ముంబై భారీస్కోరు
రెస్టాఫ్ ఇండియాతో ఇరానీ కప్
ముంబై: సూర్యకుమార్ యాదవ్ (271 బంతుల్లో 156; 24 ఫోర్లు, 1 సిక్సర్) భారీ సెంచరీతో ఇరానీ కప్లో రంజీ చాంపియన్ ముంబై భారీ స్కోరు సాధించింది. తొలి ఇన్నింగ్స్లో ముంబై 158.2 ఓవర్లలో 603 పరుగులు చేసి ఆలౌటయింది. ఆదిత్య తారే (65), సిద్ధేశ్ లాడ్ (66) రాణించారు. రెస్ట్ జట్టు బౌలర్లలో జయంత్ యాదవ్ నాలుగు వికెట్లు తీశాడు. తర్వాత రెస్టాఫ్ ఇండియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 16 ఓవర్లలో వికెట్ నష్టానికి 36 పరుగులు చేసింది. ఆంధ్ర క్రికెటర్ శ్రీకర్ భరత్ (16) అవుటయ్యాడు. ఫజల్ 18 పరుగులతో, జయంత్ యాదవ్ ఒక్క పరుగుతో క్రీజులో ఉన్నారు.