ఇబోలాతో.. అంతర్జాతీయ అత్యవసర పరిస్థితి
పశ్చిమాఫ్రికాలో మొదలై ప్రపంచ వాసులందరినీ గడగడలాడిస్తున్న ఇబోలా వైరస్ వ్యాప్తిని ప్రపంచవ్యాప్త అంతర్జాతీయ పరిస్థితిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. అన్ని దేశాలూ సమన్వయంతో కృషిచేసి ఇబోలా వైరస్ మరిన్ని ప్రాంతాలకు విస్తరించకుండా నియంత్రించాలని డబ్ల్యుహెచ్ఓ ఓ ప్రకటనలో తెలిపింది.
'పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్' ప్రకటించాలని కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించిందని వివరించింది. గినియా, లైబీరియా, నైజీరియా, సియెర్రా లియోన్ దేశాల్లో ఇప్పటివరకు 1711 మందికి ఈ వైరస్ వ్యాపించిందని, 932 మంది మరణించారని డబ్ల్యుహెచ్ఓ అంచనా వేస్తోంది. వాస్తవ సంఖ్య ఇంతకంటే కూడా ఇంకా ఎక్కువగానే ఉండే ప్రమాదం లేకపోలేదు.