10 నుంచి అంతర్జాతీయ సదస్సు
అనంతపురం ఎడ్యుకేషన్: ‘మనుషులు అక్రమ రవాణా’ అనే అంశంపై స్థానిక ఆర్ట్స్ కళాశాల డ్రామా హాలులో ఈనెల 10 నుంచి 12 దాకా మూడు రోజుల పాటు అంతర్జాతీయ సదస్సు జరగనుంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషియల్, సైన్స్ రీసెర్చ్, రూరల్ డెవలప్మెంట్ సొసైటీ, ఆర్ట్స్ కళాశాల పొలిటికల్ సైన్స్ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతుంది.‘మహిళలు, అమ్మాయిల అక్రమ రవాణా’ అనేది అంతర్జాతీయ సమస్యగా మారింది. ఆయుదాల అక్రమ రవాణా, మత్తు పదార్థాల రవాణా తర్వాత మనుషుల రవాణా ప్రముఖంగా వినిపిస్తోంది. కళాశాల ప్రిన్సిపల్ రంగస్వామి అధ్యక్షతన జరిగే సదస్సుకు ముఖ్య అతిథులుగా కళాశాల విద్య కమిషనర్ బి.ఉదయలక్ష్మీ, ఎస్కేయూ వీసీ కె. రాజగోపాల్, కలెక్టర్ కోన శశిధర్, ఎస్పీ రాజశేఖర్‌బాబు, కళాశాల విద్య ఆర్జేడీ కె.మల్లేశ్వరి, సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయర్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్.గంగాధరశాస్త్రి, ఉస్మానియూ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ జి. రామిరెడ్డి, ఆసే్త్రలియాకు చెందిన రెజ్రపెంటింగ్ మై చాయిస్ ఫౌండేషన్ ప్రోగ్రాం డైరెక్టర్ వీవీయన్ ఇసాక్, ఇండోర్ ఐఐఎం ప్రొఫెసర్ డాక్టర్ ఎంఆర్ శ్రీధర్ హాజరవుతున్నారు.