
సాక్షి, కడప అర్బన్: ఇళ్లల్లో దోపిడీలకు పాల్పడే ముఠాను వైఎస్సార్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. రాజంపేట–రాయచోటి రోడ్డులో బ్రాహ్మణపల్లి సబ్ స్టేషన్ వద్ద ఆదివారం తెల్లవారు జామున దోపిడీకి యత్నించిన ఆరుగురు నిందితులను, హత్యరాల సమీపంలో మరో 15 మంది.. మొత్తం 21 మందిని రాజంపేట డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి సిబ్బందితో కలిసి అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.10,300 నగదు, ఓ పిస్టల్, కారు, మూడు మోటార్ సైకిళ్లు, 15 సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు.
ఎస్పీ అన్బురాజన్ వెల్లడించిన వివరాల మేరకు..
అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన వంశీ, కిరణ్, యాసిన్, దామోదర్‌లు కొంతమంది విద్యార్థులు, యువకులకు డబ్బు ఆశ చూపి గ్యాంగ్‌లుగా తయారుచేసి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దోపిడీలు చేసేందుకు ఎంచుకున్నారు. బళ్లారిలోని ఓ లిక్కర్‌వ్యాపారి ఇంట్లో రూ.150 కోట్లు, అనంతపురం జిల్లాలో పలు చోట్ల, తిరుపతి నగరంలో రెండు చోట్ల దోపిడీకి విఫలయత్నం చేశారు. దోపిడీ సమయంలో అవసరమైతే పిస్టల్‌తో బెదిరించడం, పెప్పర్ స్ప్రే చేయడం వంటివి చేస్తుంటారు.