లలిత్ మోదీకి ఊరట
రెడ్ కార్నర్ నోటీసుల జారీకి ఇంటర్పోల్ తిరస్కరణ!
న్యూఢిల్లీ: ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలన్న భారత్ విన్నపాన్ని ఇంటర్పోల్ తిరస్కరించింది. దీంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరు కాకుండా లండన్లో తలదాచుకుంటున్న లలిత్ మోదీకి ఊరట లభించినట్లైంది. ఐపీఎల్ చైర్మన్ హోదాలో లలిత్ మోదీ అధికార, నిధుల దుర్వినియోగానికి పాల్ప డ్డారంటూ ఆయనపై అభియోగాలు నమో దయ్యాయి. ఈడీ ఆయనపై కేసు నమోదు చేసి విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది.
లండన్లో ఉంటున్న మోదీ భారత్లో తనకు ప్రాణహాని ఉందని, అందువల్ల విచారణకు రాలేనంటూ తప్పించు కుంటున్నారు. ఈ నేపథ్యంలో లలిత్ను తమకు అప్పగించాల్సిందిగా భారత్ ఇంటర్పోల్ సాయం కోరింది. ఐపీల్ టీ20 క్రికెట్ టోర్నీ–2009 ఓవర్సీస్ టెలీకాస్ట్ హక్కుల కేటాయింపులో అవకతవకలకు పాల్పడ్డా రని లలిత మోదీపై 2010లో అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు ఫిర్యాదుచేశారు.