IRA singhal
-
సివిల్స్ టాపర్‌కు వచ్చింది.. 53 శాతమే!
అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో పేపర్లు ఎంత కఠినంగా దిద్దుతారో తెలుసా.. అందులో టాప్ ర్యాంకు సాధించిన ఇరా సింఘాల్‌కు వచ్చిన మార్కులు 53.43 శాతం మాత్రమే! ఈ మార్కులే సివిల్స్ పేపర్లను ఎంత కచ్చితంగా, కఠినంగా దిద్దుతారనేందుకు నిదర్శనం. ఇరా సింఘాల్ సహా, మెయిన్స్ పాసయిన మొత్తం అందరు అభ్యర్థుల మార్కుల షీట్లను ఆన్లైన్లో పెట్టారు. సివిల్స్‌లో ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ అనే మూడు దశలుంటాయన్న విషయం తెలిసిందే. ఈ మూడింటినీ దాటినవాళ్లు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి సర్వీసులకు వెళ్తారు. 2014 సివిల్స్‌లో టాప్ ర్యాంకు సాధించిన ఇరా సింఘాల్ మొత్తం 2025కు గాను 1082 మార్కులు మాత్రమే సాధించారు. మెయిన్స్ 1750, ఇంటర్వ్యూ 275 మార్కులకు ఉంటాయి. రెండో ర్యాంకు సాధించిన రేణు రాజ్ 52.14 శాతం, మూడో ర్యాంకు పొందిన నిధి గుప్తా 50.61 శాతం మాత్రమే మార్కులు పొందారు. -
అగ్రస్థానంలో ఉన్నా.. పోస్టింగ్ దక్కేనా?!
2010లో ఐఆర్ఎస్ సాధించిన ఇరా.. * వైకల్యం వల్ల పోస్టింగ్ ఇవ్వని సర్కారు న్యూఢిల్లీ: ఈ ఏడాది యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో.. ఢిల్లీకి చెందిన ఇరా సింఘాల్ మొదటి ర్యాంకుతో అగ్రస్థానంలో నిలిచారు. అయితే.. శారీరక అంగవైకల్యం గల ఇరాకు ఈసారైనా పోస్టింగ్ లభిస్తుందా లేదా అన్న సందేహం ఆమె కుటుంబ సభ్యుల్లో నెలకొని ఉండటంతో.. ఆమె నివాసం వద్ద పెద్దగా సంతోషం, సంబరాలు కనిపించలేదు. ఇరా సింఘాల్ 2010లో ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ (ఐఆర్ఎస్)కు ఎంపికయినప్పటికీ.. ఆమెకు పోస్టింగ్ లభించలేదు. తొలుత రెవెన్యూ విభాగమే ఆమెకు ఉద్యోగం ఇచ్చేందుకు తిరస్కరించిందని.. తర్వాత ఆ శాఖ అంగీకరించినప్పటికీ.. శిబ్బంది, శిక్షణా విభాగం ఒప్పుకోలేదని ఆమె తండ్రి రాజేందర్సింఘాల్ పేర్కొన్నారు. దీనిపై న్యాయపోరాటం చేసిన ఇరా.. 2014లో ఆ పోరాటంలో గెలిచారు. ఢిల్లీ ఎన్ఎస్ఐటీ (నేతాజీ సుభాష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) నుంచి ఇంజనీరింగ్ పట్టభద్రురాలైన ఇరా.. ఎఫ్ఎంఎస్లో ఎంబీఏ పూర్తిచేశారు. సివిల్ సర్వీసెస్ పరీక్షను ఆమె సాధారణ కేటగిరీలోనే రాశారు. తాజా ఫలితాలపై ఇరా స్పందిస్తూ చాలా సంతోషం వ్యక్తంచేశారు. ఆశ్చర్యం...ఆనందం వేసింది ‘డిసాక్షి’తో సివిల్స్ ఆల్ ఇంయా ఫస్ట్ ర్యాంకర్ ఇరా సాక్షి, హైదరాబాద్: ‘‘సివిల్స్ తుది ఫలితాల్లో అఖిల భారత స్థాయి లో మొట్టమొదటి ర్యాంకు సాధించానంటే నమ్మలేకపోతున్నా. ఒక్కసారిగా అవాక్కయ్యా. ఆశ్చర్యానందాలు కలుగుతున్నాయి. మాటల్లో చెప్పలేను’’ అని ఇరా సింఘాల్ శనివారం ‘సాక్షి’తో పేర్కొన్నారు. కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ శాఖలో ఐఆర్ఎస్గా పనిచేస్తున్న ఆమె శిక్షణలో భాగంగా హైదరాబాద్ మర్రిచెన్నారెడ్డి మానవవనరుల కేంద్రానికి వచ్చారు. వికలాంగురాలైన తాను ఐఏఎస్‌గా వికలాంగుల అభ్యున్నతికి కషి చేస్తానన్నారు. కూతుళ్లను ఉన్నత చదువులు చదివించాలని తల్లిదండ్రులకు సూచించారు. హైదరాబాద్ వాతావరణం తనకెంతో నచ్చిందన్నారు. -
సివిల్స్‌లోనూ అమ్మాయిలు టాప్ లేపారు
న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్- 2014 ఫలితాల్లో అమ్మాయిలు అసాధారణ ప్రతిభ కనబరిచారు. దేశంలోని అత్యున్నత ప్రభుత్వ సర్వీసు నియామకాలకు సంబంధించిన సివిల్స్ పరీక్షల ఫలితాలు శనివారం వెల్లడయ్యాయి. ఈ ఏడాది మొదటి అయిదు ర్యాంకుల్లో నాలుగు ర్యాంకులను అమ్మాయిలు కైవసం చేసుకున్నారు. ఇరా సింఘాల్ మొదటి ర్యాంకు సాధించగా, రేణు రాజ్, నిధి గుప్తా, వందనా రావ్ వరుసగా 2, 3, 4 ర్యాంకులలో నిలిచారు. ఓవరాల్ ఐదో ర్యాంకు సాధించిన సుహర్ష భగత్.. పురుషుల్లో ప్రథమస్థానంలో నిలిచాడు. యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ లో ఫలితాలు చూడొచ్చు. ఇక తెలుగు విద్యార్థులు సాకేత్ రాజా 14వ ర్యాంకు, లక్ష్మీకాంత్ రెడ్డి 21వ ర్యాంకు పొందారు. గత ఆగస్టు 24న 2,137 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలు రాయగా, వారిలో 1,236 మంది ఇంటర్వ్యూకు హాజరయ్యేందుకు అర్హత సాధించారు. నిజానికి దేశవ్యాప్తంగా 1,364 సివిల్ సర్వెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ ఆ సఖ్య కంటే తక్కువ మంది అభ్యర్థులు తుది దశకు ఎంపిక కావడం గమనార్హం.