నిందితుడితో పోలీసులు
తిరుపతి క్రైం: ఆంధ్ర, తమిళనాడులో దొంగతనాలకు పాల్ప డుతున్న అంతర్ రాష్ట్ర దొంగను అరెస్ట్ చేసినట్లు క్రైం డీఎస్పీ రవిశంకర్‌రెడ్డి తెలిపారు. ఆయన సోమవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా పాండ్రవేటి గ్రామానికి చెందిన సంచిరెడ్డి వెంకటేష్(22) ప్రస్తుతం తిరుపతిలోని ఆటోనగర్‌లో నివాసం ఉంటున్నాడు. చిన్నతనం నుంచే దొంగతనాలకు పాల్పడి పలుసార్లు జైలుకు వెళ్లాడు. ఈ సంవత్సరం జనవరిలో అతన్ని తిరుపతి క్రైం పోలీసులు 23 చోరీ కేసుల్లో పీటీ వారెంట్‌పై అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. గతంలో తిరుపతి పరిధిలోని నిందితు డు చేసిన ఎమ్మార్‌పల్లి, అలిపిరి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఇళ్లు, వాహనాలు, బ్యాగుల చోరీలకు సంబంధించి క్రైం పోలీస్‌స్టేషన్‌లో 8 కేసులు నమోదయ్యాయి.
ఈ కేసుల్లో తప్పించుకుని తిరుగుతున్న నిందితుడు కోసం సీఐ పద్మలత గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం తిరుపతి–రేణిగుంట రోడ్డులోని వార్తా పేపర్ క్రాస్ రోడ్డు వద్ద ఉండగా వెంకటేష్‌ను అరెస్ట్ చేశారు. అతని నుంచి రూ.5.75 లక్షల విలువైన 10 గ్రాముల బంగారు నగలు, 2 ల్యాప్‌టాప్‌లు, 4 సెల్‌ఫోన్లు, 2 వాచీలు, నిందితుడు తన స్నేహితుడు ద్వారా తమిళనాడు కరూర్ వైశ్యాబ్యాంక్‌లో, చెన్నైలోని కుదువ పెట్టిన 175 గ్రాములు బంగారు నగలకు సంబంధించిన రసీదులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేయడంలో సీఐలు భాస్కర్‌రెడ్డి, మధు, ఎస్‌ఐ రమేష్‌బాబు కృషి చేశారని డీఎస్పీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment