విమాన మృతుల్లో ప్రముఖ ఎయిడ్స్ పరిశోధకులు
మలేషియా విమాన ప్రమాదంలో ఎయిడ్స్ వ్యాధిపై పరిశోధనలు చేస్తున్న పలువురు ప్రముఖులు మరణించారని అంతర్జాతీయ ఎయిడ్స్ సోసైటి (ఐఏఎస్) శుక్రవారం తన అధికారి వెబ్సైట్లో పేర్కొంది. ఐఏఎస్ మాజీ అధ్యక్షుడు, ఎయిడ్స్ వ్యాధిపై సుదీర్ఘ కాలంగా పరిశోధనలు చేస్తున్న ప్రముఖ పరిశోధకుడు జోపి లాంజ్ కూడా మృతుల్లో ఉన్నారని వెల్లడించింది. 20వ అంతర్జాతీయ ఎయిడ్స్ సదస్సు ఆదివారం ఆస్ట్రేలియా రాజధాని మెల్బోర్న్లో ప్రారంభం కానుంది. ఆ సదస్సులో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ వ్యాధిపై పరిశోధనలు చేస్తున్న పలువురు మలేషియా విమానంలో ఆస్ట్రేలియా బయలుదేరారు.
రష్యా సరిహద్దుల్లోని చేరుకున్న ఆ విమానాన్ని ఉక్రెయిన్లో తిరుగుబాటు దారులు క్షిపణులతో దాడి చేయడంతో కూలిపోయింది. ఆ ప్రమాదంలో విమానంలోని 295 మంది మరణించారు. మృతుల్లో ఎయిడ్స్ పరిశోధకులు ఉన్నారు. మలేషియా విమానం మృతువు రూపంలో తమ సహచరులు, సన్నిహితులను కబళించివేసిందని ఐఏఎస్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.