వచ్చే నెలలో సీఆర్సీ రాష్ట్రస్థాయి ఆహ్వాన కబడ్డీ
రావులపాలెం :
సంక్రాంతి పండగ సందర్భంగా వచ్చే నెల 13, 14, 15 తేదీల్లో రాష్ట్రస్థాయి ఆహ్వాన మె¯ŒS, ఉమె¯ŒS కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్టు కాస్మోపాలిట¯ŒS రిక్రియేష¯ŒS క్లబ్ (సీఆర్సీ) అధ్యక్ష కార్యదర్శులు మల్లిడి కనికిరెడ్డి, కర్రి అశోక్‌రెడ్డి తెలిపారు. రావులపాలెంలోని సీఆర్సీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు ఈ వివరాలను వెల్లడించారు. రావులపాలెం ప్రభుత్వ ఉభయ కళాశాలల మైదానంలో ఈ పోటీలు జనవరి 13 మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. మెన్, ఉమె¯ŒS విభాగాల్లో విజేతలకు రూ.2.50 లక్షల ప్రైజ్‌మనీ అందిస్తామన్నారు. లీగ్ కం నాకౌట్ పద్ధతిలో జరిగే ఈ పోటీలు 15వ తేదీ రాత్రి ముగుస్తాయన్నారు. మె¯ŒS విభాగంలో శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి , పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు; ఉమె¯ŒS విభాగంలో విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, అనంతపురం జిల్లాల జట్లు పోటీ పడతాయన్నారు. ఏపీ కబడ్డీ సంఘం కార్యదర్శి వి.వీరలంకయ్య పర్యవేక్షణలో పోటీలు జరుగుతాయన్నారు. సీఆర్సీ స్పోర్ట్స్ డైరెక్టర్ నల్లమిల్లి వీరరాఘవరెడ్డి, డైరెక్టర్లు కర్రి సుబ్బారెడ్డి, మంతెన రవిరాజు, చిర్ల కనికిరెడ్డి, ఆర్వీఎస్ రామాంజనేయరాజు, కుడుపూడి శ్రీనివాస్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.