నల్లగొండ ఘనవిజయం
జింఖానా అంతర్ జిల్లా రెండు రోజుల లీగ్‌లో నల్లగొండ జట్టు 92 పరుగుల తేడాతో వరంగల్ జట్టుపై గెలుపొందింది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో నల్గొండ తన రెండో ఇన్నింగ్స్‌లో 177 పరుగులు చేసి ఆలౌటైంది.
మణి (42) మెరుగ్గా ఆడాడు. వరంగల్ బౌలర్ రాజ్‌కుమార్ 4 వికెట్లు పడగొట్టాడు. తర్వాత తన రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన వరంగల్ 160 పరుగులకే కుప్పకూలింది. సుకాంత్ 30 పరుగులు చేశాడు. నల్లగొండ బౌలర్లు ఉపేందర్ 4 వికెట్లు పడగొట్టగా... సురేశ్ 3 వికెట్లు తీసుకున్నాడు. అంతకుముందు నల్లగొండ తన తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగులు చేయగా, వరంగల్ 105 పరుగులకే ఆలౌటైంది.
ఎ-ఇన్స్టిట్యూషన్ వన్డే లీగ్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో కెనరా బ్యాంక్ బౌలర్ ప్రసేన్ రెడ్డి 6 వికెట్లు పడగొట్టి వీఎస్టీ జట్టుకు చుక్కలు చూపించాడు. దీంతో కెనరా బ్యాంక్ జట్టు 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ప్రసేన్‌కు తోడు అలీ 4 వికెట్లు పడగొట్టడంతో తొలుత వీఎస్టీ 59 పరుగులకే చేతులెత్తేసింది. అనంతరం కెనరా బ్యాంక్ వికెట్ కోల్పోయి 60 పరుగులు చేసింది.