రూ.1,990కే స్మార్ట్ ఫోన్
అతి తక్కువ బడ్జెట్ తో మొదటిసారి స్మార్ట్ ఫోన్ వాడే వినియోగదారుల కోసం ఇంటెక్స్ కంపెనీ ఓ కొత్త మొబైల్ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. 2జీ కనెక్టివిటీతో ఇంటెక్స్ 'ఆక్వా జీ2'ను ఆవిష్కరించింది. దీని ధర రూ.1,990 మాత్రమేనని ప్రకటించింది. స్మార్ట్ ఫోన్ కు అవసరమయ్యే అన్ని ఫీచర్లు పొందుపరిచిన ఈ ఫోన్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. కొన్ని వారాల క్రితమే రూ.3,299 లకు క్లౌడ్ జెమ్ ప్లస్ అనే స్మార్ట్ ఫోన్ ను ఆవిష్కరించిన ఇంటెక్స్ వెంటనే దానికంటే తక్కువ ధరకు మరో ఫోన్ ను ఆవిష్కరించడం విశేషం.
ఇంటెక్స్ ఆక్వా జీ2 ఫీచర్లు
2.8 అంగుళాల టీఈటీ డిస్ ప్లే, 240x320 ఫిక్సల్ రెజుల్యూషన్ స్క్రీన్
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీ బీన్
డ్యూయల్ సిమ్ సపోర్ట్
1100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ అండ్ రియర్ కెమెరా
256ఎంబీ ర్యామ్, ఇన్ బిల్ట్ స్టోరేజ్ 512ఎంబీ
బూడిద, లేత గోధుమ రంగుల్లో ఈ ఫోన్ దొరుకుతుంది