నవంబర్ 29న ‘గులాబీ’ ఫెస్టివల్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో నవంబర్ 29న హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ)లో ‘అంతర్జాతీయ గులాబీ పూల ప్రదర్శన’నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం, వరల్డ్ ఫెడరేషన్ ఫర్ రోజ్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన ఏర్పాటు కానుం ది. ఈ ప్రదర్శన ఏర్పాట్లను సీఎం కె.చంద్రశేఖర్ రావు గురువారం రాష్ట్ర సచివాలయంలో సమీక్షించారు.
ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉన్న కట్ ఫ్లవర్స్‌ను 98 శాతం ఇజ్రాయిల్ దేశమే ఎగుమతి చేస్తున్నదని, తెలంగాణ రాష్ట్రం కూడా పువ్వుల పెంపకానికి అనువైన ప్రాంతమని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ ప్రదర్శన ద్వారా గులాబీ పూల పెంపకంపై ప్రజల్లో అవగాహన, ఆసక్తి పెరుగుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. రోజ్ సొసైటీ ప్రపంచ ఉపాధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు అహమ్మద్ ఆలం ఖాన్, వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్లు పూనం మాలకొండయ్య, బి.జనార్దన్‌రెడ్డి తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
అంతర్జాతీయ స్థాయిలో పూల ప్రదర్శనను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయుడం ఇదే ప్రథవుం. ప్రదర్శనకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. సువూరు 80 దేశాలకు చెందిన ప్రతి నిధులు వివిధ రకాల గులాబీ పూలతో ఈ ప్రదర్శనలో పాల్గొంటా రు. కేవలం పూల ప్రదర్శనే కాకుండా పూల తోటలు సాగు చేసేవారికి అవసరమైన సాంకేతిక శిక్షణ కూడా ఇందులో ఉంటుంది. మేలు రకం సాగు పద్ధతులు, గులాబీ పూల రకాలు, వాటి ప్రత్యేకతలు, మార్కెటింగ్ అవకాశాలు, అధిక దిగుబడికి అనుసరించాల్సిన పద్ధతులు తదితర విషయాలను పరస్పరం పంచుకోవడానికి ఈ ప్రదర్శన వేదిక అవుతుందని కేసీఆర్ పేర్కొన్నారు.