అమ్మాయిలే టాప్..!
ఇంటర్ మొదటి ఏడాది ఫలితాల్లో జిల్లాకు రాష్ట్రంలో 22వ స్థానం
- ఎంపీసీలో జిల్లా టాపర్‌గా ప్రతిభ, బైపీసీలో స్కాలర్స్
ఇంటర్మీడియట్ మొదటి ఏడాది ఫలితాల్లో బాలికలు తమ హవాను చాటారు. వారే టాప్‌గా నిలిచారు. ఇక గత ఫలితాలతో సరిపోలిస్తే కాస్త మెరుగుదల కనిపించింది. ప్రైవేటు హవా కొనసాగినా ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు కూడా తమ సత్తాను చాటుకున్నారు.
మహబూబ్‌నగర్ విద్యావిభాగం, న్యూస్‌లైన్: ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో గతేడాదితో పోలిస్తే జిల్లా మొదటి ఒక్కస్థానం మెరుగుపర్చుకుంది. గతేడాది 40శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 23వ స్థానం (చివరి స్థానం) లో ఉండగా, ఈ ఏడాది 42శాతం ఉత్తీర్ణతతో 22వ స్థానం సాధించింది. ఇంటర్ ఫస్టియర్ ఉత్తీర్ణతలో బాలికలదే పై చేయిగా నిలిచింది. జిల్లా వ్యాప్తంగా ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు 31,517 మంది విద్యార్థులు హాజరవ్వగా 13,199 మంది ఉత్తీర్ణత సాధించారు. అంటే 42 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. 16,657 మంది బాలురు పరీక్షలకు హాజరు కాగా 6,269 మంది బాలురు అంటే 38శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. అదే విధంగా 14,860 మంది బాలికలు పరీక్షలకు హాజ రు కాగా 6,930 మంది అంటే 47 శాతం మంది బాలికలు ఉత్తీర్ణత సాధించారు.
ఒకేషన్ విభాగంలో 2,792 మంది విద్యార్థుల కు గా ను 905 మంది విద్యార్థులు అంటే 32శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సా దించారు. 1918 మంది బాలురు పరీక్షలు రాయగా 905 మంది ఉత్తీర్ణులయ్యారు. 812 మంది బాలికలు పరీక్షలు రాయగా 270 మంది ఉత్తీర్ణత సాధించారని ఆర్ఐఓ దామోదరాచారి వెల్లడించారు.
ప్రభుత్వ కళాశాలల హవా..:
జిల్లాలో ప్రభుత్వజూనియర్‌కళాశాలల్లో ఉత్తీర్ణతాశాతం పెరిగిందని ఆర్ఐఓ దామోదరాచారి వెల్లడించారు. పాన్‌గల్‌ప్రభుత్వ జూని యర్ కళాశాల 93.64శాతం ఉత్తీర్ణతతో జిల్లాలో తొలిస్థానంలో నిలువగా, ఖిల్లాఘనపూర్ 89.36శాతం ఉత్తీర్ణతతో జిల్లా ద్వితీయస్థానం సాధించింది. 10.08శాతం ఉత్తీర్ణతతో ఎన్మనగండ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల చివరి స్థానంలో నిలిచింది.
జిల్లాలో ప్రతిభ జూనియర్‌కళాశాలకు చెందిన విద్యార్థులు వింద్య, పోతిరెడ్డి రాకేష్‌రెడ్డి అనే విద్యార్థులు ఎంపిసిలో 470కి 465 మార్కులు సాధించి జిల్లా టాపర్లుగా నిలిచా రు. బైపీసీ విభాగంలో వనపర్తి స్కాలర్స్ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థిని ఎల్.హరిత బైపీసీలో 440 మార్కులకు గాను 435 మార్కులు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచింది. అదే విధంగా ఎంఇసిలో జలజం జూనియర్ కళాశాల విద్యార్థి అభిషేక్ 500 మార్కులకు గాను 485 మార్కులు సాధించి జిల్లా మొదటి స్థానంలో నిలిచాడు.
గత మూడేళ్ల ఉత్తీర్ణతాశాతం...:
గత మూడేళ్లతో పోలిస్తే ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో ఉత్తీర్ణతాశాతం పెరిగింది. 2011 లో 31,774 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 12612 మంది 40శాతం మం ది ఉత్తీర్ణ సాధించారు. 2012లో 32,737 మందికి గాను 12,159 మంది అంటే 37శా తం మంది ఉత్తీర్ణత సాధించారు. 2013లో 33,160 మంది విద్యార్థులకు గాను 13,147 మంది అంటే 40శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది 2014లో 31,517 మంది విద్యార్థులకు గాను 13,139 మంది అంటే 42శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.