ప్రతిష్టాత్మకంగా అంతర్జాతీయ నౌకాదళాల ప్రదర్శన
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అంతర్జాతీయ నౌకాదళాల ప్రదర్శనను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు తూర్పు నౌకాదళం సమాయత్తమవుతోంది. 2016, ఫిబ్రవరి 5, 6, 7 తేదీల్లో విశాఖపట్నంలో ఈ నౌకాదళాల ప్రదర్శనను నిర్వహించనున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలతోపాటు త్రివిధ దళాధిపతులు, ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రముఖులు ఈ ప్రదర్శనకు హాజరుకానున్నారు. అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, చైనాలతోపాటు ఇప్పటికే 37 దేశాలు ఈ ప్రదర్శనలో పాల్గొనేందుకు సమ్మతి తెలిపాయి.
నౌకాదళాల ప్రదర్శనలో భాగంగా వివిధ దేశాలకు చెందిన నౌకాదళాలు తమ యుద్ధనౌకలతో విశాఖపట్నంలో విన్యాసాలు చేస్తాయి. విశాఖ బీచ్‌రోడ్డులో వివిధ దేశాల నౌకాదళాల బ్యాండ్లతో భారీ ర్యాలీ నిర్వహిస్తారు.