Inter-district robber arrested
-
అంతర్ జిల్లా దొంగ అరెస్టు
చల్లపల్లి (అవనిగడ్డ) : కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సంచరిస్తూ చోరీలకు పాల్పడే అంతర్ జిల్లాల దొంగను చల్లపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక సర్కిల్ పోలీస్ కార్యాలయంలో అవనిగడ్డ డీఎస్పీ వి.పోతురాజు శనివారం ఉదయం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. చల్లపల్లి మండల పరిధిలోని ఆముదార్లంకకు చెందిన పాత నేరస్తుడు, అంతర్ జిల్లాల దొంగగా గుర్తింపు, గుంటూరు జిల్లా భట్టిప్రోలు పీఎస్‌లో సస్పెక్టెడ్ షీట్ కలిగిన గాజులేటి వీరయ్యను చల్లపల్లి, వెంకటాపురంలలో జరిగిన బంగారు నగల చోరీ కేసుల్లో సీఐ బి.జనార్దన్ శనివారం అరెస్టు చేశారు. పదిహేడేళ్ల నుంచే చోరీలు వీరయ్య పదిహేడేళ్ల వయసు నుంచే దొంగతనాలు చేసేవాడని డీఎస్పీ పోతురాజు తెలిపారు. బంగారు గొలుసులు, మోటారు బైక్‌లు దొంగతనాలతోపాటు ఇళ్లల్లో చోరీలకు పాల్పడేవాడు. 2017లో చల్లపల్లిలో, 2018లో వెంకటాపురంలో రెండు బంగారం చోరీ కేసుల్లో వీరయ్యపై అనుమానం వచ్చి ఆ దిశగా విచారణ చేపట్టారు. వేలిముద్రల ఆధారంగా చోరీలకు పాల్పడింది వీరయ్యగా నిర్థారించి అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కొన్నాళ్లుగా పోలీసులకు దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్న వీరయ్యను పట్టుకోవటంలో కీలకపాత్ర వహించిన చల్లపల్లి ఏఎస్ఐ విస్సంశెట్టి వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ రాఘవలను డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. వీరికి రివార్డులు ఇవ్వాలని జిల్లా ఎస్పీని కోరనున్నట్లు ఆయన తెలిపారు. వీరయ్య మరో వ్యక్తితో కలిసి చోరీలకు పాల్పడి, 96 గ్రాములు బంగారం చోరీ చేశాడు. వీరయ్య నుంచి 64 గ్రాముల బంగారం రికవరీ చేశారు. మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. సమావేశంలో సీఐ బి.జనార్దన్, ఘంటసాల ఎస్ఐ షణ్ముఖసాయి, ఏఎస్ఐ విస్సంశెట్టి వెంకటేశ్వరరావు, రాఘవ పాల్గొన్నారు. -
అంతర్ జిల్లా దొంగ అరెస్ట్
భువనగిరి అర్బన్ : కొంత కాలంగా తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం భువనగిరి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ పాలకుర్తి యాదగిరి నిందితుడి వివరాలు వెల్లడించారు. మోత్కూర్ గ్రామంలోని పోతాయిగడ్డకు చెందిన సిరిగిరి సాయిబాబా అలియస్ సాయికుమార్ స్టవర్ రిపేర్ చేస్తానని పట్టణంలో, గ్రామాల్లో తిరుగుతుండేవాడు. ఈ క్రమంలో తాళాలు వేసి ఉన్న ఇళ్లను ఎంచుకుని ఎవరూ లేని సమయంలో తాళాలు పగులగొట్టి బంగారం, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లేవాడు. గత నెల 31న తుర్కపల్లి గ్రామంలోని గుండెబోయిన కవిత ఇంటి తాళం పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించి బీరువాను పగలగొట్టాడు. బంగారు పుస్తెలతాడు, జత చెవి కమ్మలు, జత బంగారు మాటీలు, నాలుగు జతల వెండి పట్టాగోలుసులు, రూ.400 నగదు, మొత్తం నాలుగున్నర తులాల బంగారం, 55 తులాల వెండి ఎత్తుకెళ్లాడు. జనవరి 1న మధ్యాహ్నం 12 గంటల సమయంలో పట్టణంలోని ప్రగతినగర్ కాలనీలో కన్నారపు ప్రసాద్ ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి మన్నా చర్చిలో ప్రార్థనకు వెళ్లారు. ఈ సమయంలో ఇంటి తాళం పగలగొట్టి బీరువాను తెరిచి నగల బాక్స్‌లోని నల్లపూసల బంగారు గొలుసు లాకెట్, బంగారు గుండ్ల గొలు సు, లాకెట్ చైను, గ్రీన్ స్టోన్ రింగు, ఒక సెల్‌ఫోన్, ఐ ఫోన్ ఎత్తుకెళ్లాడు. ఈ మేరకు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పాత నేరస్తులు అనుమానితులను తనిఖీ చేస్తుం డగా పట్టణ శివారులోని సింగన్నగూడెం చౌరస్తా వద్ద ఒక డేరాలో నివాసముంటున్న సాయిబాబాను విచారించడం తో దొంగతనాలు చేస్తునట్లు ఒప్పుకున్నాడు.సాయిబాబా నుంచి ఎనిమిదిన్నర తులాల బంగారం, చెవి కమ్మలు, మాటీలు, వెండి పట్టాగోలుసులు, సమ్‌సంగ్, ఐ సెల్ఫోన్ల, రూ.4వేలు, 3 బైకులను స్వాధీనం చేసుకునట్లు చెప్పారు. సాయిబాబాకు సహకరించిన తండ్రి పరుశారం బంగారు గుండ్ల గొలుసుతో పారిపోయి తప్పించుకుని తిరుగుతున ట్లు తెలిపారు. అతనిపై పీడీ యాక్టు నమోదు చేసినట్లు చె ప్పారు. నిందితుడిని కోర్టుకు రిమాండ్ చేస్తామన్నారు. సమావేశంలో ఏసీపీ సాధు మోహన్‌రెడ్డి, సీఐ ఎం.శంకర్‌గౌడ్, ఎస్ఐ రాజశేఖర్‌రెడ్డి, కానిస్టేబుల్ కిరణ్ ఉన్నారు. ఇతర జిల్లాల్లోనూ చోరీలు.. 2010 నుంచి ఇప్పటి వరకు మోత్కూర్, నల్లగొండ టౌన్, జనగాం, వరంగల్ జిల్లా హుస్నాబాద్, వర్థన్నపేట, వరంగల్ మిల్స్‌కాలనీ, మర్రిపెడ బంగ్లా, మహబూబాబాద్, దుగ్గొండి పోలీస్‌స్టేషన్ పరిధిలో పలు దొంగతనాలు చేసినట్లు చెప్పారు. వరంగల్ సెంట్రల్ జైలు, నల్లగొండ జిల్లా జైలు, జనగాం సబ్జైల్లో రి మాండ్ ఉన్నట్లు చెప్పారు. 2016 నవంబర్‌లో వరంగ ల్ సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చి తిరిగి తుర్కపల్లి, భువనగిరిలో 14 దొంగతనాలకు పాల్పడ్డాడు. -
అంతర్జిల్లా దొంగ అరెస్టు
కాకినాడ రూరల్ : పలు జిల్లాల్లో నేరాలకు పాల్పడిన అంతర్ జిల్లా పాత నేరస్తుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇతడి వద్ద నుంచి రూ. 39 లక్షల విలువైన సొత్తును రికవరీ చేశారు. బుధవారం సర్పవ రం పోలీసు గెస్ట్‌హౌస్‌లో ఎస్పీ ఎం.రవిప్రకాష్ ఈ వివరాలు వెల్లడించారు. అంతర్ జిల్లా నేరస్తుడైన చప్పిడి వీరవెంకట సత్యనారాయణ పాత నేరస్తుడు. ఇతడు కోరంగి, కాకినాడ, ద్రాక్షారామ, మండపేట, ఉప్పల్ (హైదరాబాద్), పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు, కొవ్వూరుల్లో నేరాలకు పాల్పడ్డాడు. కొన్ని కేసుల్లో జైలుశిక్షలు అనుభవించాడు. జైలు నుంచి బయటకు వచ్చాక మళ్లీ చోరీలకు పాల్పడ్డాడు. ఇతనిపై గతేడాది గొల్లపాలెం పోలీసు స్టే షన్లో కేసు నమోదైంది. పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మం డలం తూర్పు విప్పరులో నిందితుడు ఉన్నట్టు స్పెషల్ క్రైం పార్టీకి సమాచారం అందింది. అతడు అద్దెకు ఉంటున్న ఇంట్లోనే పోలీసు లు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి రూ.30,97,507 విలువైన 143 కాసుల బంగారం, రూ.4,09,349 విలువైన 11.5 కిలోల వెండి, రూ.3.22 లక్షల నగదు, చోరీలకు వాడిన బైక్ మొత్తం రూ.39.09 లక్షల విలువైన సొత్తును రికవరీ చేశారు. గొల్లపాలెం, కోరంగి, ద్రాక్షారామ, పామర్రు, అంగర, పోడూరు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడినట్టు నిందితుడు అంగీకరించాడు. నిందితుడిని అరెస్టు చేసిన సీఐ వల్లభనేని పవన్‌కిశోర్, స్పెషల్ క్రైమ్ పార్టీ ఎస్సైలు వై.రవికుమార్, ఎండీఏఆర్ ఆలీఖాన్, ఏఎస్సై ఎం.పాపరాజు, హెచ్‌సీ వి.సుబ్బారావు, కానిస్టేబుళ్లు కె.రాంబాబు, రామాంజనేయులు అభినందించారు. సమావేశంలో ఏఎస్పీ ఏఆర్ దామోదర్, డీఎస్పీ ఆకురాతి పల్లపురాజు పాల్గొన్నారు.