Intinti Ramayanam Movie
-
అతనితో పోల్చడమంటే కించపరిచినట్లే.. రాహుల్ రామకృష్ణ ట్వీట్ వైరల్
కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనదైన నటనతో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రాహుల్ రామకృష్ణ. ఒకవైపు కమెడియన్‌గా రాణిస్తూనే.. మరోవైపు జాతిరత్నాలు, విరాటపర్వం, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాల్లో కీలక పాత్రల్లో నటించారు. సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్‌లతో నటిస్తూ.. బిజీగా ఉన్నారు. ఇటీవల రాహుల్ రామకృష్ణ నటించిన ఇంటింటి రామాయణం సినిమా హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే తాజాగా రామకృష్ణ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం. (ఇది చదవండి: సూపర్‌స్టార్ కొత్త సినిమాకు లీగల్ సమస్యలు) ఈ ఏడాది అందరినీ కంటతడి పెట్టించిన సినిమా బలగం. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో ఈ చిత్రాన్ని వేణు యెల్దండి దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రంలో ప్రియదర్శి పులికొండ ప్రధానపాత్రలో నటించారు. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రాహుల్ నటించిన ఇంటింటి రామాయణం సూపర్ హిట్ కావడంతో నెటిజన్స్ అతన్ని ప్రియదర్శితో పోలుస్తూ పోస్టులు పెడుతున్నారు. నెట్టింట వైరలవుతున్న వాటిపై రాహుల్ రామకృష్ణ స్పందించారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. రాహుల్ ట్విటర్లో రాస్తూ.. 'నా ప్రాణ మిత్రుడు ప్రియదర్శి హార్ట్ వర్క్‌తో పాటు మంచి నటుడు. అతనితో నన్ను పోల్చడమంటే మీరు అతన్ని కించపరిచినట్లే. అతను గొప్ప నటుడే కాదు.. మంచి వ్యక్తితమున్న వ్యక్తి. ఇలా పోల్చడం మీ పిరికితనంలా అనిపిస్తుంది. నేను అతని బాటలోనే నడుస్తాను.' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా.. ఇంటింటి రామాయణం చిత్రానికి సురేష్ నరెడ్ల దర్శకత్వం వహించగా..ప్రస్తుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో నవ్య స్వామి, వీకే నరేశ్, సురభి ప్రభావతి, గంగవ్వ ప్రధాన పాత్రలు పోషించారు. కాగా.. ఈ ఏడాది ప్రారంభంలో రాహుల్ తండ్రైన విషయం తెలిసిందే. పెళ్లి విషయాన్ని గోప్యంగా ఉంచి.. గతేడాది నవంబర్‌లో తండ్రి కాబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించి అందరికి షాకిచ్చాడు. (ఇది చదవండి: ప్రేక్షకుల స్పందనతో ఆనందం కలిగింది) pic.twitter.com/E51s5hGVfw — Rahul Ramakrishna (@eyrahul) July 16, 2023 -
శుక్రవారం ఒక్కరోజే ఓటీటీల్లోకి 28 సినిమాలు!
'ఆదిపురుష్' కాస్త తగ్గింది. ఈసారి థియేటర్లలోకి దాదాపు తొమ్మిది సినిమాలు రాబోతున్నాయి. కానీ అందులో పెద్దగా చెప్పుకోదగ్గవి ఏం లేవు. దీంతో ఓటీటీల్లో ఏమేం కొత్త చిత్రాలు విడుదల కానున్నాయా అని మూవీ లవర్స్ చూస్తుంటారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు పూర్తి లిస్ట్ తీసుకొచ్చేశాం. ఈ సోమవారం చూసినప్పుడు 21 సినిమాలు ఉన్నాయి. గురువారం వచ్చేసరికి ఆ నంబర్ కాస్త 28కి పెరిగింది. ఈ మొత్తం జాబితాలో మళ్లీ పెళ్లి, ద కేరళ స్టోరీ, జాన్ విక్ 4 సినిమాలతో పాటు కొన్ని డబ్బింగ్ మూవీస్ కూడా ఉన్నాయి. ఇంతకీ ఆ సినిమాలేంటి? ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయనేది చూసేద్దాం. (ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్‌హిట్ 'గురక సినిమా'.. అస్సలు మిస్సవ్వొద్దు!) శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చే మూవీస్ నెట్‌ఫ్లిక్స్ ద ఫెర్ఫెక్ట్ ఫైండ్ - ఇంగ్లీష్ సినిమా ఐ నంబర్: జోజీ గోల్డ్ - ఇంగ్లీష్ మూవీ తీర కాదల్ - తమిళ సినిమా త్రిశంకు - మలయాళ మూవీ త్రూ మై విండో - ఇంగ్లీష్ సినిమా క్యాచింగ్ కిల్లర్స్ సీజన్ 3 - ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సోషల్ కరెన్సీ - హిందీ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్) స్లీపింగ్ డాగ్ - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది) గ్లామరస్ - ఇంగ్లీష్ వెబ్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్) స్కల్ ఐలాండ్ - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది) ఆహా మళ్లీ పెళ్లి - తెలుగు సినిమా ఇంటింటి రామాయణం - తెలుగు చిత్రం జాన్ లూథర్ - తమిళ మూవీ అమెజాన్ ప్రైమ్ టీకూ వెడ్స్ షేరు - హిందీ మూవీ కళువెత్తి మూర్కన్ - తమిళ సినిమా పొన్నియిన్ సెల్వన్ - హిందీ వెర్షన్ జాన్ విక్ 4 - ఇంగ్లీష్ చిత్రం ద పీటర్ క్రౌచ్ ఫిల్మ్ - ఇంగ్లీష్ సినిమా (స్ట్రీమింగ్ అవుతుంది) కొండ్రాల్ పావమ్ - తమిళ మూవీ (ఆల్రెడీ స్ట్రీమింగ్) డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ జాగ్డ్ మైండ్ - ఇంగ్లీష్ సినిమా కేరళ క్రైమ్ ఫైల్స్ - తెలుగు డబ్బింగ్ సిరీస్ వరల్డ్స్ బెస్ట్ - ఇంగ్లీష్ మూవీ జీ5 ద కేరళ స్టోరీ - తెలుగు డబ్బింగ్ మూవీ కిసీ కీ భాయ్ కిసీ కా జాన్ - హిందీ సినిమా సోనీ లివ్ ఏజెంట్ - తెలుగు సినిమా కఫాస్ - హిందీ సిరీస్ జియో సినిమా అసెక్ - హిందీ సినిమా అడ్డా టైమ్స్ ఫ్లై ఓవర్ - బెంగాలీ మూవీ (ఇదీ చదవండి: 'ఏజెంట్'పై ఆ నిర్మాత కామెంట్స్.. దేవుడు కాపాడాడని!) -
ఈ వారం ఓటీటీలోకి 22 సినిమాలు.. ఆ ఒక్కటి మాత్రం!
గతవారం అంతా 'ఆదిపురుష్' సందడి, హడావుడి నడిచింది. దాని రిజల్ట్ గురించి ఇక్కడ డిస్కషన్ వద్దులే గానీ.. ఈ వారం థియేటర్లలోకి వచ్చే సినిమాలు పెద్దగా లేవు. దీంతో ఓటీటీలో రిలీజయ్యే మూవీస్ ఏంటా అని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు ఫుల్ లిస్ట్ తో వచ్చేసింది. ఒకటి రెండు కాదు ఏకంగా 20కి పైగా కొత్త సినిమాలు ఈ వారంలోనే స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో 'ద కేరళ స్టోరీ', 'ఇంటింటి రామాయణం', 'జాన్ విక్ 4' తదితర చిత్రాలు ఉండటం విశేషం. మరి ఓటీటీ సినిమా లిస్ట్ ఏంటో చూసేద్దామా? (ఇదీ చదవండి: రాకేశ్ మాస్టర్ కుటుంబం గొప్ప నిర్ణయం!) నెట్‌ఫ్లిక్స్ గ్లామరస్ - ఇంగ్లీష్ సిరీస్ - జూన్ 22 స్కల్ ఐలాండ్ - ఇంగ్లీష్ సిరీస్ - జూన్ 22 స్లీపింగ్ డాగ్ - ఇంగ్లీష్ సిరీస్ - జూన్ 22 సోషల్ కరెన్సీ - హిందీ సిరీస్ - జూన్ 22 ఐ నంబర్ నంబర్: జోజి గోల్డ్ - ఇంగ్లీష్ మూవీ - జూన్ 23 త్రూ మై విండో - ఇంగ్లీష్ సినిమా - జూన్ 23 క్యాచింగ్ కిల్లర్స్: సీజన్ 3 - ఇంగ్లీష్ డాక్యుమెంటరీ - జూన్ 23 టేక్ కేర్ ఆఫ్ మాయ - ఇంగ్లీష్ మూవీ (ఆల్రెడీ స్ట్రీమింగ్) నాట్ క్వైట్ నార్వల్ - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది) అమెజాన్ ప్రైమ్ టీకూ వెడ్స్ షేరు - హిందీ సినిమా - జూన్ 23 పొన్నియిన్ సెల్వన్ - హిందీ వెర్షన్ - జూన్ 23 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ క్లాస్ ఆఫ్ '09 - ఇంగ్లీష్ సిరీస్ - జూన్ 21 సీక్రెట్ ఇన్వేషన్ - ఇంగ్లీష్ సిరీస్ - జూన్ 21 జాగ్డ్ మైండ్ - ఇంగ్లీష్ సినిమా - జూన్ 23 కేరళ క్రైమ్ ఫైల్స్ - మలయాళ మూవీ - జూన్ 23 వరల్డ్స్ బెస్ట్ - ఇంగ్లీష్ సినిమా - జూన్ 23 ఆహా ఇంటింటి రామాయణం - తెలుగు సినిమా - జూన్ 23 జీ5 కిసీ కా భాయ్ కిసీ కా జాన్ - తెలుగు డబ్బింగ్ మూవీ - జూన్ 23 ద కేరళ స్టోరీ - తెలుగు డబ్బింగ్ సినిమా - జూన్ 23 సోనీ లివ్ ఏజెంట్ -తెలుగు సినిమా - జూన్ 23 అడ్డా టైమ్స్ ఫ్లై ఓవర్ - బెంగాలీ మూవీ - జూన్ 23 లయన్స్ గేట్ ప్లే జాన్ విక్ చాప్టర్ 4 - ఇంగ్లీష్ సినిమా - జూన్ 23 (ఇదీ చదవండి: రష్మికను మోసం చేసిన మేనేజర్!) -
'ఇంటింటి రామాయణం' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాల్లో తెలంగాణ కల్చర్ ని బాగా హైలైట్ చేస్తున్నారు. ఈ తరహా కాన్సెప్ట్ తో తీసిన 'బలగం' ఎంత పెద్ద హిట్ అయిందో స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. అలా ఈ జానర్ లో వచ్చిన మరో మూవీ 'ఇంటింటి రామాయణం'. ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకుంది. ఆహా ఓటీటీ, సితార ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీని తొలుత ఓటీటీ రిలీజ్ కోసమే రెడీ చేశారు. గతేడాది డిసెంబరు ఆ టైంలోనే విడుదలైపోవాల్సింది. కానీ ఎందుకో లేట్ చేస్తూ చేస్తూ ఫైనల్ గా ఈ జూన్ 9న థియేటర్లలోకి తీసుకొచ్చారు. ప్రేక్షకులకు పెద్దగా రీచ్ కాలేదు. దీంతో ఇప్పుడు రెండు వారాల్లోనే అంటే జూన్ 23న ఆహా ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. 'ఇంటింటి రామాయణం' కథేంటి? తెలంగాణలోని ఓ మారుమూల గ్రామంలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఈ కుటుంబానికి అనుకోని సమస్య ఎదురవుతుంది. ఓ ముఖ్యమైన వస్తువు మిస్ అవుతుంది. ఒకరిపై మరొకరికి అనుమానం పుట్టుకొస్తుంది. దీంతో వాళ్లలో దాగున్న అసలు రూపాలన్నీ బయటకొస్తాయి. మరి ఈ సమస్య నుంచి బయట పడేందుకు ఆ కుటుంబం ఏం చేసింది? చివరకు ఏం జరిగింది? అనేదే 'ఇంటింటి రామాయణం' కథ. సురేష్ నారెడ్ల దర్శకత్వం వహించగా, కల్యాణి మాలిక్ సంగీతం అందించారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'అన్నీ మంచి శకునములే'..స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ?) ఇంటి దొంగను ఈశ్వరుడు అయిన పట్టలేడు... #IntintiRamayanamOnAHA మీరు చూడకుండా ఉండలేరు 😉 Premieres June 23 ✌🏻@SitharaEnts @DirectorMaruthi @vamsi84 @IVYProductions9 @ItsActorNaresh @eyrahul @Sureshflms @Venkatupputuri @innamuri8888 #NavyaSwamy @GangavvaMilkuri #AnjiMama… pic.twitter.com/6SOA6LUi3j — ahavideoin (@ahavideoIN) June 15, 2023