హైదరాబాదీలకు సెలవుల్లోనూ ఆఫీసుపనే: ఇంటెల్ | Intel Corporation survey on hyderabad office e-mails | Sakshi
Sakshi News home page

హైదరాబాదీలకు సెలవుల్లోనూ ఆఫీసుపనే: ఇంటెల్

Published Fri, Sep 2 2016 1:54 AM | Last Updated on Mon, Sep 4 2017 11:52 AM

హైదరాబాదీలకు సెలవుల్లోనూ ఆఫీసుపనే: ఇంటెల్

హైదరాబాదీలకు సెలవుల్లోనూ ఆఫీసుపనే: ఇంటెల్

హైదరాబాద్ :  ఆఫీసు నుంచి వచ్చే మెరుుల్స్‌కు దూరంగా ఉండాలని గట్టిగా నిర్ణరుుంచుకున్నప్పటికీ... స్మార్ట్‌ఫోన్‌లో మెరుుల్ బాక్స్ ఓపెన్ చేసి బదులివ్వక ఉండలేకపోతున్నారు హైదరాబాదీలు. ఇంటెల్ సంస్థ నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఈ సర్వే ఇంకా పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది.సెలవు పెట్టి పర్యటనకు వెళ్లిన వారిలో హైదరాబాద్ నుంచి కేవలం 38 శాతం మంది మాత్రమే కార్యాలయం నుంచి వచ్చిన మెరుుల్స్‌ను పట్టించుకోలేదు.

ముంబై, ఢిల్లీ వాసుల్లో ఇది 41 శాతం చొప్పున, అహ్మదాబాద్‌లో 43 శాతం, బెంగళూరులో 51 శాతం మంది కార్యాలయ మెరుుల్స్‌కు దూరంగా ఉన్నారు. పైగా పర్యటనలో ఉన్నప్పటికీ ఇంటర్నెట్ వాడే విషయంలోనూ హైదరాబాదీలే మొదటి స్థానంలో ఉన్నారు. 82 శాతం మంది ఇంటర్నెట్‌కు అనుసంధానం అవుతున్నారని  సర్వే పేర్కొంది. కుటుంబ సభ్యులతో సమాచారం కోసం, అత్యవసర పరిస్థితుల్లో ఇంటర్నెట్ వాడుతున్నట్టు సర్వేలో పాల్గొన్న వారు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement