IntelLayoffs2023: అమెరికాకుచెందిన టెక్ దిగ్గజం ఇంటెల్ఉ ద్యోగులకు షాకింగ్ న్యూస్. తాజాగా మరో రౌండ్ ఉద్యోగ కోతలకు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఆర్థిక సవాళ్లు, ఆదాయాల క్షీణత, ఖర్చు తగ్గింపు చర్యల్లో భాగంగా సుమారు 140 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనుంది. వీరిలో అమెరికాకు కాలిఫోర్నియా ఫోల్సమ్ క్యాంపస్ నుంచి 89 మంది, శాన్ జోస్ కార్యాలయంలో 51 మంది ప్రభావితం కానున్నారు. (వరుసగా నాలుగో వారం క్షీణించిన బంగారం ధర..కానీ!)
ఇంటెల్ లేఆఫ్స్ 2023
నివేదికల ప్రకారం, GPUలు (గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లు), క్లౌడ్ కంప్యూటింగ్ , ఏఐ AI కంప్యూటింగ్ తదితర విభాగాల్లో సాఫ్ట్‌వేర్ డెవలపర్లు, ఇతరరులను తొలగించనుంది. ఆగస్టు 31 నుండి ఈ ఉద్యోగ కోతలను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తొలగించిన వారిలో కొంతమందికి కంపెనీలో కొత్త స్థానాలు ఇవ్వచ్చు అని అంచనా. (గుడ్‌న్యూస్:11 నెలల గరిష్టానికి ఈపీఎఫ్‌వో సభ్యులు)
మేలో ఇంటెల్ ఏమి చెప్పింది
అయితే ఇంటెల్ ఇంకా పింక్ స్లిప్‌లను ధృవీకరించలేదు. కానీ శాంటా క్లారా-ప్రధాన కార్యాలయ చిప్‌మేకర్ ఖర్చులను తగ్గించుకునే క్రమంలో సిబ్బందిని తొలగించుకోవాలని ప్లాన్ చేస్తున్నట్టు ఈ ఏడాది మేలో సంకేతాలందించింది. గత ఏడాది డిసెంబరులో 201 సిబ్బందిని తొలగించింది. ఈ సంవత్సరం జనవరి నాటి రెగ్యులేటరీ ఫైలింగ్‌లో, కాలిఫోర్నియాలో 13,500 మందితో సహా 2022 చివరి నాటికి 131,000 మంది ఉద్యోగులు ఉన్నారని ఇంటెల్ వెల్లడించిన సంగతి విదితమే.
స్థూల-ఆర్థిక సవాళ్లమధ్య తమ వ్యూహాన్ని వేగవంతం చేయడానికి కృషి చేస్తున్నాం. ఈ నేపథ్యంలో కొన్ని ఏరియాల్లో ఫంక్షన్-నిర్దిష్ట వర్క్‌ఫోర్స్ తగ్గింపులతో సహా బహుళ కార్యక్రమాల ద్వారా ఖర్చు తగ్గింపులు ,సామర్థ్య లాభాలను గుర్తించడంపై దృష్టి సారించామని కంపెనీ తెలిపింది. ఈ నిర్ణయం కఠినమైనదే కానీ, ప్రభావితమైన ఉద్యోగులను గౌరవంగా చూసేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment