ఐపీఎల్ నుంచి మరో క్రికెటర్ అవుట్
న్యూఢిల్లీ: ఐపీఎల్-2017 సీజన్ నుంచి గాయం కారణంగా మరో స్టార్ క్రికెటర్ దూరమయ్యాడు. ఎడమ కాలి తొడనరం నొప్పితో బాధపడుతున్న గుజరాత్ లయన్స్ ఆటగాడు, విధ్వంసక బ్యాట్స్‌మన్ బ్రెండన్ మెకల్లమ్ ఈ ఈవెంట్ నుంచి వైదొలిగాడు. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో మ్యాచ్ సందర్భంగా బ్రెండన్ గాయపడ్డాడు. ఈ సీజన్లో గుజరాత్ ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాల్సివుంది. కాగా వరుస వైఫల్యాలతో గుజరాత్ ప్లే ఆఫ్ అవకాశాల్ని పోగొట్టుకుంది. గుజరాత్ 11 మ్యాచ్‌లు ఆడగా కేవలం మూడింటిలోనే విజయం సాధించింది. మెకల్లమ్ మొత్తం 319 పరుగులు చేశాడు.
ఇంతకుముందు గాయాల కారణంగా ఆల్‌రౌండర్ డ్వెన్ బ్రావో, ఫాస్ట్ బౌలర్ ఆండ్రూ టై ఐపీఎల్‌కు దూరమయ్యారు. అంతర్జాతీయ క్రికెట్లో ఆడేందుకు జేసన్ రే ఇంగ్లండ్‌కు వెళ్లిపోయాడు.