సెల్ఫీ ఫ్లాష్‌తో ఇంటెక్స్ కొత్త ఫోన్ వచ్చేసింది
బడ్జెట్ స్మార్ట్ ఫోన్లతో మార్కెట్ ను అలరిస్తున్న ఇంటెక్స్ మరో కొత్త బడ్జెట్ ఫోన్ ను లాంచ్ చేసింది. ఆక్వా ప్రైమ్ 4జీ పేరుతో ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. గుడ్ బ్యాటరీ, అద్భుతమైన సెల్ఫీ ఫీచర్లు ఈ ఫోన్ కు ప్రత్యేక ఆకర్షణగా కంపెనీ పేర్కొంది. ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ ఫ్లాష్ ను కలిగి ఉన్న కంపెనీ తొలి స్మార్ట్ ఫోన్ ఇదే కావడం విశేషం. దీని ధర రూ.6555గా కంపెనీ వెల్లడించింది. ఈ ధరల్లోనూ మంచి స్పెషిఫికేషన్లతో స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసినట్టు కంపెనీ పేర్కొంది. వైట్, గ్రే, షాంపైన్ గోల్డ్ రంగుల్లో ఇది మార్కెట్లో అందుబాటులో ఉండనుంది. ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో ఆపరేటింగ్ సిస్టమ్ తో ఇది రూపొందింది.
ఇంటెక్స్ ఆక్వా ప్రైమ్ 4జీ ప్రత్యేకతలు....
డిజైన్, డిస్ ప్లే: 5.5 అంగుళాల హెచ్డీ డిస్ప్లే. 1280 x 720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 269ppi పిక్సెల్ డెన్సిటీ. 158 గ్రాముల బరువు.
ప్రాసెసర్, స్టోరేజ్ : 1గిగాహెడ్జ్ తో మీడియా టెక్ MT6735P క్వాడ్ కోర్ ప్రాసెసర్. 1జీబీ ర్యామ్, 8జీబీ ఇంటర్నెల్ స్టోరేజ్, 32జీబీ వరకు విస్తరణ మెమరీ
కెమెరా : 8 ఎంపీ రియర్ కెమెరా, 2 ఎంపీ సెల్ఫీ షూటర్. ఆటోఫోకస్, డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్, హెచ్డీఆర్, పనోరమా ఫెసిలిటీలు కూడా ఉన్నాయి.
బ్యాటరీ, కనెక్టివిటీ : 2800 ఎంఏహెచ్ బ్యాటరీ, 4జీ, వాయిస్ ఓవర్ ఎల్టీఈ సపోర్టుతో డ్యూయల్ సిమ్, బ్లూటూత్ 4.0, వైఫై బీ/జీ/ఎన్, జీపీఎస్, ఏజీపీఎస్, యూఎస్బీ సపోర్ట్స్.