22 మంది విద్యార్థుల హాల్టికెట్లలో తప్పిదాలు
తిరుపతి: చిత్తూరు జిల్లాలో బుధవారం ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షల సందర్భంగా 22 మంది విద్యార్థుల హాల్ టికెట్లలో తప్పిదాలను గుర్తించారు. ద్వితీయ భాషగా తెలుగుకు బదులు హాల్టికెట్లలో కొందరికి ఇంగ్లిష్, కొందరికి సంస్కృతం ఉండడంతో పరీక్ష ప్రారంభమైన తర్వాత విద్యార్థులు ఆలస్యంగా మేల్కొని ఇన్విజిలేటర్ల దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో అధికారులు ఓఎంఆర్ పత్రాలను మార్చి ఇచ్చారు.ఇంటర్మీడియట్ తొలి సంవత్సరం పరీక్షలకు ‘ఒక్క నిమిషం’ బాగా ఎఫెక్ట్ చూపింది. వారి భవిష్యత్‌ను దెబ్బతీసింది.ఇంటర్ పరీక్షలకు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించకూడదన్న సర్కారు ఆదేశాలను అధికారులు తు.చ. తప్పకుండా పాటించారు.