International Day of Yoga
-
మున్ముందు అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో యోగా
సిద్దిపేటజోన్/పెద్దపల్లి: భవిష్యత్‌లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో యోగా ప్రక్రియ అమలు చేయనున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ‘‘ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచేందుకు కృషి చేస్తున్నాం. ఇందులో భాగంగా గర్భిణులకు సులువైన యోగాసనా లు నేర్పిస్తున్నాం. గర్భిణుల మానసిక, శారీరక ఆరోగ్యానికి యోగా ఎంతో దోహదం చేస్తుంది’’ అని అన్నారు. 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సిద్దిపేటలోని ఆయుష్ విభాగం నిర్వహించిన యోగా డేలో మంత్రి మాట్లాడారు. సాధారణ ప్రసవాలు పెంచేందుకు ఆశ కార్యకర్తల కు, వైద్యసిబ్బందికి యోగా శిక్షణ ఇచ్చామని తెలి పారు. ఇప్పటికే సిద్దిపేట, నిజామాబాద్, ఖమ్మం జిల్లా ఆసుప త్రుల్లో యోగా ప్రక్రియ అమలులో ఉందని పేర్కొ న్నారు. భవిష్యత్ అంతా ఆయుష్ విద్యార్థులదేనని, నేచు రోపతి విద్యకు బోలెడు అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అంతకు ముందు మంత్రి ఇక్కడ కొద్దిసేపు యోగాసనాలు కూడా వేశారు. డబుల్ ఇంజిన్ కాదు.. ట్రబుల్ ఇంజిన్! ‘నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం వైద్య సదుపా యాల కల్పనలో దేశంలోనే తెలంగాణ మూడో స్థానంలో ఉంది. ఒకటి, రెండు స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు కూడా బీజేపీ, కాంగ్రెసేతర ప్రభుత్వాలే. డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్న ఉత్తరప్రదేశ్ మాత్రం 28వ స్థానంలో ఉంది. డబుల్ ఇంజిన్ సర్కారు అంటే ట్రబులే’అని హరీశ్ అన్నారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో మాతాశిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం జరిగిన టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో హరీశ్ మాట్లాడారు. -
విశ్వానికి దివ్య యోగం
సాక్షి, హైదరాబాద్: ‘యోగా విద్యకు ఎల్లలు లేవు.. కులం లేదు.. మతం లేదు.. ప్రాంతం లేదు.. ఇది విశ్వవ్యాప్తంగా అనుసరణీయం’ అని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో మంగళవా రం ఉదయం జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడుతూ యోగాను ఐక్యరాజ్య సమితి వరకూ తీసుకెళ్లి విశ్వవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించిన ప్రధాని మోదీని అభినందిస్తున్నానన్నారు. ప్రస్తుత తరం యోగా ప్రాధానాన్ని తెలుసుకునేలా ఈ ఏడాది యోగా థీమ్‌ను ‘యోగా ఫర్ స్పిరిట్యువాలిటీ’గా ఎంచుకున్నట్టు తెలిపారుæ. కోవిడ్ వల్ల శారీరకం గా, మానసికంగా సమస్యలు ఎదురయ్యాయని, ఈ నేపథ్యంలో ఒత్తిడి నివారణకు యోగా ఉపకరి స్తుందని చెప్పారు. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఆయుష్ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా దినోత్సవానికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అధ్యక్షత వహించారు. ఎమ్మెల్యే ఈటల సహా పలువురు బీజేపీ నాయకులు, నటుడు అడివి శేషు, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధు, యోగా సాధకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా వర్చ్యువల్ సందేశాన్ని వినిపించారు. -
సాధనతో ఆరోగ్య యోగం
మదనపల్లె సిటీ: నాటి కాలంలో ధ్యానం, చక్కటి ఆహారపు అలవాట్లుతో జీవనం సాగేది. ప్రస్తుతం అడుగడుగునా ఆధునికత రంగులు పులుముకుంటున్న వేళ వివిధ రకాల అనారోగ్యాలు వేగంగా వ్యాపిస్తున్నాయి. వీటి నుంచి బయటపడేందుకు, మానసిక ప్రశాంతతకు ఇటీవల కాలంలో పలువురు యోగాపై మక్కువ పెంచుకుని సాధన అలవాటుగా మార్చుకున్నారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు చాలా మంది యోగాపై మక్కువ చూపుతున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని యోగా గురువు శిల్ప గురించి ప్రత్యేక కథనం.. 12 ఏళ్లుగా తర్ఫీదు.. అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన శిల్ప వివాహానంతరం మదనపల్లెలో స్థిరపడ్డారు. 2010లో శిల్ప బెంగుళూరులోని స్వామి వివేకానంద యోగా అనుసాధన సంస్థలో ప్రత్యేక శిక్షణ పొందారు. 2011 నుంచి పట్టణంలో పలు పాఠశాలల్లో యోగాపై విద్యార్థులకు ప్రత్యేక శిక్షణిస్తున్నారు. ప్రతి రోజు వందలాది మంది విద్యార్థులకు యోగా నేర్పిస్తూ ఆరోగ్య పరిరక్షణ కోసం పాటుపడుతున్నారు. సుమారు 12 సంవత్సరాలుగా పట్టణంలోని పలు పాఠశాలల్లో యోగాపై విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ►జాతీయ స్థాయిలో ఆలిండియా కల్చర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 2012లో హైదరాబాదులో నిర్వహించిన పోటీల్లో పాల్గొన్నారు. యోగాలో ప్రత్యేక ప్రతిభ కనబరిచినందుకు అప్పటి తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్నారు. గురువుల పర్యవేక్షణలో ఆసనాలు సాధన చేయాలి.. యోగాసనాలు నిత్య జీవితంలో జరిగే క్రియల్లో భాగం కావాలి. అనారోగ్యం పేరుతో వేలాది రూపాయలు ఔషధాలకు వినియోగించేకంటే, రోజు కొంత సమయం వ్యక్తి గత ఆరోగ్యం కోసం కేటాయించి గురువుల పర్యవేక్షణలో ఆసనాలు సాధన చేస్తే రోగాలకు దూరంగా ఉండొచ్చు. చిన్నతనం నుంచి యోగాసనాలపై ఆసక్తితో నిష్ణాతులైన గురువుల శిక్షణలో సాధన చేశాను. – శిల్ప, యోగా గురువు, మదనపల్లె -
హార్టాసన
మనిషన్నాక ఏదో ఒక రోగం, మందన్నాక ఏదో ఒక రూపం ఉండాలి. ముక్కుదిబ్బడ పెద్ద రోగం కాదనకుంటాం. కానీ ముప్పుతిప్పలు పెడుతుంది. కోల్డ్ యాక్ట్ వేస్తాం. విక్స్ వేపోరబ్ రాస్తాం. నివారణ్ తాగుతాం. ఇన్హేలర్ పీలుస్తాం. ఇన్నున్నాయి మందులు. ముక్కుదిబ్బడ చిన్న రోగం అనుకుంటే, గుండెదడ పెద్ద రోగం. దిబ్బడకు, దడకు మధ్యలో బాడీలో ఎన్ని పార్టులైతే ఉన్నాయో అన్ని పార్టులకూ ఏదో ఒకటి రాకుండా పోదు, తిన్నగా ఉండం కనుక! తిన్నగా ఉన్నా కూడా వారసత్వంగా ఉన్నవాటిని, వస్తున్నవాటిని తప్పించుకోలేం. వీటన్నిటికీ ట్రీట్మెంట్ ఉంది. ట్రీట్మెంట్తో ప్రతిదీ నయం అవుతుంది. అసలు మాత్రను మింగగానే, గుళికను నోట్లో వేసుకోగానే, మూత నిండా సిరప్ తాగగానే, ఇంజెక్షన్ పొడిపించుకోగానే, సెలైన్ పెట్టించుకోగానే, వేర్లు, చూర్ణాలు, లేపనాలు ఒంటిని తాకగానే.. ఒంట్లో నయం అయిన ఫీలింగేదో తక్షణం కలుగుతుంది. మందును కళ్లతో చూడ్డం వల్ల కలిగే ఫలితం కావచ్చు ఆ ఫీలింగ్. మనకు అనేక వైద్య విధానాలున్నాయి. అలోపతి, నేచురోపతి, హోమియోపతి, యునాని, సిద్ధ, యోగా.. ప్రతి విధానంలోనూ ఔషధానికి ఒక రూపం ఉంది. వీటిల్లో ఒక్క యోగాకే రూపం లేదు! మరి రూపం లేనిది మందెలా అవుతుంది? మందు కానప్పటికీ కోట్లాది మందికి అనేక అనారోగ్యాల నుంచి విముక్తిని ఎలా కల్పించగలుగుతోంది! యోగాకు రూపం లేదనే మాట తప్పు. రూపం ఉంది. ఆ రూపం పేరే ‘ఆసనం’. మిగతా విధానాలన్నీ మెడిసిన్‌ని బయటి నుంచి బాడీకి అందిస్తాయి. యోగాసనం మాత్రం బాడీ తనకై తనే మెడిసిన్లని తయారు చేసుకునేలా చేస్తుంది! అద్భుతం కదా!! ఇంకో అద్భుతం కూడా ఉంది చూడండి. ఫిజికల్‌గా, మెంటల్‌గా, స్పిరుచ్యువల్గా.. మూడు రకాలుగా యోగా మన దేహానికి స్వస్థతను చేకూరుస్తుంది. అంటే ఒకే ఆసనానికి మూడు యాక్షన్లు ఉంటాయని కాదు. భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా చికిత్స దేనికి అవసరం అయితే దానికి ప్రత్యేకంగా ఒక ఆసనం ఉంటుంది. అలాగే ఒక్కో ఆనారోగ్యానికి ఒక్కో ఆసనం చికిత్సగా పనిచేస్తుంది. ఈ రోజు (జూన్ 21) ఇంటర్నేషనల్ యోగా డే. ఐక్యరాజ్య సమితి ఒక రోజు ముందే నిన్న యోగా డేని సెలబ్రేట్ చేసుకుంది. ఇవాళ ‘యోగా విత్ గురూస్’ అనే అంశంపై న్యూయార్క్‌లో సదస్సు నిర్వహిస్తోంది. ఈ ఏడాది యోగా డేకి ఐరాస థీమ్ : క్లైమేట్ యాక్షన్. మనం ఆ థీమ్‌ని ఫాలో అవుతూనే, వేరుగా ‘యోగా ఫర్ హార్ట్’ అనే ఇంకో థీమ్‌తో యోగా డేని జరుపుకుంటున్నాం. కేంద్రంలో మనకు ‘ఆయుశ్’ అనే మంత్రిత్వ శాఖ ఉంది. ఆయుర్వేదం, యోగా అండ్ నేచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి.. వీటన్నిటినీ కలిపి ‘ఆయుశ్’ అని పేరు పెట్టారు. ఆ శాఖ మంత్రి శ్రీపాద్ శయో నాయక్. ఆయనే మనం ఈ ఏడాది యోగా డేని ‘యోగా ఫర్ హార్ట్’ గా జరుపుకుంటున్నట్లు ప్రకటించారు. ‘‘ఇంటింటికీ యోగా సందేశాన్ని తీసుకెళ్లడం మా ఉద్దేశం’’అని ఆ ప్రకట విడుదల చేస్తున్నప్పుడు ఆయన అన్నారు. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ రాంచీలోని ప్రభాత్ తారా మైదాన్’కు వస్తున్నారు. అక్కడ ఆయన సంకేతమాత్రంగా గుండెకు ఆరోగ్యాన్ని ఇచ్చే యోగాసనాన్ని వేస్తారు. ఇక ఈ ఏడాదంతా.. యోగాసనాలు గుండె చుట్టూ తిరుగుతుంటాయి. అలా ప్రోగ్రాములను ప్లాన్ చేస్తారు. ఈ సందర్భంగా మనమూ, కొన్ని హార్ట్ ఆసనాల గురించి తెలుసుకోవడం సందర్భోచితంగానే కాదు, ఇన్స్పైరింగ్గా కూడా ఉంటుంది. -
డాలస్ ఎంజీఎంఎన్టీ ఆధ్వర్యంలో యోగా డే వేడుకలు
డాలస్(టెక్సాస్): పైనేమో 90 డిగ్రీల ఫారెన్‌హీట్ ఎండ.. పైగా చేసేది యోగా.. అయినాసరే అందరి మనసుల్లో చల్లటి భావనలు. ఎవరిపేరు పలికితే శాంతి మంత్రం జపించినట్లవుతుందో అలాంటి మహాత్మా గాంధీ పేరిట అమెరికా గడ్డపై ఒక్కటయ్యారు వారంతా. అందుకే ప్రశాంతంగా, నిశ్చయంగా కొనసాగిందా సాధన. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సస్ (ఎంజీఎంఎన్ టీ) ఆధ్వర్యంలో టెక్సాస్ రాష్ట్రం డాలస్ లోని ఇర్వింగ్ పట్టణంలో నిర్వహించిన యోగా సాధనలో దాదాపు 500 మంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ (ఏఓఎల్) సహకారంతో ఇర్వింగ్ సిటీలోని థామస్ జెఫర్సన్ పార్క్ లో గల మహాత్మా గాంధీ మెమోరియల్ వద్ద జూన్ 19న ఈ కార్యక్రమం జరిగింది. ఎంజీఎంఎన్టీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ షబ్నం మోద్గిల్ ఆహ్వానం మేరకు కార్యక్రమాన్ని ఉద్దేశంచి ప్రసంగించిన ఎంజీఎంఎన్టీ కార్యదర్శి రావు కలవల.. డాలస్ లోని మహాత్ముడి స్మారక స్థలి వద్ద యోగా దినోత్సవం జరుపుకోవడం గర్వకారణమని, యోగా డేను ప్రపంచ వ్యాపంగా 350 మిలియన్ల మంది జరుపుకొంటుండగా, అమెరికాలో 35 మిలియన్ల మంది యోగా సాధన చేస్తున్నారని తెలిపారు. అన్నీ తానై యోగా డే వేడుకలను నిర్వహించారంటూ ఎంజీఎంఎన్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ ప్రసాద్ తోటకూరను అభినందించారు. అమెరికాలోని అన్ని మహాత్ముడి స్మారకాల్లోకీ డాలస్ లోని స్మారక స్థలే పెద్దదిగా అవతరించిందని, ఇండియన్ అమెరికన్ల మధ్య సంబంధాల బలోపేతానికి కూడా ఈ స్థలమే కేంద్ర బిందువుగా మారిదని అన్నారు. ఎంజీఎంఎన్టీ డైరెక్టర్ తాయబ్ కుందావాలా ఆహ్వానం మేరకు కౌన్సిల్ జనరల్ ఆఫ్ హ్యూస్టన్ (టెక్సాస్) డాక్టర్ అనుపమా రాయ్, కౌన్సిల్ రిప్రెసెంటేటివ్ ఆర్.డి. జోషి లు ప్రసంగించారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ బృంద సభ్యులు శ్రీధర్ తుల్జారామ్, డాక్టర్ నిక్ ష్రాఫ్, సపానంద్ లు ఆహుతులకు యోగాభ్యాసం, ప్రాణాయాయం, ధ్యానం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఇప్పటివరకు నిర్వహించిన 200 కార్యక్రమాలకు తన సహకారాన్ని అందించిన ఎంజీఎంఎన్టీ బోర్డ్ మెంబర్, కమ్యూనిటీ వాలంటీర్ నగేశ్ దిండికుర్తి సేవలను నిర్వాహకులు గుర్తుచేసుకున్నారు. ఎంజీఎంఎన్టీ కో చైర్ పర్సన్ ఇందు మందాడి ముగింపు ప్రసంగం చేస్తూ ఇర్వింగ్, డాలస్ ల ప్రజానికానికి, ఎలక్టానిక్ మీడియా, సూరజ్ ఆర్ట్స్, ఇషా, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్డోబర్ 2 నిర్వహించనున్న శాంతియాత్ర(పీస్ వాక్) లో పాల్గొనవలసిందిగా ఆహుతులను కోరారు.