31 నుండి ఈ ఉద్యోగ కోతలను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తొలగించిన వారిలో కొంతమందికి కంపెనీలో కొత్త స్థానాలు ఇవ్వచ్చు అని అంచనా. (గుడ్‌న్యూస్:11 నెలల గరిష్టానికి ఈపీఎఫ్‌వో సభ్యులు) మేలో ఇంటెల్ ఏమి చెప్పింది అయితే ఇంటెల్ ఇంకా పింక్ స్లిప్‌లను ధృవీకరించలేదు. కానీ శాంటా క్లారా-ప్రధాన కార్యాలయ చిప్‌మేకర్ ఖర్చులను తగ్గించుకునే క్రమంలో సిబ్బందిని తొలగించుకోవాలని ప్లాన్ చేస్తున్నట్టు ఈ ఏడాది మేలో సంకేతాలందించింది. గత ఏడాది డిసెంబరులో 201 సిబ్బందిని తొలగించింది. ఈ సంవత్సరం జనవరి నాటి రెగ్యులేటరీ ఫైలింగ్‌లో, కాలిఫోర్నియాలో 13,500 మందితో సహా 2022 చివరి నాటికి 131,000 మంది ఉద్యోగులు ఉన్నారని ఇంటెల్ వెల్లడించిన సంగతి విదితమే. స్థూల-ఆర్థిక సవాళ్లమధ్య తమ వ్యూహాన్ని వేగవంతం చేయడానికి కృషి చేస్తున్నాం. ఈ నేపథ్యంలో కొన్ని ఏరియాల్లో ఫంక్షన్-నిర్దిష్ట వర్క్‌ఫోర్స్ తగ్గింపులతో సహా బహుళ కార్యక్రమాల ద్వారా ఖర్చు తగ్గింపులు ,సామర్థ్య లాభాలను గుర్తించడంపై దృష్టి సారించామని కంపెనీ తెలిపింది. ఈ నిర్ణయం కఠినమైనదే కానీ, ప్రభావితమైన ఉద్యోగులను గౌరవంగా చూసేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపింది. -
ప్యాకేజీపై ఆశలు- యూఎస్ మార్కెట్లు ఓకే
వారాంతాన అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. ఎస్అండ్పీ-500 ఇండెక్స్ 12 పాయింట్లు(0.35 శాతం) పుంజుకుని 3.465 వద్ద నిలవగా.. నాస్డాక్ 42 పాయింట్లు(0.4 శాతం) పెరిగి 11,548 వద్ద స్థిరపడింది. అయితే డోజోన్స్ నామమాత్రంగా 28 పాయింట్లు(0.1 శాతం) క్షీణించి 28,336 వద్ద ముగిసింది. కొద్ది వారాలుగా మార్కెట్లు ప్రభుత్వ ప్యాకేజీపై అంచనాలతో కదులుతున్నట్లు ఈ సందర్భంగా విశ్లేషకులు పేర్కొన్నారు. దీంతో ప్యాకేజీపై కొనసాగుతున్న అనిశ్చితి కారణంగా ఇటీవల మార్కెట్లు ఒడిదొడుకులను చవిచూస్తున్నట్లు తెలియజేశారు. శుక్రవారం(23)తో ముగిసిన గత వారం డోజోన్స్ 1 శాతం, ఎస్అండ్పీ 0.5 శాతం చొప్పున బలహీనపడగా.. నాస్డాక్ సైతం 1.1 శాతం క్షీణించింది. అనిశ్చితిలోనే ఆర్థిక వ్యవస్థకు దన్నుగా ట్రంప్ ప్రతిపాదించిన ప్యాకేజీపై డెమొక్రాట్లకూ, రిపబ్లికన్లకూ మధ్య విభేధాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ప్యాకేజీకి కొన్ని సవరణలు సూచిండంతోపాటు. 2.2 ట్రిలియన్ డాలర్లకు పెంచమంటూ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ ప్రతిపాదించిన విషయం విదితమే. అయితే ఎన్నికలలోగా ప్యాకేజీపై ఒప్పందం కుదురుతుందని భావిస్తున్నట్లు పెలోసీ పేర్కొన్నారు. ఇక మరోవైపు అధ్యక్ష ఎన్నికలలో భాగంగా ప్రెసిడెంట్ ట్రంప్, ప్రత్యర్ధి జోబిడెన్ మధ్య వాడిగా, వేడిగా డిబేట్ నడిచింది. డిబేట్ తదుపరి ఎన్నికలను ప్రభావితం చేసే పలు రాష్ట్రాలలో పరిస్థితులను అంచనా వేయవలసి ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అమెక్స్ డౌన్ ఈ ఏడాది క్యూ3(జులై- సెప్టెంబర్)లో మార్జిన్లు బలహీనపడటంతో చిప్ తయారీ దిగ్గజం ఇంటెల్ కార్ప్ షేరు 10 శాతం కుప్పకూలింది. కోవిడ్-19 కారణంగా డిమాండ్ పడిపోవడంతో చిన్న సంస్థలు, వినియోగదారులు చౌక ల్యాప్‌టాప్‌ల కొనుగోలుకి మళ్లినట్లు నిపుణులు తెలియజేశారు. మరోవైపు డేటా సెంటర్లపై ప్రభుత్వ వ్యయాలు తగ్గడం వంటి అంశాలు సైతం ప్రభావం చూపినట్లు వివరించారు. ఫలితంగా ఇంటెల్ లాభదాయకత నీరసించినట్లు అభిప్రాయపడ్డారు. కాగా.. క్యూ3లో ఫలితాలు అంచనాలను చేరకపోవడంతో అమెరికన్ ఎక్స్‌ప్రెస్ షేరు 3.6 శాతం నష్టపోయింది. కోవిడ్-19 కారణంగా వినియోగం మందగించడంతోపాటు, చెల్లింపుల వైఫల్యాలను ఎదుర్కొనేందుకు కేటాయింపులు చేపట్టడం అమెక్స్ను దెబ్బతీసినట్లు విశ్లేషకులు తెలియజేశారు. గిలియడ్ ప్లస్ కోవిడ్-19 చికిత్సకు వినియోగిస్తున్న యాంటీవైరల్ ఔషధం రెమ్‌డెసివిర్‌కు యూఎస్ఎఫ్డీఏ ఆమోదముద్ర వేయడంతో గిలియడ్ సైన్సెస్ షేరు 0.2 శాతం బలపడింది. అత్యవసర చికిత్సలో భాగంగా ఇప్పటికే ఈ ఔషధాన్ని వినియోగిస్తున్న విషయం విదితమే. కాగా.. వచ్చే వారం ఫాంగ్ స్టాక్స్‌గా పిలిచే యాపిల్, అమెజాన్, అల్ఫాబెట్(గూగుల్), ఫేస్బుక్.. క్యూ3 ఫలితాలు విడుదల చేయనున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు ఈ కంపెనీల పనితీరుపై దృష్టిపెట్టనున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. -
వారాంతాన యూఎస్ మార్కెట్లు డౌన్
చైనాతో వివాదాలు ముదురుతున్న నేపథ్యంలో వారాంతాన యూఎస్ స్టాక్ మార్కెట్లలో అమ్మకాలదే పైచేయిగా నిలిచింది. దీనికితోడు క్యూ2 ఫలితాలు నిరాశపరచడంతో సెంటిమెంటు బలహీనపడింది. దీంతో శుక్రవారం డోజోన్స్ 182 పాయింట్లు(0.7 శాతం) క్షీణించి 26.,470కు చేరగా.. ఎస్అండ్పీ 20 పాయింట్ల(0.6 శాతం)వెనకడుగుతో 3,216 వద్ద ముగిసింది. ఇక నాస్డాక్ సైతం 98 పాయింట్ల(1 శాతం) నష్టంతో 10,363 వద్ద స్థిరపడింది.క్యూ2(ఏప్రిల్-జూన్)లో క్రెడిట్ కార్డ్స్ దిగ్గజం అమెరికన్ ఎక్స్‌ప్రెస్ ఆదాయం 29 శాతం క్షీణించింది. మరోపక్క కోవిడ్-19 నేపథ్యంలో కొత్తగా అభివృద్ధి చేస్తున్న 7నానోమీటర్ చిప్స్ ఏడాది ఆలస్యంగా అందుబాటులోకి రానున్నట్లు చిప్ తయారీ దిగ్గజం ఇంటెల్ కార్ప్వెల్లడించింది. వెరసి 2022 చివర్లో లేదా 2023లో మాత్రమే ఈ ఆధునిక చిప్స్‌ను విడుదల చేయగలమని పేర్కొంది. అమెక్స్ డీలా బ్లూచిప్ దిగ్గజాలలో ఇంటెల్ కార్ప్ షేరు 16 శాతంపైగా కుప్పకూలి 50.6 డాలర్ల వద్ద ముగిసింది. ఆధునిక 7నానోమీటర్ చిప్ తయారీని ఆలస్యం చేయనున్నట్లు పేర్కొనడం ప్రభావం చూపింది. దీంతో ప్రత్యర్ధి సంస్థ అడ్వాన్స్డ్ మైక్రో డివైసెస్(ఏఎండీ)షేరుకి జోష్ వచ్చింది. 16.5 శాతం దూసుకెళ్లి 69 డాలర్లను తాకింది. మరోపక్క వైర్లెస్ సేవల దిగ్గజం వెరిజాన్ 2 శాతం పుంజుకుని 57 డాలర్లకు చేరింది. ఇక బ్యాంకింగ్ దిగ్గజం అమెరికన్ ఎక్స్‌ప్రెస్ షేరు 1.4 శాతం నష్టంతో 95.3 డాలర్ల వద్ద ముగిసింది. ఫాంగ్ స్టాక్స్‌లో ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, యాపిల్ 0.5 శాతం చొప్పున నీరసించగా.. అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ 0.6 శాతం స్థాయిలో బలపడ్డాయి. -
హైదరాబాదీలకు సెలవుల్లోనూ ఆఫీసుపనే: ఇంటెల్
హైదరాబాద్ : ఆఫీసు నుంచి వచ్చే మెరుుల్స్కు దూరంగా ఉండాలని గట్టిగా నిర్ణరుుంచుకున్నప్పటికీ... స్మార్ట్‌ఫోన్‌లో మెరుుల్ బాక్స్ ఓపెన్ చేసి బదులివ్వక ఉండలేకపోతున్నారు హైదరాబాదీలు. ఇంటెల్ సంస్థ నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఈ సర్వే ఇంకా పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది.సెలవు పెట్టి పర్యటనకు వెళ్లిన వారిలో హైదరాబాద్ నుంచి కేవలం 38 శాతం మంది మాత్రమే కార్యాలయం నుంచి వచ్చిన మెరుుల్స్ను పట్టించుకోలేదు. ముంబై, ఢిల్లీ వాసుల్లో ఇది 41 శాతం చొప్పున, అహ్మదాబాద్‌లో 43 శాతం, బెంగళూరులో 51 శాతం మంది కార్యాలయ మెరుుల్స్కు దూరంగా ఉన్నారు. పైగా పర్యటనలో ఉన్నప్పటికీ ఇంటర్నెట్ వాడే విషయంలోనూ హైదరాబాదీలే మొదటి స్థానంలో ఉన్నారు. 82 శాతం మంది ఇంటర్నెట్కు అనుసంధానం అవుతున్నారని సర్వే పేర్కొంది. కుటుంబ సభ్యులతో సమాచారం కోసం, అత్యవసర పరిస్థితుల్లో ఇంటర్నెట్ వాడుతున్నట్టు సర్వేలో పాల్గొన్న వారు తెలిపారు. -
ఇంటెల్ చేతికి ఆల్టెరా.. 16.7 బిలియన్ డాలర్ల డీల్
న్యూయార్క్: చిప్ తయారీ దిగ్గజం ఇంటెల్ కార్పొరేషన్ తాజాగా ఆల్టెరా కార్ప్‌ను కొనుగోలు చేస్తోంది. ఇందుకోసం 16.7 బిలియన్ డాలర్లు వెచ్చించనుంది. 47 సంవత్సరాల కంపెనీ చరిత్రలో ఇది అత్యంత భారీ డీల్ కానుంది. ఆల్టెరా షేరు ఒక్కింటికి ఇంటెల్ 54 డాలర్లు చెల్లించనుంది. ఇందుకోసం ఇరు కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇంటెల్ తెలిపింది. డేటా సెంటర్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) తదితర వ్యాపార విభాగాల కస్టమర్లకు మరింత మెరుగైన ఉత్పత్తులను అందించేందుకు ఈ డీల్ ఉపయోగపడగలదని పేర్కొంది. ఫోన్ నెట్‌వర్క్‌లు, సర్వర్ సిస్టమ్స్, కార్లు మొదలైన వాటికి అవసరమయ్యే ప్రాసెసర్లను ఆల్టెరా డిజైన్ చేస్తుంది.