IPL champions
-
IPL 2024: కోల్‌కతాకే కిరీటం
సన్‌రైజర్స్ అభిమానులకు తీవ్ర వేదన... లీగ్ దశలో విధ్వంసకర బ్యాటింగ్‌తో ఐపీఎల్‌కు కొత్త పాఠాలు నేర్పిన టీమ్ అదే బ్యాటింగ్ వైఫల్యంతో చివరి మెట్టుపై చతికిలపడింది. 8 బంతుల వ్యవధిలో అభిషేక్ శర్మ, హెడ్ లాంటి హిట్టర్లు వెనుదిరగ్గా... క్లాసెన్‌కు కూడా కాలం కలిసిరాని వేళ జట్టంతా కుప్పకూలింది. ఏ మూలకూ సరిపోని 114 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా నైట్‌రైడర్స్ 63 బంతుల్లోనే ఛేదించేసి సంబరాలు చేసుకుంది. దశాబ్ద కాలం తర్వాత మూడో టైటిల్ అందుకొని సగర్వంగా నిలిచింది. ఎనిమిదేళ్ల తర్వాత ట్రోఫీ గెలవాలని ఆశించిన హైదరాబాద్ 2018 తరహాలో ఫైనల్‌కే పరిమితమై నిరాశలో మునిగింది. ఆసాంతం బ్యాటర్లు చెలరేగిన 2024 టోర్నీ చివరకు బౌలర్ల అద్భుత ప్రదర్శనతో ముగిసింది. విజేతగా నిలిచిన కోల్‌కతాకు రూ. 20 కోట్లు... రన్నరప్ హైదరాబాద్ జట్టుకు రూ. 12 కోట్ల 50 లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయి. చెన్నై: పదేళ్ల తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) మళ్లీ ఐపీఎల్ చాంపియన్‌గా అవతరించింది. ఆదివారం చెపాక్ మైదానంలో ఏకపక్షంగా సాగిన ఐపీఎల్ 17వ సీజన్ ఫైనల్ పోరులో కోల్‌కతా 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ 18.3 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌటైంది. ఐపీఎల్ చరిత్రలో ఫైనల్ మ్యాచ్‌లో ఇదే అత్యల్ప స్కోరు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (19 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్)దే అత్యధిక స్కోరు. అనంతరం నైట్‌రైడర్స్ 10.3 ఓవర్లలో 2 వికెట్లకు 114 పరుగులు చేసి గెలిచింది. వెంకటేశ్ అయ్యర్ (26 బంతుల్లో 52 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), రహ్మానుల్లా గుర్బాజ్ (32 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రెండో వికెట్‌కు 45 బంతుల్లో 91పరుగులు జోడించి జట్టును గెలిపించారు. సమష్టి వైఫల్యం... తొలి ఓవర్లో స్టార్క్ వేసిన అద్భుత బంతికి అభిõÙక్ శర్మ (2) క్లీన్‌బౌల్డ్ కావడంతో మొదలైన సన్‌రైజర్స్ పతనం వేగంగా సాగింది. కోల్‌కతా కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు ఏ దశలోనూ హైదరాబాద్ తిరిగి కోలుకోలేకపోయింది. హెడ్ (0) తన వైఫల్యాన్ని కొనసాగిస్తూ ఆడిన తొలి బంతికి అవుటై మరో డకౌట్ ఖాతాలో వేసుకున్నాడు. త్రిపాఠి (13 బంతుల్లో 9; 1 ఫోర్) ఈసారి ఆదుకోలేకపోగా, నితీశ్ రెడ్డి (10 బంతుల్లో 13; 1 ఫోర్, 1 సిక్స్), షహబాజ్ (7 బంతుల్లో 8; 1 సిక్స్), అబ్దుల్ సమద్ (4) విఫలమయ్యారు. మరోవైపు మార్క్రమ్ (23 బంతుల్లో 20; 3 ఫోర్లు) పరుగులు తీయడానికి ఇబ్బంది పడగా... క్లాసెన్ (17 బంతుల్లో 16; 1 ఫోర్) కూడా భారీ షాట్లు ఆడలేకపోయాడు. 14 ఓవర్ల తర్వాత సన్‌రైజర్స్ స్కోరు 90/7. క్లాసెన్ క్రీజ్‌లో ఉండటంతో చివరి 6 ఓవర్లలోనైనా ఎక్కువ పరుగులు సాధించవచ్చని రైజర్స్ ఆశించింది. అయితే తర్వాతి బంతికే అతను బౌల్డ్ కావడంతో ఆశలు ఆవిరయ్యాయి. చివర్లో కమిన్స్ కొన్ని పరుగులు జత చేసి స్కోరును 100 దాటించాడు. ఫటాఫట్... స్వల్ప ఛేదనలో కేకేఆర్‌కు ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. నరైన్ (2 బంతుల్లో 6; 1 సిక్స్) ఆరంభంలోనే వెనుదిరిగినా... వెంకటేశ్, గుర్బాజ్ వేగంగా జట్టును గెలుపు దిశగా తీసుకెళ్లారు. భువనేశ్వర్ ఓవర్లో వరుసగా 4, 6, 6 కొట్టిన వెంకటేశ్, ఆ తర్వాత నటరాజన్ బౌలింగ్‌లో వరుసగా 4, 4, 6, 4 బాది లక్ష్యాన్ని మరింత సులువగా మార్చేశాడు. 24 బంతుల్లోనే వెంకటేశ్ హాఫ్ సెంచరీ పూర్తయింది. విజయానికి 12 పరుగుల దూరంలో గుర్బాజ్ అవుటైనా... వెంకటేశ్, కెపె్టన్ శ్రేయస్ (3 బంతుల్లో 6 నాటౌట్; 1 ఫోర్) కలిసి ఆట ముగించారు. స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (బి) స్టార్క్ 2; హెడ్ (సి) గుర్బాజ్ (బి) వైభవ్ అరోరా 0; త్రిపాఠి (సి) రమణ్‌దీప్ (బి) స్టార్క్ 9; మార్క్రమ్ (సి) స్టార్క్ (బి) రసెల్ 20; నితీశ్ కుమార్ రెడ్డి (సి) గుర్బాజ్ (బి) హర్షిత్ రాణా 13; క్లాసెన్ (బి) హర్షిత్ రాణా 16; షహబాజ్ (సి) నరైన్ (బి) వరుణ్ 8; సమద్ (సి) గుర్బాజ్ (బి) రసెల్ 4; కమిన్స్ (సి) స్టార్క్ (బి) రసెల్ 24; జైదేవ్ ఉనాద్కట్ (ఎల్బీ) (బి) నరైన్ 4; భువనేశ్వర్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (18.3 ఓవర్లలో ఆలౌట్) 113. వికెట్ల పతనం: 1–2, 2–6, 3–21, 4–47, 5–62, 6–71, 7–77, 8–90, 9–113, 10– 113. బౌలింగ్: స్టార్క్ 3–0–14–2, వైభవ్ అరోరా 3–0–24–1, హర్షిత్ రాణా 4–1–24– 2, నరైన్ 4–0–16–1, రసెల్ 2.3–0– 19–3, వరుణ్ చక్రవర్తి 2–0–9–1. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (ఎల్బీ) (బి) షహబాజ్ 39; నరైన్ (సి) షహబాజ్ (బి) కమిన్స్ 6; వెంకటేశ్ అయ్యర్ (నాటౌట్) 52; శ్రేయస్ అయ్యర్ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (10.3 ఓవర్లలో 2 వికెట్లకు) 114. వికెట్ల పతనం: 1–11, 2–102. బౌలింగ్: భువనేశ్వర్ 2–0– 25–0, కమిన్స్ 2–0–18–1, నటరాజన్ 2–0– 29–0, షహబాజ్ 2.3–0–22–1, ఉనాద్కట్ 1–0–9–0, మార్క్రమ్ 1–0–5–0. ఐపీఎల్–17 బౌండరీ మీటర్ మొత్తం సిక్స్‌లు: 1260 మొత్తం ఫోర్లు: 2174 -
ఫైనల్లో ఎస్ఆర్హెచ్ ఘోర ఓటమి.. ఐపీఎల్ 2024 విజేతగా కేకేఆర్
ఐపీఎల్-2024 ఛాంపియన్స్‌గా కోల్‌కతా నైట్‌రైడర్స్ నిలిచింది. ఆదివారం చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తు చేసిన కేకేఆర్.. ముచ్చటగా మూడో సారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ఏక పక్షంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో కేకేఆర్ ఘన విజయం సాధించింది.కుప్పకూలిన ఎస్ఆర్హెచ్..టైటిల్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ కేకేఆర్ బౌలర్ల దాటికి గజగజ వణికింది. కేకేఆర్ బౌలర్లు చెలరేగడంతో సన్‌రైజర్స్ కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. కేకేఆర్ పేసర్లు మిచెల్ స్టార్క్, ఆరోరా ఆరంభంలోనే ఎస్ఆర్హెచ్ దెబ్బతీయగా.. ఆ తర్వాత రస్సెల్ మూడు వికెట్లతో ఆరెంజ్ ఆర్మీ పతనాన్ని శాసించాడు. వీరిద్దరితో పాటు సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, ఆరోరా తలా వికెట్ సాధించారు. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్(24) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మార్క్రమ్(20), క్లాసెన్(16) పరుగులు చేశారు.అయ్యర్, గుర్బాజ్ విధ్వంసం..అనంతరం 114 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేకేఆర్ 10.3 ఓవర్లలో 2 వికెట్ల కోల్పోయి ఛేదించింది. కేకేఆర్ బ్యాటర్లలో ఓపెనర్ గుర్భాజ్ (39) పరుగులు చేయగా.. ఫస్ట్ డౌన్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్(52 నాటౌట్) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ప్యాట్ కమ్మిన్స్, షాబాజ్ అహ్మద్ బౌలింగ్‌లో తలా వికెట్ సాధించారు. -
Gujarat Titans Photos with Trophy: ఐపీఎల్ 2022 చాంపియన్ గుజరాత్ టైటాన్స్ ( ఫోటోలు)
-
ఐపీఎల్ చాంపియన్స్ వీరే!
గత పదేళ్లలో ఎంతో మంది అనామక క్రికెటర్లను ప్రపంచానికి పరిచయం చేస్తూ.. యువ ఆటగాళ్ల సత్తాకు ఓ వేదికగా మారింది ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్). ప్రపంచ క్రికెట్లో అత్యంత ధనిక లీగ్‌ల్లో తొలిస్థానంలో నిలిచిన ఐపీఎల్.. పది వసంతాలు పూర్తి చేసుకుని పదకొండో సీజన్లోకి అడుగెట్టింది. గడిచిన పదేళ్లలో కొన్ని జట్లు మాత్రం పలుమార్లు ఈ క్యాష్ రిచ్ లీగ్ టోఫ్రిని ముద్దాడగా.. మరికొన్ని జట్లకు అది అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఇప్పటివరకూ ఎన్ని అవాంతరాలు ఎదురైనా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఐపీఎల్ సొంతం చేసుకుంది. దీనిలో భాగంగా గత విజేతలపై ఓ లుక్కేద్దాం. ♦ ఐపీఎల్-2017 ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ మూడో సారి టైటిల్ నెగ్గి చరిత్ర సృష్టించింది. ఫైనల్లో రైజింగ్ పుణెతో జరిగిన ఉత్కంఠకర మ్యాచ్‌లో 1 పరుగు తేడాతో విజయం సాధించింది. ఈ టోర్నీ ఆసాంతం ఆల్‌రౌండ్ (316 పరుగులు, 12 వికెట్లు) ప్రదర్శన కనబర్చిన రైజింగ్ పుణె ఆటగాడు బెన్‌స్టోక్స్ ప్లేయర్ ఆఫ్ దిటోర్నీగా నిలిచాడు. సన్ రైజర్స్ ఆటగాళ్లు డెవిడ్ వార్నర్ (641) ఆరెంజ్ క్యాప్ అందుకోగా.. భువనేశ్వర్ కుమార్ 26 వికెట్లతో వరుసగా రెండో సారి పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. ♦ ఐపీఎల్-2016 ఫిక్సింగ్ వివాదంతో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలపై రెండేళ్ల నిషేదం పడటంతో ఈ రెండు జట్లు ఈ సీజన్‌కు దూరమయ్యాయి. వాటి స్థానంలో కొత్తగా గుజరాత్ లయన్స్, రైజింగ్ పుణె జెయింట్స్‌లు వచ్చాయి. ఈ సీజన్ చాంపియన్‌గా సన్‌రైజర్స్ హైదరాబాద్ నిలిచింది. ఫైనల్లో విరాట్ కోహ్లి సారథ్యంలోని పటిష్ట రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై 8 పరుగుల తేడాతో విజయం సాధించి టైటిల్ సొంతం చేసుకుంది. ఈ టోర్నీ ఆసాంతం అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లికి ఫ్లేయర్ఆఫ్ ది టోర్నీతో పాటు ఆరెంజ్ క్యాప్ సొంతమైంది. ఈ సీజన్లో కోహ్లి ఏకంగా 973 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇది ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు. బౌలింగ్‌తో సన్‌రైజర్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన భువనేశ్వర్ కుమార్ 23 వికెట్లతో పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. ♦ ఐపీఎల్-2015 ఈ సీజన్ చాంఫియన్‌గా ముంబై ఇండియన్స్ నిలించింది. ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్‌పై 41 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి రెండో సారి టైటిల్ నెగ్గింది. కోల్‌కతా ఆటగాడు ఆండ్రూ రస్సెల్ బ్యాటింగ్ 326 పరుగులు, బౌలింగ్14 వికెట్లతో ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలవగా.. సన్‌రైజర్స్ ఆటగాడు డేవిడ్ వార్నర్ 562 పరుగులతో ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. బౌలింగ్‌లో 26 వికెట్లతో చెన్నై ఆటగాడు డ్వాన్ బ్రావో పర్పుల్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్లో సన్‌రైజర్స్ పాయింట్ల పట్టికలో ఆరోస్థానానికే పరిమితమైంది. ♦ ఐపీఎల్-2014 పుణెవారియర్స్ ఫ్రాంచైజీ తప్పుకోవడంతో 8 జట్లతో కొనసాగిన ఈ సీజన్ టైటిల్‌ను గంభీర్ నాయకత్వంలోని కోల్‌కతా నైట్‌రైడర్స్ రెండో సారి కైవసం చేసుకుంది. ఫైనల్లో బెయిలీ సారథ్యంలోని కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై కోల్‌కతా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్లో పంజాబ్ ఆటగాడు మ్యాక్స్‌వెల్ 552 పరుగులతో మ్యాన్ ఆఫ్‌ది టోర్నీగా నిలిచాడు. కోల్‌కతా ఆటగాడు రాబిన్ ఉతప్ప 660 పరుగులతో ఆరెంజ్ క్యాప్ అందుకోగా చెన్నై ఆటగాడు మోహిత్ శర్మ 23 వికెట్లతో పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. ఈ సీజన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో ఆరోస్థానంతో సరిపెట్టుకుంది. ♦ ఐపీఎల్-2013 ఈ సీజన్లో డెక్కన్ చార్జర్స్ హైదరాబాద్ యాజమాన్యం మారడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌గా బరిలోకి దిగింది. ఐపీఎల్ ఐదో సీజన్ చాంపియన్‌గా రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ నిలిచింది. వరుసగా నాలుగో సారి ఫైనల్ చేరిన చెన్నై సూపర్‌కింగ్స్‌పై ముంబై ఇండియన్స్ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు షేన్ వాట్సన్ బ్యాటింగ్‌లో 543 పరుగులతో, బౌలింగ్‌లో 13 వికెట్లతో రాణించడంతో మ్యాన్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. చెన్నై ఆటగాడు మైక్‌హస్సీ 733 పరుగులతో ఆరెంజ్ క్యాప్ అందుకోగా.. చెన్నైకే చెందిన మరో ఆటగాడు డ్వాన్ బ్రావో 32 వికెట్లతో పర్పుల్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. పేరు మార్చుకొని బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచి క్వాలిఫైయర్స్‌కు అర్హత సాధించింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓడింది. ♦ ఐపీఎల్-2012 గత సీజన్లో వచ్చి చేరిన రెండు కొత్త జట్లలో కేరళ కొచ్చి టస్కర్ ఫ్రాంచైజీ ఆర్థిక కారణాలతో ఈ సీజన్ నుంచి తప్పుకుంది. దీంతో 9 జట్లతో కొనసాగిన ఈ సీజన్ టైటిల్‌ను గౌతమ్ గంభీర్ సారథ్యంలోని కోల్‌కతా నైట్‌రైడర్స్ సొంతం చేసుకుంది. వరుసగా మూడో సారి ఫైనల్‌కు వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్‌ను కోల్‌కతా 5 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ఇక ఈ సీజన్‌తో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన కోల్‌కతా స్పిన్నర్ సునీల్ నరైన్ 24 వికెట్లతో మ్యాన్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. ఈ సీజన్లో సైతం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు క్రిస్ గేల్ తన పరుగుల వరదను కొనసాగించాడు. గేల్ 733 పరుగులతో ఆరెంజ్ క్యాప్‌ను సొంత చేసుకోగా 25 వికెట్లతో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఆటగాడు మోర్నీ మోర్కెల్ పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. ఈ సీజన్ పాయింట్ల పట్టికలో డెక్కన్ చార్జర్స్ హైదరాబాద్ 8వ స్థానంలో నిలిచింది. ♦ ఐపీఎల్-2011 ఐపీఎల్‌కు ఆదరణ పెరగడంతో ఈసీజన్లో మరో రెండు కొత్త జట్లు పుణె వారియర్స్, కేరళ కొచ్చి టస్కర్స్లు వచ్చాయి. ఈ సీజన్ టైటిల్‌ను సైతం చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండోసారి సొంతం చేసుకుంది. ఫైనల్లో డానియల్ వెటోరి సారథ్యంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) పై ధోని సేన 58 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సీజన్లో ఆర్సీబీ ఆటగాడు క్రిస్‌గేల్ పరుగుల సునామీ సృష్టించాడు. ఏకంగా 608 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్‌తో పాటు బౌలింగ్‌లో 8 వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్‌ది టోర్నీగా నిలిచాడు. ముంబై ఇండియన్స్ ఆటగాడు లసిత్ మలింగా 28 వికెట్లతో పర్పుల్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్లో డెక్కన్ చార్జర్స్ హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో 7వ స్థానంతో సరిపెట్టుకుంది. ♦ ఐపీఎల్-2010 మూడో సీజన్ టైటిల్‌ను మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకోగా.. సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్ రన్నరప్‌గా నిలిచింది. ఈ సీజన్లో ముంబై కెప్టెన్ సచిన్ టెండూల్కర్ 618 పరుగులతో మ్యాన్ ఆఫ్ ది టోర్నీతో పాటు ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఇక పర్పుల్ క్యాప్‌ను 21 వికెట్లతో డెక్కన్ చార్జర్స్ హైదరాబాద్ ఆటగాడు ప్రజ్ఞాన్ ఓజా అందుకున్నాడు. ఈ సీజన్లో హైదరాబాద్ జట్టు సెమీస్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడి 38 పరుగుల తేడాతో ఓడింది. ♦ ఐపీఎల్ -2009 రెండో సీజన్ చాంపియన్‌గా ఆడమ్ గిల్‌క్రిస్ట్ సారథ్యంలోని డెక్కన్ చార్జర్స్ హైదరాబాద్ నిలవగా.. అనిల్ కుంబ్లే కెప్టెన్సీలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో బెంగళూరుపై 6 పరుగుల తేడాతో గెలిచిన హైదరాబాద్ జట్టు టైటిల్ కైవసం చేసుకుంది. ఈ సీజన్ ఆసాంతం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న హైదరాబాద్ కెప్టెన్ గిల్‌క్రిస్ట్ ప్లేయర్ ఆఫ్‌ది టోర్నీగా నిలిచాడు. బ్యాటింగ్‌లో 495 పరుగులు, కీపర్‌గా 18 డిసిమిసల్స్ సాధించాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు మాథ్యూ హెడెన్ 572 పరుగులతో ఆరెంజ్ క్యాప్ అందుకోగా.. డెక్కన్ చార్జర్స్ హైదరాబాద్ బౌలర్ ఆర్పీ సింగ్ 23 వికెట్లతో పర్పుల్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ♦ ఐపీఎల్ -2008 ఐపీఎల్ తొలి సీజన్ టైటిల్‌ను షేన్‌వార్న్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ జట్టు గెలవగా ధోని కెప్టెన్సీలోని చెన్నైసూపర్ కింగ్స్ రన్నరప్‌గా నిలిచింది. ఈ సీజన్లో రాజస్థాన్ ప్లేయర్ షేన్ వాట్సన్ బ్యాటింగ్‌లో 472 పరుగులతో బౌలింగ్‌లో 17 వికెట్లతో ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చి మ్యాన్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. ఇక కింగ్స్ఎలెవన్ పంజాబ్ ఆటగాడు షాన్ మార్ష్ 616 పరుగులతో ఆరేంజ్ క్యాప్ అందుకోగా.. రాజస్థాన్ ప్లేయర్ సోహైల్ తన్వీర్ 22 వికెట్లతో పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. ఈ సీజన్లో వీవీఎస్ లక్ష్మణ్ సారథ్యంలోని హైదరాబాదీ జట్టు డెక్కన్ చార్జర్స్14 మ్యాచ్‌లకు కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో నిలిచింది. - శివప్రసాద్ ఉప్పల -
కోల్‌కతా జోరు కొనసాగేనా!
- నేడు లాహోర్ లయన్స్‌తో పోరు - మరో మ్యాచ్‌లో హోబర్ట్తో కోబ్రాస్ ఢీ - చాంపియన్స్ లీగ్ టి20 సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్ చాంపియన్‌గా తమకున్న హోదాను నిలబెట్టుకుంటూ తొలి మ్యాచ్‌ను గెలుచుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్... చాంపియన్స్ లీగ్టి20లో మరో విజయంపై దృష్టి పెట్టింది. ఈ లీగ్‌లో హైదరాబాద్‌ను హోమ్‌గ్రౌండ్‌గా మార్చుకున్న నైట్‌రైడర్స్ ఆదివారం జరిగే పోరులో లాహోర్ లయన్స్‌తో తలపడనుంది. క్వాలిఫయింగ్ దశలో రెండు మ్యాచ్‌లు నెగ్గి ప్రధాన పోటీలకు అర్హత సాధించిన లయన్స్‌కు ఇదే తొలి మ్యాచ్. నేడు జరిగే మరో మ్యాచ్‌లో హోబర్ట్ హరికేన్స్ జట్టు కేప్ కోబ్రాస్‌ను ఎదుర్కొంటుంది. గంభీర్ రాణించేనా? ఐపీఎల్-7ను వరుసగా మూడు డకౌట్లతో ప్రారంభించిన నైట్‌రైడర్స్ కెప్టెన్ గంభీర్ ఈ టోర్నీలోనూ తొలి మ్యాచ్‌లో విఫలమయ్యాడు. టాపార్డర్‌లో అతను కీలక ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉంది. మరో ఓపెనర్, వికెట్‌కీపర్‌గా ఈ మ్యాచ్‌లో బిస్లా స్థానంలో ఉతప్ప వచ్చే అవకాశం ఉంది. ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్న ఉతప్ప పూర్తి ఫిట్‌గా ఉన్నట్లు సమాచారం. ఇక యూసుఫ్ పఠాన్, మనీశ్ పాండేలపై ఆ జట్టు బ్యాటింగ్ ఆధారపడుతోంది. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో చెలరేగిన ఆండ్రీ రసెల్, డస్కటేలపై కీలక బాధ్యత ఉంది. స్పిన్నర్‌గా నరైన్ ఒంటిచేత్తో మ్యాచ్‌ను శాసించగల సమర్థుడు. గత మ్యాచ్‌లో 4 ఓవర్లలో అతను కేవలం 9 పరుగులు ఇచ్చాడు. లాహోర్ ఆటగాళ్లు ఈ స్థాయి స్పిన్‌ను ఏ మాత్రం ఎదుర్కోగలరో చూడాలి. తక్కువ స్కోర్ల మ్యాచే అయినా... ఇద్దరు ప్రధాన పేసర్లు కమిన్స్, ఉమేశ్ గత మ్యాచ్‌లో భారీ పరుగులు ఇచ్చారు. అయితే వెంటనే తుది జట్టులో మార్పు ఉండకపోవచ్చు. లయన్స్ నిలబడగలరా క్వాలిఫయింగ్ దశలో ఆటతీరు గమనిస్తే లాహోర్ లయన్స్ జట్టు కూడా మెరుగ్గానే కనిపిస్తోంది. ముంబైపై సునాయాస విజయం సాధించిన ఆ జట్టు సదరన్ ఎక్స్‌ప్రెస్‌ను చిత్తు చేసింది. జట్టు విజయంలో కెప్టెన్ మొహమ్మద్ హఫీజ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆల్‌రౌండర్‌గా అతనే జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ఇక ఉమర్ అక్మల్, అహ్మద్ షహజాద్, నాసిర్ జంషెద్లతో పాటు వహాబ్ రియాజ్, అజీజ్ చీమావంటి అంతర్జాతీయ క్రికెటర్లు కూడా ఆ జట్టులో ఉన్నారు. సాద్ నసీమ్ మరో కీలక ఆటగాడు. సీఎల్‌టి20లో విజయం సాధించి తమదైన ముద్ర వేయాలని పట్టుదలగా ఉంది. శుభారంభం ఎవరిదో ఉప్పల్ స్టేడియంలోనే ఆదివారం జరిగే మరో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు కేప్ కోబ్రాస్, ఆస్ట్రేలియా జట్టు హోబర్ట్ హరికేన్స్ తలపడనున్నాయి. ఈ రెండు జట్లూ తాము ఆడిన తొలి లీగ్ మ్యాచ్‌లలో ఓటమిపాలయ్యాయి. దాంతో మొదటి విజయం కోసం ఇరు జట్లపై ఒత్తిడి నెలకొని ఉంది. బలాబలాలు చూస్తే రెండు టీమ్‌లు సమ ఉజ్జీలుగానే కనిపిస్తున్నాయి. హరికేన్స్‌లో బ్లిజార్డ్, డంక్, బొలింజర్లతో పాటు పాకిస్థానీ షోయబ్ మాలిక్ గుర్తింపు ఉన్న ఆటగాడు. కోబ్రాస్ టీమ్‌లో దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్ హషీం ఆమ్లా, ఫిలాండర్ మినహా చెప్పుకోదగ్గ క్రికెటర్లు ఎవరూ లేరు. లాహోర్ జట్టుకు సానియా ఇంట్లో విందు చాంపియన్స్ లీగ్‌లో ఆడేందుకు నగరానికి వచ్చిన పాకిస్థాన్ జట్టు లాహోర్ లయన్స్‌కు... శనివారం రాత్రి సానియా ఇంట్లో విందు ఇచ్చారు. ఇదే టోర్నీలో హోబర్ట్ హరికేన్స్ తరఫున ఆడుతున్న షోయబ్ మాలిక్... తన అత్తగారింట్లో ఈ విందును ఏర్పాటు చేశాడు. ‘సానియా తో పెళ్లయ్యాక నగరంలో తొలి మ్యాచ్ ఆడుతుండటం ఉద్వేగంగా అనిపిస్తోంది. సానియా విజయాల పట్ల నేను గర్వపడుతున్నాను. ఆమె మరిన్ని గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గాలని కోరుకుంటున్నా’ అని షోయబ్ వ్యాఖ్యానించాడు.