Interstate robbery gang
-
కడపలో అంతరాష్ట్ర దోపిడీ గ్యాంగ్ కలకలం
సాక్షి, కడప అర్బన్: ఇళ్లల్లో దోపిడీలకు పాల్పడే ముఠాను వైఎస్సార్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. రాజంపేట–రాయచోటి రోడ్డులో బ్రాహ్మణపల్లి సబ్ స్టేషన్ వద్ద ఆదివారం తెల్లవారు జామున దోపిడీకి యత్నించిన ఆరుగురు నిందితులను, హత్యరాల సమీపంలో మరో 15 మంది.. మొత్తం 21 మందిని రాజంపేట డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి సిబ్బందితో కలిసి అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.10,300 నగదు, ఓ పిస్టల్, కారు, మూడు మోటార్ సైకిళ్లు, 15 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ అన్బురాజన్ వెల్లడించిన వివరాల మేరకు.. అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన వంశీ, కిరణ్, యాసిన్, దామోదర్‌లు కొంతమంది విద్యార్థులు, యువకులకు డబ్బు ఆశ చూపి గ్యాంగ్‌లుగా తయారుచేసి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దోపిడీలు చేసేందుకు ఎంచుకున్నారు. బళ్లారిలోని ఓ లిక్కర్‌వ్యాపారి ఇంట్లో రూ.150 కోట్లు, అనంతపురం జిల్లాలో పలు చోట్ల, తిరుపతి నగరంలో రెండు చోట్ల దోపిడీకి విఫలయత్నం చేశారు. దోపిడీ సమయంలో అవసరమైతే పిస్టల్‌తో బెదిరించడం, పెప్పర్ స్ప్రే చేయడం వంటివి చేస్తుంటారు. -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
అనంతపురం సెంట్రల్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నేరాలకు పాల్పడుతున్న ఐదుగురు అంతర్రాష్ట్ర దొంగలముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం నగరంలోని పోలీసు కాన్ఫరెన్స్హాల్లో ఎస్పీ బూసారపు సత్యయేసుబాబు మీడియాకు వెల్లడించారు. అరెస్టయిన వారిలో నగరంలో అనంతసాగర్కాలనీకి చెందిన షికారి కోటయ్య, షికారి రామకృష్ణ, బుడ్డప్పనగర్‌కు చెందిన షికారి మెచిలి అలియాస్ నాగి, టీవీ టవర్‌కు చెందిన షికారి శీనా, షికారి శీను ఉన్నారు. వీరి నుంచి 62 తులాలు బంగారు, 18 తులాలు వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులందరూ వ్యసనాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడడం అలవాటుగా చేసుకున్నారు. 2018లో నగరంలోని అరవింద్‌నగర్, హౌసింగ్‌బోర్డు 2019లో కక్కలపల్లి పంచాయతీ దండోరాకాలనీ, ఎల్ఐసీ కాలనీ, ఆకుతోటపల్లి, హౌసింగ్‌బోర్డు, తాటిచెర్ల, ఓబుళదేవరనగర్, ఎల్ఐజీ కాలనీ, సెంట్రల్ ఎక్సైజ్‌కాలనీ, ఆకుతోటపల్లి, కళ్యాణదుర్గం రోడ్డులలో చోరీలు చేశారు. జిల్లాలోనే కాకుండా హైదరాబాద్, కర్నూలు జిల్లాలో కూడా నేరాలకు పాల్పడ్డారు. ఐదుగురిలో షికారి శీనా మినహా మిగిలిన వారిపై కేసులున్నాయి. దొంగలపై ప్రత్యేక నిఘా ఉంచిన అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి పక్కా సమాచారం అందుకొని అనంతపురం రూరల్ మండలం సోములదొడ్డి సమీపంలో అశ్వర్థనారాయణస్వామి కట్ట వద్ద ఐదుగురినీ అరెస్ట్ చేశారు. వీరిని పట్టుకోవడంలో రూరల్ సీఐ మురళీధర్‌రెడ్డి, టూటౌన్ సీఐ జాకిర్‌హుస్సేన్, వన్‌టౌన్ సీఐ ప్రతాప్‌రెడ్డి, ఎస్ఐలు రాఘవరెడ్డి, జయపాల్‌రెడ్డి, ఏఎస్ఐ రమేష్, సిబ్బంది జయరామ్, దాసు, రామకృష్ణ, ప్రవీణ్, గిరి, ఆసిఫ్‌ల బృందం కీలకంగా వ్యవహరించింది. ఎస్పీ సత్యయేసుబాబు రివార్డులతో సిబ్బందిని అభినందించారు. -
అక్కడ చోరీ ...ఇక్కడ విక్రయం!
స్నాచర్... రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న, ద్విచక్ర వాహనం డ్రైవ్ చేస్తున్న వారిలో సెల్‌ఫోన్ మాట్లాడే వారిని టార్గెట్ చేసి దాన్ని లాక్కెళతాడు. కలెక్టర్... ఓ ప్రాంతంలో నేరం చేసిన తర్వాత మరో చోటుకు వెళ్లేప్పుడు మధ్యలో పోలీసుల సోదాలు జరిగితే చిక్కకుండా చోరుడి నుంచి ఫోన్లు కలెక్ట్ చేసుకుంటాడు. కొరియర్... ఓ రోజు/ఓ దఫా చోరీ చేసిన ఫోన్లను తీసుకుని ఎవరి కంటా పడకుండా, తనిఖీల్లో చిక్కకుండా హైదరాబాద్‌కు తరలిస్తాడు. రిసీవర్... బెంగళూరు నుంచి వచ్చే ఈ ఫోన్లను తీసుకుని, ‘ఫ్లాష్’ చేయడం ద్వారా దాని ఐఎంఈఐ నంబర్ మార్చేసి మార్కెట్లో అమ్మేస్తుంటాడు. సాక్షి, హైదరాబాద్: ఈ పంథాలో వ్యవస్థీకృతంగా సెల్‌ఫోన్ చోరీలకు పాల్పడుతున్న ఘరానా అంతర్రాష్ట్ర ముఠా గుట్టు రట్టయ్యింది. ఈ నెల మొదటి వారంలో బెంగళూరు సెంట్రల్ డివిజన్ పోలీసులు అరెస్టు చేసిన పది మందిలో హైదరాబాద్‌కు చెందిన సెకండ్ హ్యాండ్ ఫోన్ల వ్యాపారి అమీర్‌ఖాన్ సైతం ఉన్నాడు. బెంగళూరుతో పాటు నగరంలోనూ జరిగిన ఈ అరెస్టుల పర్వం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మూడేళ్లుగా వ్యవస్థీకృతంగా వ్యవహారాలు సాగిస్తున్న ఈ ముఠా ఇప్పటి వరకు బెంగళూరులోని వివిధ ప్రాంతాల నుంచి పది వేల సెల్ఫోన్లు తస్కరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ గ్యాంగ్ తస్కరించిన ఫోన్లలో అత్యధికం హైదరాబాద్‌లోని సెకండ్ హ్యాండ్ మార్కెట్లలోనే విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం రికవరీ చేసిన వాటిలోనూ ఎక్కువ హైదరాబాద్‌లో స్వాధీనం చేసుకున్నవే కావడం గమనార్హం. తొలినాళ్లలో అక్కడే అమ్మినా... బెంగళూరులోని జేజే నగర్‌కు చెందిన జేడీ(ఎస్) నాయకుడు ఆరిఫ్ ఖాన్ ఈ గ్యాంగ్‌కు లీడర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇతడి నేతృత్వంలో బెంగళూరులోని వివిధ ప్రాంతాలకు చెందిన ఖిజర్ పాషా, అస్లం, ఆసిఫ్ ఖాన్, సయ్యద్ అక్బర్, నవాజ్ షరీఫ్, ఇతడి సోదరుడు అఫ్జల్ షరీఫ్, ఖలీమ్, సల్మాన్, జమీర్గా సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. ఈ గ్యాంగ్ చోరీ చేసిన ఫోన్లను తొలినాళ్ళల్లో ఆరిఫ్ ఖాన్ బెంగళూరులోని సండే బజార్, బర్మా బజార్ ప్రాంతాల్లో విక్రయించేవాడు. దీనిని గుర్తించిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు. దీంతో తమ పంథా మార్చాలని నిర్ణయించుకున్న ఆరిఫ్ ఖాన్ రాష్ట్రం బయటకు తరలించి విక్రయించడానికి ప్రయత్నాలు చేశాడు. ఈ నేపథ్యంలోనే ఇతడికి అమీర్ ఖాన్‌తో పరిచయం ఏర్పడింది. సుదీర్ఘ ఆపరేషన్..... విచారణలో నిందితులు ఇచ్చిన వివరాల ఆధారంగా పోలీసులు మొత్తం తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌కు ఫోన్లను తరలించే బాధ్యతల్ని సూత్రధారి ఆరిఫ్ ఖాన్ పర్యవేక్షిస్తున్నాడు. దీంతో ఇతడిని పట్టుకున్న తర్వాత అమీర్ పేరు వెలుగులోకి వచ్చింది. ఈ నెల మొదటి వారంలో హైదరాబాద్‌కు వచ్చిన ప్రత్యేక బృందం అతడిని అరెస్టు చేసి కొన్ని సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుంది. విచారణ నేపథ్యంలో మిగిలిన ఇద్దరి వ్యాపారుల పేర్లు చెప్పాడు. వారిని విచారిచగా సదరు హ్యాండ్సెట్లు చోరీకి సంబంధించినవి అనే విషయం వీరికి తెలియదని వెల్లడైంది. దీంతో వారి వద్ద ఉన్న సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్న బృందం అమీర్‌ను బెంగళూరు తరలించింది. ఈ గ్యాంగ్‌కు చెందిన పది మంది నుంచి 12 యాపిల్, 81 శామ్సంగ్, 82 ఎంఐతో పాటు 563 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. రూ.1.3 కోట్ల విలువైన వీటిలో అత్యధికం హైఎండ్ ఫోన్లే కావడం గమనార్హం. ఈ అంతర్రాష్ట్ర ముఠా కొన్ని ఫోన్లను మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లోనూ విక్రయించినట్లు బెంగళూరు పోలీసులు గుర్తించారు. ‘ఫ్లాష్’ చేసి మార్కెట్లో విక్రయిస్తూ... నగరంలో సెకండ్ హ్యాండ్ ఫోన్ల వ్యాపారం చేస్తున్న అమీర్ ఖాన్ మరో ఇద్దరు వ్యాపారులకు హోల్‌సేల్‌గా సరఫరా చేస్తుండేవాడు. అయితే వారితో తాను వీటిని మార్కెట్ నుంచే ఖరీదు చేశానని చెప్పేవాడు. బెంగళూరు నుంచి కొరియర్ ద్వారా అందుకున్న వాటిని ముందు కొన్ని రకాలైన సాఫ్ట్వేర్స్ వినియోగించి ‘ఫ్లాష్’ చేసేవాడు. ఇలా చేయడంతో పాటు ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ (ఐఎంఈఐ) నంబర్‌ను క్లోన్ చేసేవాడు. ఆపై కొత్త ఐఎంఈఐ నెంబర్‌తో సిద్ధమైన ఫోన్‌కు తక్కువ ధరకు విక్రయించేవాడు. కొన్ని హైఎండ్ ఫోన్లను మిగిలిన ఇద్దరు వ్యాపారులకు ఇచ్చి అమ్మించేవాడు. కొన్నాళ్ళుగా వ్యవస్థీకృతంగా సాగుతున్న ఈ వ్యవహారాన్ని బెంగళూరు పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. సాంకేతికంగా దర్యాప్తు చేయడంతో పాటు క్షేత్రస్థాయిలోనూ నిఘా ముమ్మరం చేశారు. ఫలితంగా రెండు నెలల క్రితం ఖిజర్ పాషా, అస్లం వారికి చిక్కారు. -
ఊరెళ్తున్నారా? పోలీసులకు చెప్పండి
సాక్షి, సిటీబ్యూరో: దసరా పండుగ వచ్చేస్తోంది...పిల్లందరితో కలిసి కుటుంబసభ్యులు అందరూ స్వగ్రామంలోకి వెళ్లే హడావుడిలో ఉన్నారు. ఇదే అదునుగా చోరీలు చేసేందుకు దొంగలు రెచ్చిపోతుండడంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు చెబుతున్నారు. నగరంలో ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో అంతరాష్ట్ర దొంగల ముఠాల కదలికలు ఉన్నాయన్న నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసులు పెట్రోలింగ్ గస్తీని ముమ్మరం చేశారు. అలాగే పెళ్లిళ్లు, పండుగలు, బతుకమ్మ, దాండియా వంటి వేడుకల్లో పాల్గొనే మహిళలు కూడా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇటీవల శంషాబాద్ రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలోని చౌదరిగూడలోని ఓ ఇంట్లో ఉన్న దంపతులను మంగళవారం రాత్రి బెదిరించి బంగారం, వెండి, నగదు ఎత్తుకెళ్లడం, సనత్‌నగర్ ఠాణా పరిధిలో నాలుగు రోజుల క్రితం అల్లాపూర్‌లో తాళం వేసి రెండు ఇళ్ల తాళాలు పగులకొట్టి సొత్తు దోచుకెళ్లడంతో అంతర్రాష్ట ముఠాల సంచారం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే ఎల్బీనగర్ ఠాణా పరిధిలోనిమా మన్సూరాబాద్ ఎస్బీఐ ఏటీఎంను పగులగొట్టిన హర్యానాకు చెందిన ముఠా రూ.15లక్షలకుపైగా నగదును ఎత్తుకెళుతూ అన్‌రిజిష్టర్డ్ ఆటోలో అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు అరెస్టు చేశారు. దొంగలు హల్చల్ చేస్తున్నారు.. సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో వారం రోజుల్లో దొంగతనాలు పెరిగాయి. స్థానిక నేరస్తుల సహాయంతో అంతర్రాష్ట్ర ముఠాలు చోరీలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఉదయం 11 నుంచి సాయంత్రం నాలుగు గంటల మధ్య దొంగతనాలు అధికంగా నమోదవుతున్నాయి. తాళం వేసిన ఇళ్లు, అపార్ట్మెంట్లలోని ప్లాట్లలోకి కొరియర్‌బాయ్, ఎలక్ట్రిషియన్, ప్లంబర్బాయ్, బంధువుగా చెప్పి ప్రవేశిస్తున్నారు. ఎవరైనా మీ రు ఎవరని ప్రశ్నిస్తే పై పోర్షన్లో ఉన్న వ్యక్తి రమ్మంటున్నారంటూ బురిడీ కొట్టిస్తున్నారు. ఏమాత్రం అవకాశం చిక్కినా తాళం పగులగొట్టి అందినంత దొచుకొని పారిపోతారు. బ్యాచిలర్స్ గదుల్లోకి ఉద యం 5 నుంచి 7.30 గంటల మధ్యలో ప్రవేశించి ల్యాప్‌టాప్, మొబైల్స్ తదితర విలువైన వస్తువులు తస్కరిస్తున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. డేంజర్ గాంగ్స్... నగరంపై కన్నేసి సాధ్యమైనంత దొచుకొని వెళ్లే దొంగల ముఠాల్లో కొన్ని ప్రమాదకరమైనవి కూడా ఉన్నాయి. ఇరానీ గ్యాంగ్, చెడ్డీ గ్యాంగ్, రామ్‌జీ ముఠాలు ప్రమాదకరమైనవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన ఇరానీ ముఠాల్లో కొందరు రాత్రి చోరీలకు పాల్పడుతున్నారు. ఎదురుతిరిగితే చంపేందుకు కూడా వెనుకాడరు. నగర శివార్లను లక్ష్యంగా చేసుకునే దొంగతనాలకు పాల్పడేది చెడ్డీగ్యాంగ్ ముఠా. వీరంతా చోరీ సమయంలో ముఖం కనపడకుండా కండువాలు చుట్టుకుంటారు. చెప్పులను నడుముకు కట్టుకుంటారు. ఇంటి తలుపులను బండరాళ్లతో పగులకొడతారు. వీరి దగ్గర ఉండే పదునైన కత్తితో ఇంటివ్యక్తులపై దాడి చేసేందుకు వెనుకాడరు. ఇక రామ్‌జీ ముఠా విషయానికొస్తే పగటిపూట దృష్టి మరల్చి డబ్బులు కిందపడ్డాయని, బంగారం దొరికిదంటూ నమ్మించి టోకరా వేస్తారు. అలాగే బైక్‌పై వెళ్లే వారిని అనుసరిస్తూ శరీరంపై దుమ్ము పడిందని,పురుగులున్నాయని భ్రమ కల్పిస్తారు. అది నిజమని నమ్మించేందుకు ఒకరకమైన స్ప్రే చల్లుతారు. ఆ సమయంలో ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నారని గ్రహించినా చేతిలో బ్యాగ్, చెడలో చైన్ మాయమైనట్టే. ఈ గ్యాంగ్ కూడా ఇటీవల రాత్రిళ్లు దొంగతనాలు చేస్తున్నట్టుగా పోలీసులు తేల్చారు. సమీప పోలీసు స్టేషన్లకు సమాచారమివ్వండి... కాలనీలు, అపార్ట్మెంట్లలో సీసీటీవీ కెమెరాలు, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఏర్పాటుచేసుకుంటే మంచిది. పండుగ పూట సొంతూళ్లకు వెళితే ఇంట్లోని విలువైన ఆభరణాలను లాకర్లో పెట్టుకుంటే మంచిది. కొత్త వ్యక్తులు కనపడితే సమీపంలోని ఠాణాలకు సమాచారమివ్వాలి. ఒకవేళ సుదూర ప్రాంతాలకు వెళ్తున్నట్టయితే పోలీసులకు సమాచారం ఇస్తే అలర్ట్‌గా ఉంటారు. ప్రత్యేక బృందాలతో పోలీసులు గస్తీ నిర్వహిస్తారు. –వీసీ సజ్జనార్,సైబరాబాద్ పోలీసు కమిషనర్ -
శ్రీకాళహస్తిలో అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
చిత్తూరు : చిత్తూరు జిల్లాలో ఏటీఎంలలో చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠా గుట్టును శుక్రవారం శ్రీకాళహస్తి పోలీసులు రట్టు చేశారు. ముఠా సభ్యులను అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ముఠా సభ్యుల నుంచి భారీగా నగదుతో పాటు వివిధ బ్యాంకులకు చెందిన ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. ముఠా సభ్యులపై పోలీసుల కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.