ప్రత్యేక హోదా సాధన కోసం తిరుమలకు పాదయాత్ర
మైదుకూరు టౌన్: రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డి తనయుడు దువ్వూరు మాజీ ఎంపీపీ గోపాల్‌రెడ్డి ఆధ్వరంలో గురువారం దువ్వూరు నుంచి తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రను తిరుపాల్‌రెడ్డి ప్రారంభించి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలకుల మనసులు మారి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం కోసం ఈ పాదయాత్రను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. దాదాపు 40 మందితో కలసి తిరుమలకు బయలుదేరి వెళ్లారు. ఈ పాదయాత్రలో ఎం.రామ్‌నాథ్‌రెడ్డి, వీరారెడ్డి, శివానందరెడ్డి, యల్లారెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాదయాత్ర మైదుకూరు సమీపంలో కి రాగానే వైఎస్సార్సీపీ నాయకులు గోశెట్టి లక్షుమయ్య, ధనపాల జగన్, రవీంద్రలు ఘన స్వాగతం పలికి సంఘీభావం పలికారు.