International community
-
కిమ్ దుందుడుకు చేష్టలు.. స్పందించిన అమెరికా
వాషింగ్టన్: ఉత్తర కొరియా నియంతాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ దుందుడుకు చేష్టలపై అంతర్జాతీయ సమాజం మండిపడుతోంది. వారం వ్యవధిలో రెండోసారి బాలిస్టిక్ క్షిపణి పరీక్షలను నిర్వహించడంపై అమెరికా తీవ్రంగా మండిపడింది. దీంతో తీవ్ర ఆహార సంక్షోభం నేపథ్యంలో మిస్సైల్ పరీక్షలపై కిమ్ వెనక్కి తగ్గాడన్న అంచనాలు మళ్లీ తప్పాయి. కేవలం వారం వ్యధిలో రెండుసార్లు క్షిపణి పరీక్షలు నిర్వమించాడు కిమ్ జోంగ్ ఉన్. స్వయంగా దగ్గరుండి మరీ పరీక్షించాడు. ఈ చర్యలు.. అంతర్జాతీయ సమాజానికి ముప్పుగా పరిణమించబోతున్నాయని పేర్కొంది. అదే సమయంలో దక్షిణ కొరియా, జపాన్ దేశాల రక్షణ కోసం తమ నిబద్ధతను చాటుకుంటామని అమెరికా పునరుద్ఘాటించింది. ఉత్తర కొరియా ఐక్యరాజ్య సమతి భద్రత మండలి నియమ, నిబంధనలు ఉల్లంఘించిదని అగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం అమెరికా, ఉత్తర కొరియా మధ్య అణుచర్చలపై సంక్షోభం కొనసాగుతున్నప్పటికీ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అణ్వాయుధ కార్యక్రమాన్ని విస్తరిస్తామని ఇప్పటికే తెగేసి చెప్పారు. వారం వ్యవధిలోనే ఉత్తర కొరియా రెండోసారి క్షిపణి పరీక్షలు నిర్వహించి దక్షిణ కొరియాకు సవాల్ విసిరింది. తూర్పు సముద్రంలో ఈ పరీక్షలు నిర్వహించడంతో జపాన్ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. తమ దేశ నౌకలు, విమానాలు ఏమైనా ధ్వంసమయ్యాయా అన్న దిశగా విచారణ జరుపుతోంది. అయితే దేశసంస్కరణల సంగతి ఎలా ఉన్నా.. రక్షణ విభాగంలో తగ్గేదేలే లేదని ప్రకటించుకుంది కిమ్ అధికార విభాగం. చదవండి: మళ్లీ ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణి పరీక్ష -
ఐక్యంగా ఉగ్రపోరు సాగించాలి
సియోల్: ఉగ్రమూకలను, వారికి నిధులు చేరవేస్తున్న మార్గాలను సమూలంగా నిర్మూలించేందుకు అంతర్జాతీయ సమాజం ఏకమై చర్యలు తీసుకునే సమయం వచ్చిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పాకిస్తాన్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేస్తూ గత 40 ఏళ్లుగా భారత్ సీమాంతర ఉగ్రవాదానికి బాధితురాలిగా మారుతోందనీ, దేశంలో జరుగుతున్న శాంతియుత అభివృద్ధిని ఇది తరచుగా నాశనం చేస్తూనే ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం అన్ని దేశాలూ ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయన్నారు. మోదీ రెండ్రోజుల పాటు దక్షిణ కొరియాలో పర్యటిస్తుండటం తెలిసిందే. శుక్రవారం సియోల్‌లో విలేకరులతో మోదీ మాట్లాడుతూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు ఏకమై, మాటలకు మించి చర్యలు చేపట్టే సమయం వచ్చిందని అన్నారు. ‘మానవత్వాన్ని నమ్మే వాళ్లందరూ చేతులు కలపాలి. ఉగ్రవాద సంస్థలను, వాటికి నిధులను అందజేస్తున్న మార్గాలను, ఉగ్రవాద భావాలను, ఉగ్రవాదులను సమూలంగా నాశనం చేయాలి. అలా చేసినప్పుడే ద్వేషం స్థానంలో సామరస్యం ఏర్పడుతుంది’ అని మోదీ తెలిపారు. పుల్వామా ఉగ్రవాద దాడి విషయంలో భారత్‌కు బాసటగా నిలిచినందుకు దక్షిణ కొరియాకు ధన్యవాదాలు తెలిపారు. ఆర్థిక పరివర్తనంలో కీలక భాగస్వామి.. భారత ఆర్థిక పరివర్తనంలో దక్షిణ కొరియా కీలక భాగస్వామి అని మోదీ పేర్కొన్నారు. తన పర్యటనలో రెండో రోజైన శుక్రవారం మోదీ దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్–జే–ఇన్‌తో కలిసి వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత సహా పలు రంగాల్లో ద్వైపాక్షిక సహాకారం పెంపొందించే దిశగా చర్చల్లో పాల్గొన్నారు. అనంతరం మోదీ మాట్లాడుతూ భారత ఆర్థిక పరివర్తనంలో దక్షిణ కొరియాను ఒక విలువైన భాగస్వామిగా మేం భావిస్తామన్నారు. 2030 కల్లా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 50 బిలియన్ డాలర్లకు పెంచేందుకు గతంలో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు కట్టుబడి ఉంటామని తెలిపారు.అంతకుముందు మూన్–జే–ఇన్ అధికారిక నివాసం, కార్యాలయం వద్ద మోదీకి ప్రభుత్వ లాంఛనాలతో స్వాగతం లభించింది. ఈ బహుమతి ఎంతో ప్రత్యేకం 2018 ఏడాదికి సియోల్ శాంతి బహుమతిని మోదీకి దక్షిణ కొరియా ప్రభుత్వం ప్రదానం చేసింది. ఈ బహుమతిని గతేడాది అక్టోబర్‌లోనే మోదీకి ప్రకటించారు. మోదీ ఈ బహుమతి గురించి మాట్లాడుతూ ఇది ఎంతో ప్రత్యేకమైనదన్నారు. 1988లో సియోల్‌లో జరిగిన ఒలింపిక్స్ విజయవంతమైనందుకు గుర్తుగా దీనిని ఏటా ఇస్తున్నారు. ఈ అవార్డు కింద మోదీకి 2 లక్షల డాలర్ల (రూ. 1.3 కోట్లు) నగదు లభించగా, ఆ మొత్తాన్ని గంగానది ప్రక్షాళన నిధికి విరాళంగా ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ‘ఉగ్రవాదంపై పోరులో భారత్ ద్వైపాక్షిక, బహుపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు మేం కట్టుబడి ఉన్నాం’ అని మోదీ చెప్పారు. సియోల్‌లోని జాతీయ శ్మశానాన్ని కూడా మోదీ సందర్శించి, అమర జవాన్లకు నివాళులర్పించారు. కొరియా యుద్ధం, వియత్నాం యుద్ధంలోనూ, ఇతర సందర్భాల్లోనూ మరణించిన దక్షిణ కొరియా సైనికుల అంత్యక్రియలు ఈ శ్మశానంలో నిర్వహించారు. -
‘ఐఎస్’ అంతానికి సాయం
పారిస్: ‘ఇస్లామిక్ స్టేట్(ఐఎస్)’ మిలిటెంట్లకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఇరాక్‌కు సైన్య సహకారం సహా అన్ని విధాలా సాయం అందించాలని అంతర్జాతీయ సమాజం నిర్ణయించింది. అమెరికా, రష్యా, చైనా సహా 30 దేశాలు, పలు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు సోమవారం పారిస్‌లో సమావేశమై.. ఐఎస్ ఆగడాలపై చర్చించారు. ఇటీవల బ్రిటన్ పౌరుణ్ణి ఐఎస్ మిలిటెంట్లు చంపిన నేపథ్యంలో.. ఇరాక్ నుంచి ఐఎస్ దళాలను తరిమికొట్టే ప్రక్రియను మరింత వేగం చేయాలని నిర్ణయించారు. ‘ఇరాక్ కోరిన విధంగా, అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా అవసరమైన సైన్య సహకారాన్ని అందించాల’ని తీర్మానించారు. అయితే, భేటీ అనంతరం విడుదల చేసిన తీర్మాన పత్రంలో ఐఎస్ మిలిటెంట్లు ప్రబలంగా ఉన్న సిరియా ప్రస్తావన లేకపోవడం గమనార్హం. సమావేశాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు ప్రారంభించారు. సత్వరమే ‘ఐఎస్’ను అంతం చేయకపోతే అది మరిన్ని దేశాలకు చేరే ప్రమాదముందని ఇరాక్ అధ్యక్షుడు మాసుమ్ హెచ్చరించారు. ఐఎస్‌కు వ్యతిరేకంగా ఏర్పాటవుతున్న అంతర్జాతీయ కూటమిలో చేరేందుకు ఇరాన్ నిరాకరించింది. ఆ కూటమికి విశ్వసనీయత లేదని ఇరాన్ అత్యున్నత నేత, షియాల మతపెద్ద అయిన అలీ ఖొమేనీ స్పష్టం చేశారు. ఐఎస్‌పై సైనిక చర్య చేపట్టాల్సిందేనని నాటో సెక్రటరీ జనరల్ రస్ముసన్ తేల్చి చెప్పారు.