పసుపుతో పచ్చగా పదికాలాలు..
మన దేశంలో వివిధ వంటకాల్లో విరివిగా వాడే పసుపుతో పచ్చగా పదికాలాలు బతికేయవచ్చని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. పసుపులో యాంటీ బయోటిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నట్లు వివిధ దేశాల్లో జరిపిన పరిశోధనల్లో ఇదివరకే తేలింది. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం ఇవ్వడంలో, కేన్సర్‌ను నిరోధించడంలో కూడా పసుపు ప్రశస్తంగా పనిచేస్తుందని ఒక తాజా పరిశోధనలో తేలింది. అల్జిమర్స్ డిసీజ్, గుండె జబ్బులు, నాడీ సంబంధిత వ్యాధులు, జీవక్రియలకు సంబంధించిన వ్యాధులపై పసుపు అద్భుతంగా పనిచేస్తుందని అమెరికాలోని ఎం.డి. అండర్సన్ కేన్సర్ సెంటర్ శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో తేలింది. పసుపులో యాంటీఆక్సిడెంట్, యాంటీబయోటిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని, అందువల్ల పలు వ్యాధులను సమర్థంగా అరికట్టగలదని చెబుతున్నారు.