ఏపీలో ఐపీఎస్ల బదిలీ
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో నలుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది.
బదిలీ అయిన అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి..
⇒ విశాఖపట్నం ఐజీగా ఉన్న ఏ.శ్రీకుమార్ విశ్వజిత్ ఆర్డినేషన్ ఐజీగా బదిలీ అయ్యారు.
⇒ వెయిటింగ్లో ఉన్న ఎన్.శ్రీధర్రావుకు ఐజీ (సిబ్బంది)గా పోస్టింగ్ ఖరారుచేశారు.
⇒ అడిషనల్ డీజీపీ సి.అంజనా సిన్హాను బదిలీ చేసి, డీఐజీ ఆఫీసులో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు.
⇒ ఐదో బెటాలియన్(విజయనగరం) కమాండెంట్ కె. కోటేశ్వరరావును ఇంటెలిజెన్స్ ఎస్పీగా బదిలీ అయ్యారు.