తాకట్టులో పుస్తెలు
బి.కొత్తకోట: పడమటి మండలాల్లో కొన్ని రోజులుగా ముసురుపట్టి జల్లులతో కూడిన వర్షాలకు రైతులు కాడిపట్టారు. వేరుశెనగ పంటలు సాగుచేసేందుకు మిగిలింది మరో నాలుగు రోజులే కావడంతో పెట్టుబడికోసం రైతులు బంగారాన్ని తాకట్టుపెట్టేందుకు బ్యాంకుల వద్దకు పరుగులు తీస్తున్నారు. పడమటి మండలాల్లో ఈ పరిస్థితులు కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నాయి. బ్యాంకుల్లో కరువు రైతులు బారులు తీరుతున్నారు. ఇప్పటికే ఇళ్లలోని, భార్యల ఒంటిపైనున్న బంగారు నగలను బ్యాంకుల్లో తనఖాపెట్టి అప్పులు తెస్తున్నారు. రైతులు పంట రుణాల కోసం బ్యాంకులతోపాటు వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయిస్తున్నారు. రూ.వందకు రూ.3 నుంచి రూ.ఐదు వడ్డీతో అప్పులు తీసుకుంటున్నారు.
తాక ట్టులో రూ.300 కోట్ల బంగారు
ప్రస్తుత ఖరీఫ్ పంటల పెట్టుబడి కోసం రైతులు బ్యాంకుల్లో బంగారం మీద రూ.300కోట్ల రుణాలు పొందివుంటారని అంచనా. సగటున ఒక మండలంలో రూ.4 నుంచి రూ.5కోట్లను బంగారంపై రుణాలు పొందారన్నది అంచనా. ఇలా జిల్లాలో ఖరీఫ్ ప్రారంభమైన ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా ఉన్న 40 బ్యాంకులకు చెందిన 478 బ్రాంచిల్లో రైతులు బంగారం తాకట్టు పెట్టారు. ఇందులో జిల్లా సహకార బ్యాంకుల్లో బంగారంపై మేనెలలో రూ.21కోట్లు, జూన్‌లో రూ.18కోట్ల రుణాలిచ్చారు. ఇవికాక ప్రధాన బ్యాంకులు, గ్రామీణప్రాంతాల్లోని శాఖల్లో బంగారం తాక ట్టుపెట్టి రుణాలను ఇంకా తీసుకుంటూనే ఉన్నారు.
కొత్త రుణాలు రూ.1,413 కోట్ల మాటేలేదు
ప్రస్తుత ఖరీఫ్‌లో రైతులకు రూ.1,413 కోట్ల పంటరుణాలను అందించాల్సి ఉంది. ఇదికాక రబీ రైతులకు రూ.920 కోట్ల రుణాలు ఇవ్వాలన్నది లక్ష్యం. రబీ రుణాలను సెప్టెంబర్ నుంచి పంపీణీ చేయవచ్చు. ఈ రెండు రుణాలను 4.53 లక్షల మంది రైతులకు ఇవ్వాలన్నది లక్ష్యం. అయితే.. ఖరీఫ్ రైతులకు సత్వరమే రుణాలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. పంటలు సాగుచేయాల్సిన సమయంలో బ్యాంకులు మొండిచెయ్యి చూపిస్తున్నాయి.
రైతు రుణాలమాఫీపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన చర్యలింకా లేకపోవడం దీనిపై ప్రభావం చూపిస్తోంది. బ్యాంకులు రైతులకు కొత్తరుణాలు ఇవ్వడంలేదు. ప్రభుత్వం రుణామాఫీపై చర్యలు చేపట్టాకే కొత్తరుణాలు అందించే పరిస్థితులున్నాయి. దీంతో నిర్దేశిత రుణాల లక్ష్యాలను ఖరీఫ్‌లో అమలుచేయకుంటే రైతులు నష్టపోతారు. ప్రస్తుతం ఇదే జరుగుతోంది. పెట్టుబడులకోసం రైతులు అల్లాడిపోతున్నారు. గత ఖరీఫ్‌లో పంటలు రుణాలుగా రూ.664 కోట్లు పంపీణీ చేయగా ప్రస్తుతం రుణాల మాటేలేదు. పుణ్యకాలం పోయాక రుణాలిస్తే ప్రయోజనమేమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు.
బంగారం తాకట్టు పెట్టేందుకు వచ్చా
మాకు ఐదు ఎకరాల పొలం ఉంది. గతంలో పంట పెట్టుబడుల కోసం పీటీఎంలోని ప్రాథమిక సహకార పరపతి సంఘం బ్యాంకులో రూ.60 వేలు క్రాప్ లోన్‌తో పాటు బంగారం కుదువ పెట్టి అదే బ్యాంకులో రూ.22 వేలు అప్పుగా తీసుకున్నాను. బ్యాంకులో తీసుకున్న లోన్లన్నీ మాఫీ అవుతాయన్నారు. ఇంతవరకు మాఫీ కాలేదు. కొత్తగా బాంకోళ్లు లోన్లు ఇవ్వలేదు. ఈసారి శెనిక్కాయ పంట, మొక్కజొన్న పంట సాగు చేద్దామని భూమి చదును చేసి విత్తనాలు సిద్ధం చేసుకున్నాను. పంట పెట్టుబడికి డబ్బు అవసరమైతే ఇంట్లో మిగిలివున్న బంగారాన్ని తాకట్టు పెట్టేందుకు బ్యాంకుకు వచ్చాను.
- శివారెడ్డి, అంకిరెడ్డిపల్లె, పీటీఎం మండలం
రీషెడ్యూల్కు బ్యాంకుల ఒత్తిడి
గత ఖరీఫ్‌లో బంగారంపై రుణాలు తీసుకున్న రైతులు ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. పంట రుణాలేగాక బంగారంపై తీసుకొన్న రుణకాల పరిమితి తీరడంతో ఆ రుణం చెల్లించాలనీ, లేని పక్షంలో వడ్డీ చెల్లించి రుణం రెన్యూవల్ చేయించుకోవాలంటూ బ్యాంకులు రైతులపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ఇప్పుడు పెట్టాల్సిన పంటలకు పెట్టుబడికోసం అల్లాడుతుంటే పుండుమీద కారం చల్లినట్టు కొత్త ఇబ్బందులు పడుతున్నారు. గత ఖరీఫ్‌లో జిల్లావ్యాప్తంగా నగలు తాకట్టుపై రూ.3,486 కోట్ల రుణాలున్నట్టు సమాచారం. వీటినే విడిపించుకోలేని రైతులు.. ఇళ్లల్లో మిగిలిన బంగారాన్నీ తాకట్టుకే పెడుతున్నారు.
అప్పు పుట్టడం లేదు
మాకు రెండున్నరెకరాల పొలముంది. పంట సాగుకోసం గత సంవత్సరం పలమనేరులోని గ్రామీణ బ్యాంకులో బంగారు నగలు పెట్టి రూ.1.5 లక్షల పంట రుణం తీసుకున్నాం. బోరులో నీళ్లు తగ్గిపోయాయి. టమాట పంట పూర్తిగా రోగాలతో పొయ్యింది. ఇప్పుడు పంట సాగు చేద్దామంటే ఇప్పటికిప్పుడు బయట కూడా వడ్డీలకు డబ్బు పుట్టడం లేదు. రుణమాఫీ ఎప్పుడు చేస్తారో తెలియ రాలేదు. ఈ సంవత్సరం పంట సాగుకు రుణాలు అందుతాయో లేదో. ప్రస్తుతానికి వరి నాటుకోవడానికి, వేరుశెనగ కలుపు తీయడానికి, చెరుకు తోట సాగుచేసేందుకు డబ్బులవసరముంది. ఏం చేయాలో ఏమో అర్థం కావడం లేదు.
- శ్రీనివాసులు రెడ్డి, కూర్మాయి, పలమనేరు మండలం
ఇప్పటికిప్పుడు వడ్డీకి డబ్బులు పుట్టడం లేదు
మాకు రెండెకరాల పొలముంది. పంట సాగుకోసం పలమనేరులోని బ్యాంకులో రూ.35వేలు పంట రుణం తీసుకున్నాం. బోరులో నీళ్లు పూర్తిగా ఎండిపోయాయి. పంటలు పెట్టలేక ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికిప్పుడు బయట వడ్డీలకు డబ్బు పుట్టడం లేదు. రుణమాఫీ ఎప్పుడు చేస్తారో తెలియదు. ఈ సంవత్సరం పంట సాగుకు రుణాలు అందుతాయో లేదో ఒకవేళ ప్రభుత్వం కొత్త రుణాలు ఇవ్వమని ఆదేశించినా బ్యాంకర్లు మాలాంటి సన్న, చిన్నకారు రైతులకు రుణాలిస్తారో ఇవ్వరో. ఇప్పుడు వరి నాటుకోవడానికి, వేరుశెనగ కలుపు తీయడానికి, చెరకు తోటకు పెట్టుబడికి డబ్బులవసరముంది. ఏం చేయాలో ఏమో అర్థం కావడం లేదు.
- ఉమాపతి నాయుడు, రైతు, పలమనేరు మండలం
మా గతేమిటో అర్థం కాలా!
రెండేళ్లుగా పట్టుసాగులో ఒడిదుడుకులు తప్పడం లేదు. 2012లో చంద్రికల కోసవుని బంగారు నగలు బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.64,000 తీసుకున్నాను. ఆపై వర్షాభావ పరిస్థితులతో బోర్లు అడుగంటారుు. కొత్తగా బోరు వేరుుంచేందుకు అదే ఏడాది సెప్టెంబర్‌లో మళ్లీ బంగారు తాకట్టు పెట్టి రూ.99,000 రుణం తీసుకున్నాను. కొత్తగా వేసిన బోరులో కూడా నీళ్లు తక్కువగా పడ్డాయి. వుల్బరీ చెట్లకు నీళ్లు అందడం కష్టంగా వూరింది. ఇంట్లో ఉన్న నగలన్నీ తనఖాలో ఉన్నారుు. ఇక అప్పు కావాలన్నా ఇచ్చేవారు లేరు. ఏం చేయూలో దిక్కుతోచని స్థితిలో ఉన్నాను. నగలను వేలం వేస్తే మా గతేమిటో అర్థం కాలేదు.
-రాజా రెడ్డి, పట్టురైతు, పడిగలకుప్పం, వి.కోట వుండలం
కొత్త రుణాలు అందించి ఆదుకోవాలి
వుుఖ్యవుంత్రి చంద్రబాబునాయుుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వెంటనే రుణవూఫీ చేసి రైతులను ఆదుకోవాలి. నేను సప్తగిరి గ్రామీణ బ్యాంక్‌లో పాసుపుస్తకాలు తనఖా పెట్టి రూ.90 వేలు పంట రుణం తీసుకున్నాను. వర్షాలు లేక పంటలు సక్రవుంగా పండకపోవడంతో నష్టాల పాలయ్యూను. ఇప్పటివరకు బ్యాంకు రుణం తీర్చలేకపోయూను. ఇప్పుడిప్పుడే వర్షాలు కురుస్తున్నారుు. వుళ్లీ పొలాలను సాగుచేయూలంటే పెట్టుబడులు పెట్టాలి. బ్యాంకు రుణం తీర్చకపోవడంతో అధికారులు కొత్త రుణాలు ఇవ్వడం లేదు. దీంతో ఏమి చేయూలో దిక్కుతోచడం లేదు. వెంటనే కొత్త రుణాలు అందించి ఆదుకోవాలి.
-వుంజునాథ్, రైతు, ఆవులకుప్పం, రావుకుప్పం వుండలం