అంతర్‌జిల్లా దొంగ అరెస్టు
Published Thu, Mar 31 2016 2:44 AM | Last Updated on Sun, Sep 3 2017 8:53 PM
కాకినాడ రూరల్ : పలు జిల్లాల్లో నేరాలకు పాల్పడిన అంతర్ జిల్లా పాత నేరస్తుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇతడి వద్ద నుంచి రూ. 39 లక్షల విలువైన సొత్తును రికవరీ చేశారు. బుధవారం సర్పవ రం పోలీసు గెస్ట్‌హౌస్‌లో ఎస్పీ ఎం.రవిప్రకాష్ ఈ వివరాలు వెల్లడించారు. అంతర్ జిల్లా నేరస్తుడైన చప్పిడి వీరవెంకట సత్యనారాయణ పాత నేరస్తుడు. ఇతడు కోరంగి, కాకినాడ, ద్రాక్షారామ, మండపేట, ఉప్పల్ (హైదరాబాద్), పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు, కొవ్వూరుల్లో నేరాలకు పాల్పడ్డాడు.
కొన్ని కేసుల్లో జైలుశిక్షలు అనుభవించాడు. జైలు నుంచి బయటకు వచ్చాక మళ్లీ చోరీలకు పాల్పడ్డాడు. ఇతనిపై గతేడాది గొల్లపాలెం పోలీసు స్టే షన్‌లో కేసు నమోదైంది. పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మం డలం తూర్పు విప్పరులో నిందితుడు ఉన్నట్టు స్పెషల్ క్రైం పార్టీకి సమాచారం అందింది. అతడు అద్దెకు ఉంటున్న ఇంట్లోనే పోలీసు లు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి రూ.30,97,507 విలువైన 143 కాసుల బంగారం, రూ.4,09,349 విలువైన 11.5 కిలోల వెండి, రూ.3.22 లక్షల నగదు, చోరీలకు వాడిన బైక్ మొత్తం రూ.39.09 లక్షల విలువైన సొత్తును రికవరీ చేశారు.
గొల్లపాలెం, కోరంగి, ద్రాక్షారామ, పామర్రు, అంగర, పోడూరు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడినట్టు నిందితుడు అంగీకరించాడు. నిందితుడిని అరెస్టు చేసిన సీఐ వల్లభనేని పవన్‌కిశోర్, స్పెషల్ క్రైమ్ పార్టీ ఎస్సైలు వై.రవికుమార్, ఎండీఏఆర్ ఆలీఖాన్, ఏఎస్సై ఎం.పాపరాజు, హెచ్‌సీ వి.సుబ్బారావు, కానిస్టేబుళ్లు కె.రాంబాబు, రామాంజనేయులు అభినందించారు. సమావేశంలో ఏఎస్పీ ఏఆర్ దామోదర్, డీఎస్పీ ఆకురాతి పల్లపురాజు పాల్గొన్నారు.
Advertisement
Advertisement