Iranian woman case
-
మహ్సా అమినికి
స్ట్రాస్‌బర్గ్(ఫ్రాన్సు): గత ఏడాది ఇరాన్ పోలీస్ కస్టడీలో మృతి చెందిన కుర్దిష్–ఇరాన్ మహిళ మహ్సా అమిని(22)కి యూరోపియన్ యూనియన్ అత్యున్నత మానవ హక్కుల పురస్కారం ప్రకటించింది. మానవహక్కులు, ప్రాథమిక స్వేచ్ఛ కోసం పోరాడే వారికి సఖరోవ్ పురస్కారాన్ని యూరోపియన్ యూనియన్ ఏటా ప్రకటిస్తోంది. డిసెంబర్ 13న జరిగే కార్యక్రమంలో మహ్సా అమిని కుటుంబీకులకు ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు. హిజాబ్ ధరించలేదనే కారణంతో మహ్సా అమినిని నైతిక విభాగం పోలీసులు అరెస్ట్ చేశారు. కస్టడీలో ఉండగానే ఆమె గత ఏడాది సెప్టెంబర్ 16న మృతి చెందారు. ఇది ప్రభుత్వ హత్యేనంటూ దేశవ్యాప్తంగా కొన్ని నెలలపాటు తీవ్ర ఆందోళనలు కొనసాగాయి. ప్రభుత్వం వాటిని బలప్రయోగంతో అణచివేసింది. గత ఏడాది సఖరోవ్ పురస్కారాన్ని రష్యా దురాక్రమ ణను ఎదురొడ్డి పోరాడుతున్న ఉక్రెయిన్ పౌరులకు ప్రకటించారు. ఈ అవార్డును ఒకప్పటి సోవియెట్ యూనియన్ అసమ్మతి వాది ఆండ్రీ సఖరోవ్ పేరిట 1988లో నెలకొల్పారు. నోబెల్ శాంతి బహుమతి అందుకున్న సఖరోవ్ 1989లో మరణించారు -
నాపై పలుమార్లు అత్యాచారం చేశాడు.. నటి భర్తపై ఫిర్యాదు
రాఖీ సావంత్ భర్త ఆదిల్ దురానీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే భర్త మోసం చేశాడంటూ ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేసింది రాఖీ సావంత్. తాజాగా ఆదిల్‌పై మరో మహిళ పోలీసులను ఆశ్రయించింది. తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఇరాన్ మహిళ ఆరోపించింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనతో పెళ్లికి నిరాకరించాడని.. అలాగే చాలా మంది అమ్మాయిలతో ఇలాంటి సంబంధాలు కలిగి ఉన్నాడని ఆ మహిళ ఆరోపించింది. ఇరాన్ మహిళ ఫిర్యాదుతో రాఖీ సావంత్ భర్త ఆదిల్ దురానీపై మైసూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మైసూర్లో సహజీవనం చేసేటప్పుడు పెళ్లి పేరుతో ఆదిల్ తనపై అత్యాచారం చేశాడని ఇరాన్ మహిళ ఆరోపించింది. అయితే ప్రస్తుతం రాఖీ సావంత్ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు ఆదిల్. ఐదు నెలల క్రితం తనను పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేయగా.. బెదిరించాడని ఇరానీ మహిళ పోలీసులకు తెలిపింది. పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని బెదిరించాడని పేర్కొంది. అతనితో సన్నిహితంగా ఉన్న ఫోటోలను లీక్ చేస్తానని చెప్పాడని వాపోయింది. ఈ వార్త విన్న రాఖీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఇప్పటికే ఆదిల్‌పై రాఖీ ఓషివారా పోలీసులకు ఫిర్యాదు చేయగా అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆదిల్ తనను మానసికంగా, శారీరకంగా హింసించాడని రాఖీ కంప్లెంట్లో పేర్కొంది. ఆదిల్‌కు వివాహేతర సంబంధం ఉందని ఆమె ఆరోపించింది. View this post on Instagram A post shared by Rakhi Sawant (@rakhisawant2511) -
సారీ.. నేను సాయం చేయలేను: సుష్మా
న్యూఢిల్లీ: కష్టాల్లో ఉన్న ప్రవాస భారతీయులు ఎవరైనా ట్వీట్ చేసిన వెంటనే విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్పందిస్తారు. వారి కష్టాలను తెలుసుకుని సాయం చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తారు. కాగా భారత్‌లో కష్టాల్లో ఉన్న ఓ ఇరానీ మహిళకు సాయం చేయాల్సిందిగా ఒడిశా ప్రభుత్వం విన్నవించగా.. తాను ఆమె విషయంలో సాయం చేయలేననని సుష్మా చెప్పారు. ఇరానీ మహిళ కేసు కోర్టు పరిధిలో ఉందని, అందువల్ల తాను జోక్యం చేసుకోలేనని స్పష్టం చేశారు. ఇరాన్లో జన్మించి బ్రిటీష్ పౌరసత్వం కలిగిన నర్గెస్ అష్టారికి ఓ కేసులో ఒడిశా కోర్టు 3 లక్షల రూపాయల జరిమానా, ఏడాది జైలు శిక్ష విధించింది. ఆమె పైకోర్టులో అప్పీలు చేయగా, కేసు పెండింగ్‌లో ఉంది. బెయిల్‌పై ఆమె విడుదలైంది. అష్టారికి సాయం చేయాల్సిందిగా ఒడిశా ప్రభుత్వం సుష్మా దృష్టికి తీసుకెళ్లగా.. ఆమె కేసు న్యాయస్థానంలో ఉన్నందును తాను సాయం చేయడం సాధ్యంకాదని బదులిచ్చారు. అష్టారి కేసుకు సంబంధించిన వివరాలను ఒడిశా ప్రభుత్వం నుంచి సుష్మా తెలుసుకున్నారు. 2011లో ఒడిశాలో ఓ ఎన్జీవో (ఏఎస్ఎస్‌ఐఎస్‌టీ) తరఫున పనిచేసేందుకు ఆమెకు వీసా మంజూరైంది. ఆ తర్వాత అష్టారి సొంతంగా ఎన్జీవో ప్రిషన్ ఫౌండేషన్‌ను స్థాపించింది. ఒడిశాలోని రాయగఢ్ జిల్లాలో సొంత డబ్బులతో బాలికల కోసం ఓ అనాథాశ్రమాన్ని ఏర్పాటు చేసింది. 2014లో ఓ అంధ బాలుడు ప్రమాదవశాత్తూ ఓ నదిలో పడి గల్లంతయ్యాడు. అతని తల్లిదండ్రులు అదే పాఠశాలలో పనిచేస్తారు. కాగా ఏఎస్ఎస్‌ఐఎస్‌టీ ఒత్తిడి మేరకు వాళ్లు అష్టారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కొడుకును ఆమె నదిలో తోసి చంపిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.