
ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాల్లో తెలంగాణ కల్చర్ ని బాగా హైలైట్ చేస్తున్నారు. ఈ తరహా కాన్సెప్ట్ తో తీసిన 'బలగం' ఎంత పెద్ద హిట్ అయిందో స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. అలా ఈ జానర్ లో వచ్చిన మరో మూవీ 'ఇంటింటి రామాయణం'. ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకుంది.
ఆహా ఓటీటీ, సితార ఎంటర్ టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీని తొలుత ఓటీటీ రిలీజ్ కోసమే రెడీ చేశారు. గతేడాది డిసెంబరు ఆ టైంలోనే విడుదలైపోవాల్సింది. కానీ ఎందుకో లేట్ చేస్తూ చేస్తూ ఫైనల్ గా ఈ జూన్ 9న థియేటర్లలోకి తీసుకొచ్చారు. ప్రేక్షకులకు పెద్దగా రీచ్ కాలేదు. దీంతో ఇప్పుడు రెండు వారాల్లోనే అంటే జూన్ 23న ఆహా ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.
'ఇంటింటి రామాయణం' కథేంటి?
తెలంగాణలోని ఓ మారుమూల గ్రామంలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఈ కుటుంబానికి అనుకోని సమస్య ఎదురవుతుంది. ఓ ముఖ్యమైన వస్తువు మిస్ అవుతుంది. ఒకరిపై మరొకరికి అనుమానం పుట్టుకొస్తుంది. దీంతో వాళ్లలో దాగున్న అసలు రూపాలన్నీ బయటకొస్తాయి. మరి ఈ సమస్య నుంచి బయట పడేందుకు ఆ కుటుంబం ఏం చేసింది? చివరకు ఏం జరిగింది? అనేదే 'ఇంటింటి రామాయణం' కథ. సురేష్ నారెడ్ల దర్శకత్వం వహించగా, కల్యాణి మాలిక్ సంగీతం అందించారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'అన్నీ మంచి శకునములే'..స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ?)
ఇంటి దొంగను ఈశ్వరుడు అయిన పట్టలేడు... #IntintiRamayanamOnAHA మీరు చూడకుండా ఉండలేరు 😉
— ahavideoin (@ahavideoIN) June 15, 2023
Premieres June 23 ✌🏻@SitharaEnts @DirectorMaruthi @vamsi84 @IVYProductions9 @ItsActorNaresh @eyrahul @Sureshflms @Venkatupputuri @innamuri8888 #NavyaSwamy @GangavvaMilkuri #AnjiMama… pic.twitter.com/6SOA6LUi3j
Comments
Please login to add a commentAdd a comment