ప్రతిష్టాత్మకంగా అంతర్జాతీయ నౌకాదళాల ప్రదర్శన | International navies presentation in vizag | Sakshi
Sakshi News home page

ప్రతిష్టాత్మకంగా అంతర్జాతీయ నౌకాదళాల ప్రదర్శన

Published Fri, Jul 24 2015 12:46 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

ప్రతిష్టాత్మకంగా అంతర్జాతీయ నౌకాదళాల ప్రదర్శన - Sakshi

ప్రతిష్టాత్మకంగా అంతర్జాతీయ నౌకాదళాల ప్రదర్శన

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అంతర్జాతీయ నౌకాదళాల ప్రదర్శనను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు  తూర్పు నౌకాదళం సమాయత్తమవుతోంది.  2016, ఫిబ్రవరి 5, 6, 7 తేదీల్లో విశాఖపట్నంలో ఈ నౌకాదళాల ప్రదర్శనను నిర్వహించనున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలతోపాటు త్రివిధ దళాధిపతులు, ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రముఖులు ఈ ప్రదర్శనకు హాజరుకానున్నారు. అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, చైనాలతోపాటు ఇప్పటికే 37 దేశాలు ఈ ప్రదర్శనలో పాల్గొనేందుకు సమ్మతి తెలిపాయి.
 
నౌకాదళాల ప్రదర్శనలో భాగంగా  వివిధ దేశాలకు చెందిన నౌకాదళాలు తమ యుద్ధనౌకలతో విశాఖపట్నంలో విన్యాసాలు చేస్తాయి. విశాఖ బీచ్‌రోడ్డులో వివిధ దేశాల నౌకాదళాల బ్యాండ్‌లతో భారీ ర్యాలీ నిర్వహిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement