inter advance supplementary exams
-
ఏపీ ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ రిజల్ట్స్ వెల్లడి
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు ఇవాళ(మంగళవారం, జూన్ 13) వచ్చేశాయ్. ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్‌కు సంబంధించి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ-ఇంప్రూవ్ మెంట్ ఫలితాల్ని ఏపీ ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు రిలీజ్ చేశారు. మే 24 నుంచి జూన్ 1 వరకు రాష్ట్రంలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ జనరల్/వొకేషనల్ సప్లిమెంటరీ-ఇంప్రూవ్ మెంట్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు 4 లక్షల మందికి పైగా హాజరయ్యారు. ఫలితాల కోసం https://resultsbie.ap.gov.in/ క్లిక్ చేస్తే సరిపోతుంది. -
ఆగస్టు 3 నుంచి ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్టు 3 నుంచి 12వ తేదీ వరకు జరగనున్నాయి. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇంటర్మీడియెట్ బోర్డు శుక్రవారం షెడ్యూల్ విడుదల చేసింది. ప్రాక్టికల్ పరీక్షలు ఆగస్టు 17 నుంచి 22 వరకు జరుగుతాయి. నైతికత, మానవ విలువలు పరీక్ష ఆగస్టు 24న.. పర్యావరణ విద్య పరీక్ష ఆగస్టు 26న జరుగుతాయి. విద్యార్థులు నిర్ణీత ఫీజులను జులై 8లోపు చెల్లించాలని పేర్కొంది. -
7 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను ఈ నెల 7 నుంచి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు బోర్డు కార్యదర్శి అశోక్ తెలిపారు. ప్రధాన పరీక్షలు ఈ నెల 12తో ముగుస్తాయన్నారు. బోర్డు కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. తొలి ఏడాది పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 9 నుంచి 12 వరకు, రెండో ఏడాది పరీక్షలు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు జరుగుతాయన్నారు. గంటముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, పరీక్ష సమయానికి నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని స్పష్టం చేశారు. పరీక్షలను పక్కాగా నిర్వహించేందుకు 040–24601010, 040–247 32369 నంబర్లతో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు తెలి పారు. పరీక్షలకు 4,63,236 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. ఇందులో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఫెయిలైన విద్యార్థులు 3,14,773 మంది ఉండగా, ప్రథమ సంవత్సరంలో ఇంప్రూవ్మెంట్ రాసే వారు 1,48,463 మంది ఉన్నట్లు వివరించారు. పరీక్షల నిర్వహణకు 857 కేంద్రాలను ఏర్పాటు చేశామని ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. వెబ్సైట్లో హాల్‌టికెట్లు... విద్యార్థులకు ఇప్పటికే హాల్‌టికెట్లను పంపించామని, అయినా ఇంకా అందకుంటే bie.telangana.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని అశోక్ సూచించారు. వాటిపై కాలేజీ ప్రిన్సిపాళ్ల సంతకాలు లేకపోయినా అనుమతించాలని చీఫ్ సూపరింటెండెంట్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఓంఆర్‌ఎర్ షీట్లలో విద్యార్థులకు సంబంధించిన వివరాల్లో ఏమైనా పొరపాట్లు ఉంటే విద్యార్థులు చూసుకొని ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకెళ్లాలని, ఒకవేళ సరిగ్గా చూసుకోకపోతే ఆ తరువాత విద్యార్థులదే బాధ్యతని ఆయన స్పష్టం చేశారు. -
సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు
హైదరాబాద్: ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువు మరో రెండు రోజులు పొడిగిస్తున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్ పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. ఈ నెల 4 వరకు ఎలాంటి రుసుము లేకుండా ఫీజు చెల్లించే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 26న బిట్‌శాట్, 27న జేఈఈ ఉన్నందున విద్యార్థులు, తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ పునఃపరిశీలించి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా తేదీలు నిర్ణయిస్తామని చెప్పారు. -
రేపట్నుంచే ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
- హాజరుకానున్న 4.73 లక్షల మంది విద్యార్థులు - 799 పరీక్ష కేంద్రాల ఏర్పాటు - నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ - పరీక్షా కేంద్రాల్లో తొలిసారి సీసీటీవీలు - జూన్ 25లోగా ఫలితాలు సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మొత్తం 4,73,450 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందులో ఫస్టియర్ పరీక్షలకు 3,02,227 మంది హాజరు కానుండగా, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 1,59,803 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు ఇం టర్ బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్ ఆదివారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ నెల 24 నుంచి 31 వరకు ప్రతిరోజూ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ఫస్టియర్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెకండ్ ఇయర్ పరీక్షలు జరగనున్నాయి. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 799 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి ఫిర్యాదులను స్వీకరించేందుకు రాష్ట్రస్థాయిలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ (040-24601010/24732369)ను ఏర్పాటు చేసినట్లు అశోక్ తెలిపారు. విద్యార్థులు పరీక్ష ప్రారంభ సమయంకంటే గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైనా లోనికి అనుమతించబోమన్నారు. పరీక్షల నిర్వహణ నిమిత్తం అన్ని జిల్లాల్లో ఆర్ఐవోలు కన్వీనర్లుగా జిల్లా పరీక్షల కమిటీ(డీఈసీ)లను ఏర్పాటు చేశామని, పరీక్షాకేంద్రాల్లో తనిఖీల నిమిత్తం విద్య, రెవెన్యూ, పోలీసుశాఖలకు చెందిన సిబ్బందితో 50 ఫ్లయింగ్, 200 సిట్టింగ్ స్క్వాడ్లను నియమించామన్నారు. కాపీయింగ్‌ను ప్రోత్సహించే అధికారులు లేదా విద్యా సంస్థలపై సెక్షన్ 25 ప్రకారం కఠిన చర్యలు చేపడతామని అశోక్ హెచ్చరించారు. జూన్ 1 నుంచి మూల్యాంకనం చేపడతామని, జూన్ 25లోగా ఫలితాలను వెల్లడించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. సీసీ కెమెరాల నిఘాలో.. ఇంటర్ పరీక్షలు ప్రప్రథమంగా సీసీటీవీ కెమెరాల నీడలో జరగనున్నాయి. పరీక్షాకేంద్రాల్లో ఇప్పటికే 90 శాతం సీసీ కెమెరాలు ఏర్పాటు జరిగిందని, రెండ్రోజుల్లో వంద శాతం పనులు పూర్తవుతాయని బోర్డు కార్యదర్శి తెలిపారు. పరీక్షలు జరిగే సమయంలో ఆయా కేంద్రాల్లోని సీసీ కెమెరాల ఐపీ నెంబర్లను తీసుకొని జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారులు నేరుగా పర్యవక్షిస్తారని చెప్పారు. అవసరమైతే రికార్డు అయిన సీడీలను తెప్పించుకొని పరిశీలిస్తామన్నారు.