International Consultancy
-
పీడబ్ల్యూసీలో 30,000 నియామకాలు
న్యూఢిల్లీ: రాబోయే కొన్నేళ్లలో భారత్‌లో సుమారు 30,000 మంది సిబ్బందిని తీసుకునే యోచనలో ఉన్నట్లు అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ చైర్మన్ బాబ్ మోరిట్జ్ తెలిపారు. ప్రస్తుతం తమ దగ్గర దాదాపు 31,000 మంది ఉద్యోగులు ఉన్నట్లు ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. మరోవైపు, భారత్‌పై అత్యంత ఆశావహంగా ఉన్నట్లు ష్నైడర్ ఎలక్ట్రిక్ చైర్మన్ జాన్–పాస్కల్ ట్రైకోయిర్ తెలిపారు. ప్రస్తుతం అమెరికా, చైనా తర్వాత భారత్ తమకు అతి పెద్ద మార్కెట్‌గా ఉందని వివరించారు. స్వచ్ఛ ఇంధన రంగంలో పురోగమించేందుకు భారత్‌కు అపార అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు. -
ఇండియా సిమెంట్స్ ఆధునీకరణ
చెన్నై: ప్రయివేట్ రంగ కంపెనీ ఇండియా సిమెంట్స్ పాత తయారీ ప్లాంట్లను ఆధునీకరించేందుకు ప్రణాళికలు వేసింది. ఇందుకు రూ. 1,500–1,600 కోట్ల పెట్టుబడి వ్యయాలను అంచనా వేస్తోంది. నిధులను అంతర్గత వనరుల నుంచి సమకూర్చుకోనున్నట్లు కంపెనీ వైస్‌చైర్మన్, ఎండీ ఎన్.శ్రీనివాసన్ వెల్లడించారు. ఆధునీకరణ ప్రణాళికలకోసం రెండు అంతర్జాతీయ కన్సల్టెంట్ సంస్థలను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. మొత్తం పాత సిమెంట్ ప్లాంట్ల సామర్థ్యాలను మెరుగుపరచేందుకు పూర్తిస్థాయిలో ఆధునీకరించనున్నట్లు తెలియజేశారు. ఇందుకు 15–18 నెలల్లో రూ. 1,500–1,600 కోట్ల పెట్టుబడి వ్యయాల కార్యాచరణ రూపొందించినట్లు వివరించారు. భూముల మానిటైజేషన్ ఇండియా సిమెంట్స్ చేతిలో 26,000 ఎకరాల భూమి ఉన్నదని, ల్యాండ్ బ్యాంక్‌ను మానిటైజ్ చేయడం ద్వారా నిధులను సమీకరించనున్నట్లు శ్రీనివాసన్ తెలియజేశారు. పాత ప్లాంట్ల ఆధునీకరణపై సలహాలకు క్రుప్ పాలిసియస్, ఎఫ్ఎల్ స్మిత్‌ను నియమించుకున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణలోని మల్కాపూర్, విష్ణుపురం ప్లాంట్లతో ఆధునీకరణ పనులు ప్రారంభంకానున్నట్లు కంపెనీ అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే తమిళానడులోని శంకరి, రాజస్తాన్‌లోని బన్సారాలోని ఆధునిక ప్లాంట్లను ఈ జాబితాలో చేర్చబోరని తెలియజేశాయి. ఆంధ్రప్రదేశ్‌లోని చిలంకూర్, యర్రగుంట్ల, తమిళనాడులో శంకరనగర్, శంకరి, దలవాయ్లలోనూ కంపెనీకి సిమెంట్ తయారీ ప్లాంట్లున్నాయి. చెన్నై, మహారాష్ట్రలలో రెండు గ్రైండింగ్ యూనిట్లను సైతం కలిగి ఉంది. ఈ యూనిట్లు ఉమ్మడిగా మొత్తం 16 మిలియన్ టన్నుల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్లాంట్లను రెండు దశాబ్దాల క్రితం సొంతం చేసుకుంది. క్యూ3లో రూ. 133 కోట్ల నికర లాభం ఇండియా సిమెంట్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం భారీగా ఎగసి రూ. 133 కోట్లను అధిగమించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 16 కోట్లు మాత్రమే ఆర్జించింది. అనుబంధ సంస్థ స్ప్రింగ్‌వే మైనింగ్ ప్రయివేట్(ఎస్‌ఎంపీఎల్) విక్రయం ద్వారా నమోదైన ఆర్జన లాభాలకు దోహదపడినట్లు కంపెనీ పేర్కొంది. మొత్తం ఆదాయం 10 శాతంపైగా వృద్ధితో రూ. 1,281 కోట్లకు చేరింది. గత క్యూ3లో రూ. 1,161 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 1,153 కోట్ల నుంచి రూ. 1,458 కోట్లకు పెరిగాయి. 2022 అక్టోబర్ 10న దాదాపు రూ. 477 కోట్లకు ఎస్‌ఎంపీఎల్ విక్రయాన్ని పూర్తి చేసింది. ఫలితాల నేపథ్యంలో ఇండియా సిమెంట్స్ షేరు ఎన్ఎస్ఈలో 0.7 శాతం బలహీనపడి రూ. 191 వద్ద ముగిసింది. -
ఏపీలో రాష్ట్రాభివృద్ధి పేరిట ఏడు మిషన్లు
-
మళ్లీ కన్సల్టెన్సీల రాజ్యం
* ఏపీలో రాష్ట్రాభివృద్ధి పేరిట ఏడు మిషన్లు * ప్రతి మిషన్‌కు ఓ అంతర్జాతీయ కన్సల్టెన్సీ * లక్షలాది రూపాయల వ్యయూనికి సర్కారు సిద్ధం * ఇకపై ప్రతిదీ పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంలోనే.. సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి ఏడు ప్రత్యేక మిషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. వాటికి సలహాలిచ్చేందుకు అంతర్జాతీయ కన్సల్టెన్సీలను నియమించనుంది. ఏడు ప్రధాన రంగాలకు చెందిన ఈ మిషన్లను సంబంధిత రంగానికి చెందిన అధికారిని కన్వీనర్‌గా నియమించింది. ప్రాథమిక రంగాల మిషన్‌కు సాగు నీటి శాఖ ముఖ్య కార్యదర్శి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. పట్టణ మిషన్‌కు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, నైపుణ్య అభివృద్ధి మిషన్‌కు కార్మిక, ఉపాధి కల్పన శాఖ ముఖ్య కార్యదర్శి, మౌలిక వసతుల కల్పన మిషన్‌కు ఆ శాఖ ముఖ్య కార్యదర్శిని కన్వీనర్లుగా సర్కారు నియమించింది. తయూరీ రంగ మిషన్‌కు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి, సేవా రంగ మిషన్‌కు పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సంక్షేమ మిషన్‌కు గ్రామీణాభివృద్ధి, ఆరోగ్య, సాంఘిక సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులు కన్వీనర్లుగా వ్యవహరించనున్నారు. ప్రతి మిషన్‌కు ప్రత్యేకంగా అంతర్జాతీయ కన్సల్టెన్సీలను నియమించనున్నారు. గతంలోనూ చంద్రబాబు పాలనలో అంతర్జాతీయ కన్సల్టెన్సీలకు ప్రాధాన్యమిచ్చి, వాటికి కోట్లాది రూపాయలు వెచ్చించారు. గతంలో విజన్-2020 డాక్యుమెంట్ కోసం మెకెన్సీ సంస్థను నియమించి లక్షలాది రూపాయలు ఖర్చు చేశారు. అయితే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రమైన నిధుల కొరత ఎదుర్కొంటోంది. నూతన రాజధాని నిర్మాణానికి విరాళాలు సేకరిస్తోంది. ఈ పరిస్థితుల్లో కూడా సమర్థులైన అధికారులను పక్కనపెట్టి, విదేశీ సంస్థలను కన్సల్టెన్సీలుగా నియమించడం, పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని ఖర్చు చేయడానికి సిద్ధపడటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టే పనులన్నీ పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ)తోనే కొనసాగాలని, ఇటీవలి ఉన్నతాధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అలాగైతేనే లక్ష్యాలను సాధించగలమని పేర్కొన్నారు. అభివృద్ధి పర్యవేక్షణకు సూచీలు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి పర్యవేక్షణకు 40 మెగా సూచీలను నిర్ధారించారు. ఇటీవల జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో ప్రతి శాఖకు నాలుగైదు ప్రధాన అభివృద్ధి సూచీలను రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీచేశారు. అదేవిధంగా పైస్థాయి నుంచి కిందిస్థాయి ఉద్యోగి వరకు పనితీరు (ఫెర్ఫార్మన్స్) లక్ష్యాలను నిర్ధారించనున్నట్లు చెప్పారు. ఈ లక్ష్యాల మేరకు పనిచేసి, వారు సాధించిన ఫలితాల ఆధారంగా ఉద్యోగుల పనితీరును నిర్ధారించనున్నారు. ఆర్ధిక, మానవ వనరులను మరింత సమర్ధవంతంగా వినియోగించుకోవడానికి ఇలాంటి సూచీలు, లక్ష్యాలు దోహదపడతాయనేది చంద్రబాబు ఆలోచన అని అధికారవర్గాలు తెలిపాయి.