inter stater thief
-
జైలులో స్నేహం.. కథ మొదలైంది అక్కడినుంచే!
సాక్షి,మల్యాల(చొప్పదండి): జైలులో ఇద్దరు నిందితుల మధ్య స్నేహం చోరీలకు బీజం వేసింది. జైలు నుంచి విడుదలయ్యాక ఇద్దరూ.. మరో ముగ్గురితో కలిసి అంతర్రాష్ట్ర ముఠాగా ఏర్పడ్డారు. వాట్సప్ కాల్ మాట్లాడుతూ చోరీలకు స్కెచ్ వేసేవారు.. ఉత్తర తెలంగాణలోని పలు బ్యాంకుల వద్ద రెక్కీ నిర్వహించారు. ఇటీవల కాలంలో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని పలు బ్యాంకుల్లో చోరీకి పాల్పడ్డారు. 6న పూడురు బ్యాంకులో.. కర్ణాటకలోని సూళ్లపేట బ్యాంకులో 2017లో జరిగిన దోపిడీ కేసులో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఫహీంఖాన్, 2019లో గుల్బర్గాకు చెందిన జాలేంద్రనాథ్ ఒక హత్య కేసులో సెంట్రల్ జైలుకు వెళ్లారు. వారి మధ్య స్నేహం కుదిరింది. జైలు నుంచి విడుదలయ్యాక ముఠాగా ఏర్పడి కొత్తగూడెం, ములుగు, పూడూరు, జహీరాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, మంచిర్యాలలోని బ్యాంకుల వద్ద రెక్కీ నిర్వహించారు. ఈ ఏడాది మార్చి 6న జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరులోని ప్యాక్స్ బ్యాంకులో, 10న ఉట్నూరు దక్కన్ గ్రామీణ బ్యాంకులో చోరీ చేసి మహారాష్ట్రలోని లాథూర్‌కు పారిపోయారు. ఒకరు అరెస్ట్.. పరారీలో నలుగురు.. పూడూరు ప్యాక్స్ బ్యాంకు దోపిడీ కేసులో ఒకరిని అరెస్టు చేశామని, నలుగురు పరారీలో ఉన్నారని డీఎస్పీ ప్రకాశ్ తెలిపారు. మల్యాల సీఐ కార్యాలయంలో శనివారం రాత్రి విలేకరులతో మాట్లాడారు. కర్ణాటకలోని గుల్బార్గాకు చెందిన కాలేవ జాలేంద్రనాథ్ను శనివారం అరెస్టు చేశామని, ఫహీంఖాన్, ఘోరాఖాన్, వహీద్‌ఖాన్, రాజరాము పరారీలో ఉన్నారని తెలిపారు. చోరీలు చేసేందుకు గుల్బార్గా నుంచి జాలేంద్రనాథ్, ఉత్తరప్రదేశ్ నుంచి మిగిలిన నలుగురు బయలుదేరి కరీంనగర్లో కలుసుకున్నారని వివరించారు. కరీంనగర్ నుంచి జగిత్యాల వెళ్తుండగా పూడూరు ప్యాక్స్ బ్యాంకు వెనకకు వెళ్లి, తాళాలు పగులగొట్టారని, వెంట తెచ్చుకున్న ఆక్సిజన్ సిలిండర్, గ్యాస్ కట్టర్‌తో లాకర్‌ను తెరిచి రూ.2,20,800 నగదుతో పారిపోయారని వెల్లడించారు. మరోసారి చోరీకి వెళ్తున్నామని ఏ–5(జాలేంద్రనాథ్)ను మిగిలిన నలుగురు అడుగగా, జాలేంద్రనాథ్ ఈనెల 19న జేఎన్టీయూ చెక్‌పోస్టు వద్దకు వచ్చి, మిగిలిన వారికోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలో పోలీసులు పట్టుకున్నారని చెప్పారు. ఎస్పీ సింధూశర్మ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ రూపేశ్, డీఎస్పీ ప్రకాశ్ ఆధ్వర్యంలో మల్యాల సీఐ రమణమూర్తి, ఎస్సై చిరంజీవి, కొడిమ్యాల ఎస్సై కె.వెంకట్రావు, కానిస్టేబుళ్లు బృందాలుగా ఏర్పడి, సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని పట్టుకున్నామని డీఎస్పీ వెల్లడించారు. -
అంతర్ రాష్ట్ర దొంగ అరెస్ట్
తిరుపతి క్రైం: ఆంధ్ర, తమిళనాడులో దొంగతనాలకు పాల్ప డుతున్న అంతర్ రాష్ట్ర దొంగను అరెస్ట్ చేసినట్లు క్రైం డీఎస్పీ రవిశంకర్‌రెడ్డి తెలిపారు. ఆయన సోమవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా పాండ్రవేటి గ్రామానికి చెందిన సంచిరెడ్డి వెంకటేష్(22) ప్రస్తుతం తిరుపతిలోని ఆటోనగర్‌లో నివాసం ఉంటున్నాడు. చిన్నతనం నుంచే దొంగతనాలకు పాల్పడి పలుసార్లు జైలుకు వెళ్లాడు. ఈ సంవత్సరం జనవరిలో అతన్ని తిరుపతి క్రైం పోలీసులు 23 చోరీ కేసుల్లో పీటీ వారెంట్‌పై అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. గతంలో తిరుపతి పరిధిలోని నిందితు డు చేసిన ఎమ్మార్‌పల్లి, అలిపిరి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఇళ్లు, వాహనాలు, బ్యాగుల చోరీలకు సంబంధించి క్రైం పోలీస్‌స్టేషన్‌లో 8 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో తప్పించుకుని తిరుగుతున్న నిందితుడు కోసం సీఐ పద్మలత గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం తిరుపతి–రేణిగుంట రోడ్డులోని వార్తా పేపర్ క్రాస్ రోడ్డు వద్ద ఉండగా వెంకటేష్‌ను అరెస్ట్ చేశారు. అతని నుంచి రూ.5.75 లక్షల విలువైన 10 గ్రాముల బంగారు నగలు, 2 ల్యాప్‌టాప్‌లు, 4 సెల్ఫోన్లు, 2 వాచీలు, నిందితుడు తన స్నేహితుడు ద్వారా తమిళనాడు కరూర్ వైశ్యాబ్యాంక్‌లో, చెన్నైలోని కుదువ పెట్టిన 175 గ్రాములు బంగారు నగలకు సంబంధించిన రసీదులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేయడంలో సీఐలు భాస్కర్‌రెడ్డి, మధు, ఎస్ఐ రమేష్‌బాబు కృషి చేశారని డీఎస్పీ తెలిపారు. -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
నాయుడుపేటటౌన్: తమిళనాడుతో పాటు రాష్ట్రంలో అనేక చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను నాయుడుపేట పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. స్థానిక సీఐ కార్యాలయంలో డీఎస్పీ వీఎస్ రాంబాబు విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలు వెల్లడించారు. చెన్నై నగరంలోని తండియార్పేటకు చెందిన బనా డేవిడ్ అలియాస్ హుడీబాబా తమిళనాడు, ఆంధ్ర రాష్ట్రంలో పలుచోరీ కేసుల్లో నిందితుడు. నిందితుడు నెల్లూరు, నాయుడుపేట పట్టణాల్లో తాళం వేసి ఉన్న ఇళ్లను ఎంచుకుని చోరీలకు పాల్పడినట్లుగా పోలీసుల దర్యాప్తులో కావడంతో ఆయా స్టేషన్ల పరిధిలో కేసులు నమోదయ్యాయి. 2017 డిసెంబర్ 9న అగ్రహారపేటలో తాళం వేసిన ఇం ట్లోకి ప్రవేశించి ల్యాప్‌ట్యాప్, య మహా బైక్‌ను అపహరించాడు. 15వ తేదీ పట్టణంలోని భరత్‌నగర్‌లోని ఓ ఇంట్లో బీరువా పగులగొట్టి బంగారు నగలు, వెండి వస్తువులు, ట్యాప్ ట్యా ప్లు చోరీ చేశాడు. 24వ తేదీ నెల్లూరు మిలిటరీ కాలనీలోని తాళం వేసి ఉన్న ఇంట్లోకి ప్రవేశించి బంగారు నగలు, వెండి వస్తువులతో పాటు ఇంటి ముందు నిలబెట్టి ఉన్న హోండా యాక్టీవా స్కూటీని అపహరించాడు. 2018 ఫిబ్రవరి నాయుడుపేటలోని రైల్వే క్వార్టర్స్‌లో ఓ ఇంట్లో చోరీకి పాల్పడి బంగారు నగలతో పాటు ఇంటి ముం దున్న టీవీఎస్ స్కూటీని చోరీ చేశాడు. అంతకు ముందు ఫిబ్రవరి 4వ తేదీ నెల్లూరు వేదాయపాళెంలో ఓ ఇంట్లో చోరీకి పాల్పడి బంగారు నగలను దోచుకెళ్లాడు. ఈ క్రమంలో నిం దితుడిపై పోలీసులు నిఘా ఉంచా రు. సీఐ మల్లికార్జునరావు ఆధ్వర్యంలో మండలంలోని బిరదవాడ సమీపంలో జాతీ య రహదారి కూడలి వద్ద గురువారం మధ్యాహ్నం అనుమానాస్పదంగా నిందితుడు స్కూటీపై వెళుతుండగా ఆపి తనిఖీ చేశారు. అతన్ని అనుమానించి అదుపులోకి తీసుకుని విచా రించగా చోరీల గుట్టు బయటపడింది. నిందితుడి వద్ద నుంచి సుమారు రూ.7 లక్షలు విలువైన 20 సవర్లకు పైగా బంగారు నగలు (164 గ్రాములు), రెండు ల్యాప్‌ట్యాప్‌లు, ఒక స్కూ టీని స్వాధీనం చేసుకున్నారు. నింది తుడి కోర్టుకు హాజరుపరిచి రిమాం డ్కు తరలించనున్నట్లు వివరించారు. అంతర్రాష్ట్ర దొంగను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఐడీ పా ర్టీ పోలీసులకు డీఎస్పీ నగదు రివా ర్డులను అందించారు. ఏఎస్సై శ్రీనివా సులురెడ్డి, హెడ్‌కానిస్టేబుళ్లు షేక్ కరీంసాహెబ్, పీ కృష్ణారెడ్డి, పీ తి రుపతిరావు, హోంగార్డు వెంకీతో పాటు సీ ఐ, ఎస్సైల జీపు డైవర్లు హోంగార్డుల కు నగదు రివార్డులను అందించారు. స మావేశంలో సీఐలు మల్లికార్జునరావు, కిషోర్‌బాబు, ఎస్సైలు రవినాయక్, కో టిరెడ్డి, ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పార్థీ గ్యాంగ్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అర్ధరాత్రి సమయాల్లో ఇళ్లలోకి ప్రవేశించి కిరాతకంగా వ్యవహరించే పార్థీ గ్యాంగ్ దొంగల ముఠా కదలికలపై పోలీస్ నిఘా ఉంచామని ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ కోరారు. మూడు రోజులకిందట చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో పార్థీ గ్యాంగ్ చోరీకి యత్నించిందన్నారు. దీంతో జిల్లా ఎస్పీ సూచనల మేరకు జిల్లా సరిహద్దు ప్రాంతాలతో పాటు జాతీయ, రాష్ట్ర రహదారులకు దగ్గర ఉండే పట్టణాల్లో ప్రత్యేక పోలీసులు గస్తీ నిర్వహిస్తూ నిఘా పెట్టినట్లు వివరించారు. ఎక్కడైనా అనుమానంగా తిరుగుతున్నట్లు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. -
అంతర్ జిల్లాల దొంగ అరెస్టు
గుంతకల్లు : జల్సాలకు అలవాటుపడిన ఓ యువకుడు అంతర్ జిల్లాల దొంగగా మారాడు. చిన్న వయస్సులోనే తండ్రి చనిపోవడంతో మంచీ, చెడ్డా చెప్పే వారు లేక 16 ఏళ్ల వయస్సులోనే హత్య కేసులో నిందితుడిగా పోలీసుల రికార్డుకెక్కాడు. అంతటితో ఆగక అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతూ చివరకు పోలీసులకు దొరికిపోయాడు. గుంతకల్లు టూటౌన్ పోలీసుస్టేషన్ ఆవరణలో అర్బన్ సీఐ రాజు, ఎస్ఐలు నగేష్‌బాబు(వన్‌టౌన్), వలీబాషా(టూటౌన్)తో కలసి డీఎస్పీ రవికుమార్ మీడియా ముందు నిందితుడ్ని గురువారం హాజరుపరిచారు. ఆయన కథనం మేరకు... అనుమానాస్పదంగా తిరుగుతూ... గుంతకల్లులోని బీరప్పగుడి సర్కిల్లో ఇనుపరాడ్‌తో అనుమానాస్పదంగా తిరుగాడుతున్న యువకుడి గురించి స్థానికులు అర్బన్ సీఐ రాజుకు సమాచారం తెలిపారు. ఆయన ఎస్ఐలు, సిబ్బందితో కలసి అక్కడికి వెళ్లి పట్టుకుని విచారించారు. విడపనకల్లు మండలం గడేకల్లుకు చెందిన శ్రీకాంత్(22)గా గుర్తించారు. జల్సాల కోసమే దొంగతనాలు చేస్తుంటానని విచారణలో అంగీకరించాడు. ఎక్కడెక్కడ చోరీలు చేశాడంటే... - గుంతకల్లులోని పద్మావతి నర్సింగ్ హోం ఏరియాలో 2016 జులైలో సుల్తాన్ నూర్ అహ్మద్ ఇంట్లో పట్టపగలు దొంగతనం చేసి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లాడు. - మహబూబ్‌నగర్ కాలనీలోని నేసే నారాయణ, లక్ష్మీ దంపతుల ఇంట్లో చొరబడి బంగారు ఆభరణాలు అపహరించాడు. - కర్నూలు జిల్లా ఆదోని వన్‌టౌన్ స్టేషన్ పరిధిలో శ్రీరాములుగౌడ్ అనే వ్యక్తి ఇంట్లో చోరీ చేశాడు. - దొంగలించిన బంగారు ఆభరణాలను కర్ణాటకలోని బళ్లారి రాష్ట్రంలో విక్రయించి వచ్చిన సొమ్ముతో జల్సా చేసేవాడు. నిందితుడి నుంచి రూ.5 లక్షలు విలువ చేసే 16.5 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు. బళ్లారి రాష్ట్రంలోని ముత్తూట్ ఫైనాన్స్‌లో కుదువ(తాకట్టు) పెట్టిన 2 తులాల బంగారు ఆభరణాలూ రికవరీ చేశామన్నారు. - పాతగుంతకల్లు అంకాలమ్మ లాలయ సమీపంలో గతంలో జరిగిన హత్య కేసులోనూ నిందితుడిగా ఉన్నాడు. - నిందితుడుపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో ప్రతిభ చూపిన పోలీసు సిబ్బందికి రివార్డుల కోసం ఎస్పీకి నివేదిక పంపినట్లు పేర్కొన్నారు. ఏఎస్ఐ తిరుపాల్, హెడ్ కానిస్టేబుళ్లు రామకృష్ణారెడ్డి, కానిస్టేబుళ్లు వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, మధు, సిద్దయ్య పాల్గొన్నారు.