ఉపాధి కల్పిస్తాం
జడ్చర్ల, కొత్తకోట: దేశంలో నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే దిశగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఆదివారం జడ్చర్ల మండల కేంద్రంలోని గౌడ ఫంక్షన్ హాల్లో బీజేపీ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఆత్మీయ సమావేశానికి దత్తాత్రేయ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో 4.80కోట్ల మంది ఉపాధి కల్పన కేంద్రాల్లో నమోదయ్యారని తెలిపారు. దీనికి ప్రధాని నరేంద్రమోదీ మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇం డియా వంటి కార్యక్రమాలను తీసుకుని పెద్దఎత్తున పరిశ్రమల ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలను మెరుగు పరిచేలా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
దేశంలో శిక్షణకు సంబంధించి 2.80 లక్షల సీట్లు ఉంటే జపాన్‌లో కోటి, చైనాలో 2 కోట్ల మంది ప్రతి సంవత్సరం శిక్షణ పొందుతున్నారని తెలిపారు. మన దేశంలో 20 లక్షల మందికి శిక్షణ ఇచ్చే విదంగా చర్య లు తీసుకుంటామన్నారు. శిక్షణనివ్వడం లో చైనాతో పోటీపడే విధంగా కృషి చేస్తామన్నారు. నిరుద్యోగులకు శిక్షణ కాలంలో ఇచ్చే స్టయిఫండ్‌ను రూ:2 వేల నుండి రూ:7 వేల వరకు పెంచేలా కృషి చేస్తామన్నారు. తెలంగాణలో ఐదు నేషనల్ సర్వీస్ సెంటర్లను ప్రారంభిస్తామని చెప్పారు. పాలమూరు జిల్లాలో స్కిల్డెవలప్ మెంట్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లా మీదుగా ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటవుతుందన్నారు.
పాలమూరు జిల్లాలో వలసను నివారించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీలను గెలిపించి మోదీకి బహుమతిగా అందించాలని కోరారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్, ఏబీవీపీ జాతీయ అధ్యక్షుడు మురళీమనోహర్, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు పద్మజారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రతంగ్ పాండురంగారెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బక్కని నర్సింహులు, నాయకులు నాగురావ్ నామాజీ, ఆచారి, రామ్మోహన్, వడ్ల శేఖర్, విఠాల శ్రీనువాసులు, సామ నర్సింహులు, గాయత్రి, కట్టా సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
అందరి భాగస్వామ్యంతోనే తెలంగాణ
కొత్తకోట: తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియా అని ఓ పక్క.. తెచ్చింది టీఆర్ఎస్ అని మరో పక్క ఎవరికి వారు గొప్ప లు చెప్పుకుంటున్నారు.. కానీ.. తెలంగా ణ రాష్ట్ర ప్రజల ఉద్యమం, భారతీయ జనతాపార్టీ భయంతోనే అప్పటి కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని, అందరి భాగస్వామ్యంతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని కేంద్ర మంత్రి బం డారు దత్తాత్రేయ అన్నారు. కొత్తకోటలో ని శివగార్డెన్ ఫంక్షన్ హాల్లో బీజేపీ బల పరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచంద్రరావు గెలుపు కోసం బీజేపీ, టీడీపీ మిత్రపక్షాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ కేంద్ర మంత్రిత్వ శాఖలో తె లంగాణ రాష్ట్రం నుండి తానొక్కడినే మం త్రిగా ఉన్నానని, తెలంగాణ రాష్ట్ర అభ్యున్నతికి అన్ని విధాలుగా కృషి చేస్తానన్నా రు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు చేశాడని, 9 నెలలు గడుస్తున్నా ఒక్క పనీ చేయలేదన్నారు. నిరుద్యోగ యువతపట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుం దని విమర్శించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించడం ద్వారా సర్కారు ఒంటెత్తు పోకడలకు కళ్లెం వేసినట్లు అవుతుందన్నారు. బీజేపీ నియోజ కవర్గ ఇన్చార్జి రాజవర్ధన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి బీజేపీ సీనియర్ నాయకులు రావుల రవీంద్రనాథ్‌రెడ్డి, జిల్లా నాయకులు శ్రీ వర్ధన్‌రెడ్డి, పి.బాల్‌రాజు, కిసాన్‌మోర్చా ఉపాధ్యక్షులు సుదర్శన్‌రెడ్డి, నాయకులు రవీందర్‌రెడ్డి, సత్తయ్యగౌడ్, కె. మాధవరెడ్డి, టీడీపీ నాయకులు కొమ్ము భరత్ భూషణ్, దళితమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిరాం, వాకిటి బాల్‌రాజు, కరేంద్రనాథ్, పబ్బ నరేందర్‌గౌడ్ పాల్గొన్నారు.