నాయుడుపేటటౌన్: తమిళనాడుతో పాటు రాష్ట్రంలో అనేక చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను నాయుడుపేట పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. స్థానిక సీఐ కార్యాలయంలో డీఎస్పీ వీఎస్ రాంబాబు విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలు వెల్లడించారు. చెన్నై నగరంలోని తండియార్‌పేటకు చెందిన బనా డేవిడ్ అలియాస్ హుడీబాబా తమిళనాడు, ఆంధ్ర రాష్ట్రంలో పలుచోరీ కేసుల్లో నిందితుడు. నిందితుడు నెల్లూరు, నాయుడుపేట పట్టణాల్లో తాళం వేసి ఉన్న ఇళ్లను ఎంచుకుని చోరీలకు పాల్పడినట్లుగా పోలీసుల దర్యాప్తులో కావడంతో ఆయా స్టేషన్ల పరిధిలో కేసులు నమోదయ్యాయి. 2017 డిసెంబర్ 9న అగ్రహారపేటలో తాళం వేసిన ఇం ట్లోకి ప్రవేశించి ల్యాప్‌ట్యాప్, య మహా బైక్‌ను అపహరించాడు. 15వ తేదీ పట్టణంలోని భరత్‌నగర్‌లోని ఓ ఇంట్లో బీరువా పగులగొట్టి బంగారు నగలు, వెండి వస్తువులు, ట్యాప్ ట్యా ప్‌లు చోరీ చేశాడు.
24వ తేదీ నెల్లూరు మిలిటరీ కాలనీలోని తాళం వేసి ఉన్న ఇంట్లోకి ప్రవేశించి బంగారు నగలు, వెండి వస్తువులతో పాటు ఇంటి ముందు నిలబెట్టి ఉన్న హోండా యాక్టీవా స్కూటీని అపహరించాడు. 2018 ఫిబ్రవరి నాయుడుపేటలోని రైల్వే క్వార్టర్స్‌లో ఓ ఇంట్లో చోరీకి పాల్పడి బంగారు నగలతో పాటు ఇంటి ముం దున్న టీవీఎస్ స్కూటీని చోరీ చేశాడు. అంతకు ముందు ఫిబ్రవరి 4వ తేదీ నెల్లూరు వేదాయపాళెంలో ఓ ఇంట్లో చోరీకి పాల్పడి బంగారు నగలను దోచుకెళ్లాడు. ఈ క్రమంలో నిం దితుడిపై పోలీసులు నిఘా ఉంచా రు. సీఐ మల్లికార్జునరావు ఆధ్వర్యంలో మండలంలోని బిరదవాడ సమీపంలో జాతీ య రహదారి కూడలి వద్ద గురువారం మధ్యాహ్నం అనుమానాస్పదంగా నిందితుడు స్కూటీపై వెళుతుండగా ఆపి తనిఖీ చేశారు.
అతన్ని అనుమానించి అదుపులోకి తీసుకుని విచా రించగా చోరీల గుట్టు బయటపడింది. నిందితుడి వద్ద నుంచి సుమారు రూ.7 లక్షలు విలువైన 20 సవర్లకు పైగా బంగారు నగలు (164 గ్రాములు), రెండు ల్యాప్‌ట్యాప్‌లు, ఒక స్కూ టీని స్వాధీనం చేసుకున్నారు. నింది తుడి కోర్టుకు హాజరుపరిచి రిమాం డ్‌కు తరలించనున్నట్లు వివరించారు. అంతర్రాష్ట్ర దొంగను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఐడీ పా ర్టీ పోలీసులకు డీఎస్పీ నగదు రివా ర్డులను అందించారు. ఏఎస్సై శ్రీనివా సులురెడ్డి, హెడ్‌కానిస్టేబుళ్లు షేక్ కరీంసాహెబ్, పీ కృష్ణారెడ్డి, పీ తి రుపతిరావు, హోంగార్డు వెంకీతో పాటు సీ ఐ, ఎస్సైల జీపు డైవర్లు హోంగార్డుల కు నగదు రివార్డులను అందించారు. స మావేశంలో సీఐలు మల్లికార్జునరావు, కిషోర్‌బాబు, ఎస్సైలు రవినాయక్, కో టిరెడ్డి, ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పార్థీ గ్యాంగ్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
అర్ధరాత్రి సమయాల్లో ఇళ్లలోకి ప్రవేశించి కిరాతకంగా వ్యవహరించే పార్థీ గ్యాంగ్ దొంగల ముఠా కదలికలపై పోలీస్ నిఘా ఉంచామని ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ కోరారు. మూడు రోజులకిందట చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో పార్థీ గ్యాంగ్ చోరీకి యత్నించిందన్నారు. దీంతో జిల్లా ఎస్పీ సూచనల మేరకు జిల్లా సరిహద్దు ప్రాంతాలతో పాటు జాతీయ, రాష్ట్ర రహదారులకు దగ్గర ఉండే పట్టణాల్లో ప్రత్యేక పోలీసులు గస్తీ నిర్వహిస్తూ నిఘా పెట్టినట్లు వివరించారు. ఎక్కడైనా అనుమానంగా తిరుగుతున్నట్లు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment