ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఈ కక్ష్య దూరం పెంపు
శ్రీహరికోట(సూళ్లూరుపేట): సతీష్ ధవన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి ప్రయోగించిన ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం(ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఈ) ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టడంలో భాగంగా ఇస్రో మొదటి ఆపరేషన్ చేపట్టింది. హసన్ కేంద్రం నుంచిశాస్త్రవేత్తలు విడతల వారీగా కక్ష్య దూరాన్ని పెంచుతున్నారు.
గురువారం ఉదయం 9.41కు ఉపగ్రహ ఇంధనాన్ని పాటు మండించి 284.1కి.మీ.గా ఉన్న పెరిజీ (భూమికి దగ్గర)ను పెంచుతూ 320 కి.మీ.కి 20,667 కి.మీ. అపోజీ(భూమికి దూరంగా)ని 35,882 కి.మీకి పెంచారు.