‘గూగుల్’కు కోనాపురం కుర్రోడు
చెన్నారావుపేట : గూగుల్ కంపెనీ నిర్వహించిన ఇంట ర్వ్యూలో కోనాపురం గ్రామానికి చెందిన ఎడ్ల బక్కారెడ్డి, కవిత దంపతుల పెద్ద కుమారుడు థావణ్రెడ్డి ఎంపికయ్యాడు. స్విట్జర్లాండ్‌లోని జూరిక్ పట్టణంలో గల సంస్థ కార్యాలయంలో ఈనెల ఒకటిన విధుల్లో చేరాడు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. నర్సంపేటలోని సెయింట్ మేరీ పాఠశాలలో 2000 సంవత్సరంలో 2వ తరగతి చదివానని తెలిపాడు. తన తండ్రికి విప్రో కంపెనీలో సీనియర్ ఇంజనీర్‌గా ఉద్యోగం రావడంతో బెంగళూర్ వెళ్లామని చెప్పాడు. అక్కడే ఇంటర్ పూర్తి చేసి, 2014 వరకు సూరత్‌లోని నిట్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ చేశానని తెలిపాడు.
జనవరి నుంచి మార్చి వరకు పదివూర్లు గూగుల్ కంపెనీ వారు ఇంటర్వ్యూలు నిర్వహించారని, ఇందులో భారతదేశం నుంచి 43 మందిని ఎంపిక చేయగా.. చెన్నారావుపేట మండలం కోనాపురం నుంచి తాను ఎంపికయ్యానని తెలి పాడు. ఏడాదికి రూ.79.80లక్షల వేతనం, ఇతర అలవెన్స్లతో కలిపి రూ.కోటి 10లక్షల వేతనం సంస్థ అందిస్తుందని వివరించాడు. కాగా, థవణ్రెడ్డి ఎంపిక కావడం పట్ల తల్లిదండ్రులు బక్కారెడ్డి, కవిత, తాతయ్య, అమ్మమ్మలు రాధా రపు సాంబరెడ్డి, విజయ, ఎడ్ల రంగారెడ్డి, కౌసల్య హర్షం వ్యక్తం చేశారు.