ఇంటెల్ భారీ కొనుగోలు
జెరూసలెం: అమెరికాకు చెందిన కంప్యూటర్ చిప్ దిగ్గజం ఇంటెల్ కార్పొరేషన్ డ్రైవర్ లెస్ కారును అందుబాటులోకి తెచ్చే యోచనలో భారీ డీల్ కుదుర్చుకుంది. ఇజ్రాయిల్ కంప్యూటర్ కంపెనీ..మొబైల్ ఐ కంపెనీని కొనుగోలు చేసింది. డ్రైవర్ లెస్ టెక్నాలజీలో విశేష కృషి చేస్తున్న మొబైల్ ఐ ని 15 బిలియన్ డాలర్లకు (దాదాపు లక్షలకోట్ల రూపాయలు) కి సొంతం చేసుకోనుంది. ఈ మేరకు ఇరు సంస్థలు సోమవారం ఒక ప్రకటన జారీ చేశాయి. రాబోయే తొమ్మిది నెలల్లో ఈ ఒప్పందం పూర్తికానుందని తెలిపాయి. డ్రైవర్ లెస్ కార్లను అందుబాటులోకి తీసుకు రావడానికి దిగ్గజ కంపెనీలు క్యూ కడుతున్న నేపథ్యంలో ఈ డీల్ భారీ ప్రాధాన్యతను సంతరించుకుంది.
తమ వాటాదారులకు,ఆటోమోటివ్ పరిశ్రమకు ఇది గొప్పముందడుగు అని ఇంటెల్ సీఈవో బ్రియాన్ క్రజానిచ్ తెలిపారు. డ్రైవింగ్ లెస్ కారు ఆవిష్కరణను వేగవంతం చేయనున్నట్టు చెప్పారు. ఈ ప్రక్రియలో ఇంటెల్ కీలకమైన, పునాది సాంకేతికలను అందిస్తోంటే, మొబైల్ ఐ పరిశ్రమకు ఉత్తమ ఆటోమోటివ్ గ్రేడ్ కంప్యూటర్ విజన్ అందిస్తోంది. దీంతో ఇకముందు తమ భాగస్వామ్యంలో తక్కువ ఖర్చుతో, మెరుగైన ప్రదర్శనతో క్లౌడ్ టు-కారు సొల్యూషన్ తో భవిష్యత్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను మరింత వేగంగా అందుబాటులోకి తీసుకురానున్నట్టు చెప్పారు. 2030 నాటికి డ్రైవర్ లెస్ కార్ మార్కెట్ వాల్యూ 70 బిలియన్ డాలర్లుగా ఉండనుందని ఇంటెల్ అంచనా వేస్తోంది.
ప్రముఖ కార్ల ఉత్పత్తిదారులు, సరఫరాదారులు, ఎస్టీ మైక్రో ఎలక్ట్రానిక్స్‌తో తమ సంబంధాలు యధావిథిగా కొనసాగుతాయని మొబైల్ ఐ ప్రకటించింది. ప్రస్తుత ఉత్పత్తి లో ఎలాంటి అంతరాయం ఉండదని స్పష్టం చేసింది. అటు ఇది అతి భారీ కొనుగోలు అని ఇజ్రాయిల్ మీడియా నివేదించింది. ఆటోమేటివ్ పరిశ్రమలో సరికొత్త ఆవిష్కరణలకు నాంది కానుందని ఎనలిస్టులు భావిస్తున్నారు.
కాగా మొబైల్ ఐ ఇప్పటికే ప్రపంచ కారు దిగ్గజాలు బీండబ్ల్యు, ఫోక్స్‌వాగన్ లాంటి కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అలాగే మేపింగ్ సేవల సంస్థ హియర్ (HERE) సంస్థలో డాటా షేరింగ్ ఒప్పందం కూడా ఉంది. 1999లో స్థాపించిన మొబైల్ ఐ 2014లో న్యూయార్క్ స్టాక్ ఎక్సేంజ్ లో లిస్ట్ అయింది. 2007లో గోల్డ్మన్సాచి 130 మిలియన్ల డాలర్ల పెట్టుబడుల అనంతరం వాహన ప్రమాదాలను, మరణాలను అరికట్టేందుకు ఓ మిషన్‌ను ప్రారంభించింది. ఈ వార్తలతో మొబైల్ ఐ షేరు అమెరికా మార్కెట్ లోదాదాపు 32 శాతం లాభపడి ఆల్ టైం గరిష్టాన్నినమోదు చేసింది.
మరోవైపు గత ఏడాది 2021 నాటికి డ్రైవర్ లెస్ కారును అందుబాటులోకి తెచ్చేందుకు ఇంటెల్, మొబైల్ ఐ కంపెనీలతో జత కట్టింది మరో కార్ల దిగ్గజం బీఎండబ్ల్యు. అమెరికా, యూరప్‌లో దాదాపు 40 సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను ప్రవేశపెట్టనున్నట్టు గత జనవరిలో ప్రకటించిన సంగతి తెలిసిందే.