కొత్త ఐపాడ్లు వస్తున్నాయ్...
న్యూఢిల్లీ: యాపిల్ కంపెనీ ఐపాడ్ ఎయిర్2, ఐపాడ్ మినీ 3 డివైస్‌లు ఈ నెల 29 నుంచి భారత్‌లో అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే వీటికి ముందస్తు బుకింగ్స్ ప్రారంభించామని, ఈ నెల 29 నుంచి యాపిల్ అధీకృత రిటైల్ స్టోర్స్‌లో వీటిని విక్రయిస్తామని యాపిల్ చానల్ భాగస్వామి కంపెనీ పేర్కొంది. వేలితో తాకటం ద్వారా ఈ డివైస్‌లను అన్‌లాక్ చేసే టచ్ ఐడీ ఫీచర్ వీటిలో ఉంది. ఈ రెండు డివైస్‌లు వైఫై, వైఫైతో పాటు సెల్యులర్ కనెక్టివిటీ.. ఈ 2 కేటగిరీల్లో లభిస్తాయి. ఈ డివైస్ల సెల్యులర్ మోడళ్లు - సీడీఎంఏ, 2జీ, 3జీ, 4జీ కనెక్టివిటీలను సపోర్ట్ చేస్తాయి.
ఐపాడ్ ఎయిర్ 2
ఐపాడ్ మోడళ్లలో ఇదే అత్యంత పలుచని ఐపాడ్. మందం 6.1 మి.మీ. బరువు 437 గ్రాములు. ఒక్కో కేటగిరీలో 3 మోడళ్లు (వివిధ స్టోరేజ్ కెపాసిటీ)తో 6 మోడళ్లను అందిస్తోంది. వీటి ధరలు రూ.35,900 -59,900(వ్యాట్‌తో కలిపి) రేంజ్లో ఉన్నాయి.
ఐపాడ్ మిని 3..: మూడు విభిన్నమైన స్టోరేజీ కెపాసిటిలతో మొత్తం ఆరు మోడళ్లు లభ్యమవుతాయి. వీటి ధరలు రూ.28,900 నుంచి రూ.52,900 రేంజ్లో ఉన్నాయి. ఐపాడ్ మిని 3లో 7.0 అంగుళాల స్క్రీన్, ఏ7 చిప్సెట్, 5 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 1.2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా వంటి ఫీచర్లున్నాయి.